Prabhas house in Mumbai: ముంబై బీచ్ ఒడ్డున ప్రభాస్ ఇల్లు

Prabhas searching for house in Mumbai: బాహుబలి మూవీ తర్వాత ప్యాన్ ఇండియా స్టార్‌గా పేరు తెచ్చుకున్న ప్రభాస్‌కి ఆ తర్వాత బాలీవుడ్‌లోనూ మంచి మార్కెట్ ఏర్పడింది. దీంతో బాహుబలి తర్వాత సైన్ చేసిన సాహో మూవీతో పాటు రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్, నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో తెరకెక్కనున్న సినిమాలన్నీ ప్యాన్ ఇండియా సినిమాలుగానే రానున్నాయి.

Last Updated : Mar 2, 2021, 11:18 PM IST
  • Baahubali తర్వాత అన్ని ప్యాన్ ఇండియా సినిమాలు చేస్తున్న ప్రభాస్.
  • బాలీవుడ్ ప్రాజెక్ట్స్, ప్యాన్ ఇండియా మూవీస్ షూటింగ్స్, చర్చల కోసం తరచుగా ముంబై వెళ్తున్న Prabhas.
  • ముంబైలోనే పర్మనెంట్ అడ్రస్ చూసుకుంటున్న Prabhas కు Help చేస్తున్న టి సిరీస్ అధినేత భూషణ్ కుమార్.
Prabhas house in Mumbai: ముంబై బీచ్ ఒడ్డున ప్రభాస్ ఇల్లు

Prabhas searching for house in Mumbai: బాహుబలి మూవీ తర్వాత ప్యాన్ ఇండియా స్టార్‌గా పేరు తెచ్చుకున్న ప్రభాస్‌కి ఆ తర్వాత బాలీవుడ్‌లోనూ మంచి మార్కెట్ ఏర్పడింది. దీంతో బాహుబలి తర్వాత సైన్ చేసిన సాహో మూవీతో పాటు రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్, నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో తెరకెక్కనున్న సినిమాలన్నీ ప్యాన్ ఇండియా సినిమాలుగానే రానున్నాయి. అలా బాలీవుడ్‌‌లో బిజీ అయిన ప్రభాస్ తరచుగా ముంబైలో ల్యాండ్ అవుతున్నాడు. ముంబైలోనే ఎక్కువ రోజులు గడపాల్సి వస్తుండటంతో అక్కడే ఇల్లు చూసుకునే పనిలో పడ్డాడు ప్రభాస్. 

ముంబైలో ఇంటి కోసం (Flat in Mumbai) వేట మొదలుపెట్టిన ప్రభాస్‌కి టి- సిరీస్ అధినేత భూషణ్ కుమార్ సహాయం చేస్తున్నట్టు బాలీవుడ్ మీడియా చెబుతోంది. ఆదిపురుష్ మూవీ నిర్మాతల్లో ఒకరైన భూషణ్ కుమార్ తమ సినీ హీరో ప్రభాస్ కోసం సముద్రం ఒడ్డున Sea facing Apartments లో అన్వేషిస్తున్నట్టు బాలీవుడ్ మీడియా టాక్. 

Also read : Anchor Anasuya in Pushpa movie: పుష్ప సినిమాలో పాత్రపై క్లారిటీ ఇచ్చిన యాంకర్ అనసూయ

బాహుబలి సినిమాతో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ప్రభాస్ ప్రస్తుతం రూ. 75 కోట్లకుపైగానే పారితోషికం చార్జ్ చేస్తున్నాడనేది సినీవర్గాలు చెబుతున్న అనధికారిక సమాచారం. రాధేశ్యామ్ షూటింగ్ పూర్తి చేసుకున్న ప్రభాస్ ప్రస్తుతం Salaar shooting లో పాల్గొంటున్నాడు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News