Prabhas Sukumar Movie : ప్రభాస్ సుకుమార్‌ కాంబో ఫిక్స్.. కోట్లలో అడ్వాన్స్‌ ఇచ్చేశారట

Prabhas Sukumar Movie ప్రభాస్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఓ వైపు సలార్, మరో వైపు ప్రాజెక్ట్ కే అంటూ బిజీగా ఉన్నాడు. మధ్యలో మారుతి సినిమాను కూడా లైన్‌లో పెట్టేశాడు. అయితే తాజాగా కొత్త సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 26, 2022, 06:15 PM IST
  • ప్రభాస్ సినిమాల లిస్ట్ వైరల్
  • సుకుమార్‌తో ప్రభాస్ చిత్రం
  • భారీ ఎత్తున అభిషేక్ అగర్వాల్ ప్లాన్?
Prabhas Sukumar Movie : ప్రభాస్ సుకుమార్‌ కాంబో ఫిక్స్.. కోట్లలో అడ్వాన్స్‌ ఇచ్చేశారట

Prabhas Sukumar Movie ప్రభాస్ సుకుమార్ మూవీ మీద ఇప్పుడు కొత్తగా టాక్స్ మొదలయ్యాయి. ప్రభాస్‌కు సుకుమార్ లైన్ చెప్పాడని, డార్లింగ్‌కి కూడా అది బాగా నచ్చిందని తెలుస్తోంది. ప్రభాస్ ప్రస్తుతం తన సినిమాలన్నీ పూర్తి చేశాక సుకుమార్‌ ప్రాజెక్ట్ ఉంటుందని తెలుస్తోంది. ఇక సుకుమార్ సైతం తన పుష్ప ది రూల్ సినిమాను పూర్తి చేశాకే ప్రభాస్ సినిమా మీద ఫోకస్ పెడతాడట. అయితే ఈ క్రమంలోనే నిర్మాత అభిషేక్ అగర్వాల్ మాత్రం ఈ ఇద్దరికీ భారీ ఎత్తున అడ్వాన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

గత కొన్ని రోజుల క్రితం డార్లింగ్ ప్రభాస్‌ను నిర్మాత అభిషేక్ అగర్వాల్ కలిసిన సంగతి తెలిసిందే. అంతకు ముందు సుకుమార్‌ను అభిషేక్ అగర్వాల్, వివేక్ అగ్నిహోత్రి కలిశారు. వీరి కాంబోలో ఏదైనా సినిమా రాబోతోందా? అనే డౌట్ అందరికీ వచ్చింది. ఇప్పుడు వచ్చిన సమాచారం మేరకు.. ఆ ముగ్గురు కలిసింది ప్రభాస్ కోసమే అని తెలుస్తోంది. మరి ఈ ప్రాజెక్ట్ అయితే ఇప్పట్లో పట్టాలెక్కేలా కనిపించడం లేదు. దగ్గరదగ్గరగా ఈ చిత్రం 2024లో ప్రారంభమవుతుందేమో చూడాలి.

ఇక ప్రభాస్ ప్రస్తుతం సలార్, ప్రాజెక్ట్ కే, మారుతి సినిమా, సందీప్ రెడ్డి స్పిరిట్ కంప్లీట్ చేయాల్సి ఉంది. పుష్ప ది రూల్ తరువాత రామ్ చరణ్‌తో సుకుమార్ సినిమా తీస్తాడని అంతా అనుకున్నారు. విజయ్‌తో సినిమాను ఆల్రెడీ సుకుమార్ పక్కనపెట్టేశాడట. మరి రామ్ చరణ్‌, ప్రభాస్‌ల సినిమాల్లో సుకుమార్ ఏది ముందుగా కంప్లీట్ చేస్తాడో చూడాలి.

ప్రభాస్ అయితే ప్రస్తుతం మారుతి సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. జనవరిలో సలార్ సినిమా సెట్‌లో ప్రభాస్ అడుగుపెట్టేస్తాడట. జనవరి షెడ్యూల్‌తో సలార్ సినిమా షూటింగ్ పూర్తి కానున్నట్టు తెలుస్తోంది. పుష్ప ది రూల్ అయితే కేవలం ఐదు రోజుల షూటింగ్ మాత్రమే జరిపారని తెలుస్తోంది.

Also Read : Sushant Singh Rajput post mortem : సుశాంత్ సింగ్‌ది ఆత్మహత్య కాదు.. హత్యే!.. పోస్ట్ మార్టం చేసిన వ్యక్తి చెప్పాడట.. ట్వీట్ వైరల్

Also Read : Dhamaka Vs 18 Pages : మాస్ సినిమాలకు ఉండే క్రేజ్ అదే.. 18 pages సినిమాపై ధమాకాదే పై చేయి

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News