Prabhas to Anushka: పెళ్లి కన్నా యాక్టింగ్ ముఖ్యం.. టాలీవుడ్‌లో సింగిల్‌గా మిగిలిపోయిన సెలబ్రిటీస్

Tollywood Celebrities Who are Single:సినీ ఇండస్ట్రీ ఒక అద్భుతమైన రంగుల ప్రపంచం. ఈ ప్రపంచంలో పలు రకాల వ్యక్తిత్వాలు కలిగిన మనుషులను మనం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా అభిమానులు ఆరాధించే కొందరు స్టార్ యాక్టర్లు తమ జీవితంలో ఒంటరితనానికి ఓటు వేస్తున్నారు. ఏదో కొన్ని కారణాలవల్ల బంధానికి దూరంగా వెళ్లిన వాళ్ళు కొందరైతే.. అసలు వివాహమే వద్దు అనుకొని సైలెంట్ గా సింగిల్ గా ఉండిపోకొందర వాళ్లు మరికొందరు. ప్రభాస్ దగ్గర నుంచి అనుష్క వరకు ఆ లిస్టులో ఉన్న స్టార్ యాక్టర్స్ ఎవరో ఓ లుక్ వేద్దాం పదండి..

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 30, 2024, 09:16 PM IST
Prabhas to Anushka: పెళ్లి కన్నా యాక్టింగ్ ముఖ్యం.. టాలీవుడ్‌లో సింగిల్‌గా మిగిలిపోయిన సెలబ్రిటీస్

Telugu Actors Who are Single: ఆన్ స్క్రీన్ ఎన్నో కథలకు ప్రాణం పోసి ..లవ్ స్టోరీ లకు ఎనర్జీ ఇచ్చి ..రొమాన్స్ను ఓ రేంజ్ లో ప్రదర్శించిన ఎందరో స్టార్ యాక్టర్లు నిజజీవితంలో ఒంటరిగా మిగిలిపోతున్నారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లు అంటూ ప్రచారం జరుగుతున్న.. సంవత్సరాలు గడుస్తున్న వీళ్ళ పెళ్లికి సంబంధించిన వార్తలు మాత్రం వినిపించడం లేదు. హీరోలే అనుకుంటే కొందరు హీరోయిన్లు కూడా ఇదే బాట పట్టేస్తున్నారు. ఇంతకీ ఆ యాక్టర్లు ఎవరు? అసలు దీని వెనుక కారణం ఏమిటి? అనే వివరాల్లోకి వెళ్తే..

ప్రభాస్:

ఆరడుగులకు పైగా భారీ కటౌట్ తో ఉండే ఈ టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వయసు 44 సంవత్సరాలు. పెళ్లి గురించి ఎప్పుడు ప్రశ్నించిన.. టాపిక్ మార్చేస్తాడు. చాలాకాలంగా ప్రభాస్ అతని కోస్టార్ అనుష్క మధ్య ఏదో ఉందని త్వరలో పెళ్లి జరుగుతుందని ప్రచారం జరుగుతుంది. సంవత్సరాలు గడుస్తున్న ఈ విషయంలో క్లారిటీ మాత్రం ఎవరికి రావడం లేదు. డార్లింగ్ పెళ్లి కోసం అతని అభిమానులు కూడా ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు.

విశాల్:

తెలుగు ,తమిళ్ మూవీస్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరో విశాల్. డీసెంట్ కంటెంట్ తో ఉండే సినిమాలు చేస్తూ ఇటు క్లాస్ ఆడియన్స్ ని అటు మాస్ ఆడియన్స్ ని మెప్పించే ఈ యాక్టర్ కు 2019లో అనీషా అల్లాతో నిశ్చితార్థం జరిగింది. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసేసారు.. 45 ఏళ్లు వయసు ఉన్న ఈ నటుడు ఇప్పటికి కూడా సింగిల్ గానే ఉన్నాడు.

ఆర్ నారాయణ మూర్తి

ఎర్రజెండా.. నారాయణ మూర్తి కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లో రెబల్ చిత్రాలకు.. నారాయణమూర్తి కేర్ ఆఫ్ అడ్రస్. 70 ఏళ్ల వయసులో కూడా సింగిల్ గా ఉండే ఈ హీరో.. వయసులో ఉన్నప్పుడు తన కులం కానీ అమ్మాయిని ప్రేమించడంతో తల్లిదండ్రులు ఆ పెళ్ళికి ఒప్పుకోలేదు. ఇక అప్పటినుంచి నారాయణమూర్తి ఒంటరిగానే మిగిలిపోయారని రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

అనుష్క శెట్టి

టాలీవుడ్ స్వీటీ 42 సంవత్సరాల వయసులో కూడా సింగిల్ గానే ఉంటుంది. టాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ఫుల్ హీరోయిన్ గా ఉన్న ఈ బ్యూటీ తన పెళ్లి గురించి ఇప్పటివరకు పెదవి విపకపోవడం పెద్ద మిస్టరీ.

సుమంత్

సుమంత్ యార్లగడ్డ  ఒకప్పుడు కీర్తి రెడ్డిని పెళ్లి చేసుకొని సడన్గా విడాకులు తీసుకున్నాడు. కీర్తి రెడ్డి రెండో పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయినప్పటికీ సుమంత్ మాత్రం సోలో బతుకే సో బెటరు అంటున్నాడు.

త్రిష కృష్ణన్

స్టార్ హీరోయిన్ త్రిష కు 2015లో చెన్నైకి చెందిన ఒక వ్యాపారవేత్తతో నిశ్చితార్థం జరిగింది. అయితే సడన్గా ఈ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ కావడమే కాకుండా అప్పటినుంచి ఇప్పటివరకు తిరిగి త్రిష పెళ్లికి సంబంధించిన ఊసే లేదు. 39 ఏళ్ల ఈ హీరోయిన్ కెరీర్ పై కాన్సన్ట్రేట్ చేస్తూ సింగిల్ గానే ఉంటుంది.

Also Read: Kishan Reddy Letter: కేసీఆర్‌ పట్టించుకోలే మీరైనా సహకరించండి.. సీఎం రేవంత్‌కు కిషన్‌ రెడ్డి లేఖ

Also Read: Assistant Loco Pilot Jobs: పదో తరగతి పాసైతే చాలు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కొట్టేయొచ్చు

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News