𝐏𝐫𝐨𝐣𝐞𝐜𝐭 𝐊 Release Date : అదిరిపోయిన అప్డేట్.. సంక్రాంతికి రచ్చ రచ్చే.. పోస్టర్ వైరల్

𝐏𝐫𝐨𝐣𝐞𝐜𝐭 𝐊 Release Date ప్రభాస్ ప్రాజెక్ట్ కే రిలీజ్ డేట్‌ను తాజాగా ప్రకటించారు. మహా శివరాత్రి ప్రాజెక్ట్ కే వచ్చే ఏడాది సంక్రాంతికి థియేటర్లోకి రాబోతోంది. జనవరి 12న ఈ చిత్రం థియేటర్లోకి రాబోతోందంటూ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 18, 2023, 12:09 PM IST
  • మహా శివరాత్రి స్పెషల్
  • ప్రభాస్ ప్రాజెక్ట్ కే అప్డేట్
  • వచ్చే ఏడాది సంక్రాంతికి సందడే
𝐏𝐫𝐨𝐣𝐞𝐜𝐭 𝐊 Release Date : అదిరిపోయిన అప్డేట్.. సంక్రాంతికి రచ్చ రచ్చే.. పోస్టర్ వైరల్

𝐏𝐫𝐨𝐣𝐞𝐜𝐭 𝐊 Release Date ప్రభాస్ ప్రాజెక్ట్ కే సినిమాను పాన్ వరల్డ్‌ లెవెల్లో తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం వైజయంతీ మూవీస్ లెక్కలేనంతగా ఖర్చు పెడుతోంది. కొత్త టెక్నాలజీని వాడుతోంది. నాగ్ అశ్విన్ ఏదో కొత్త ప్రపంచాన్ని సృష్టించినట్టుగా కనిపిస్తోంది. ఇప్పుడు మహా శివరాత్రి సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. వచ్చే ఏడాది సంక్రాంతికి అంటే జనవరి 12న ఈ సినిమా థియేటర్లో సందడి చేయబోతోంది.

 

మహానటి తరువాత నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో దీనిపై మరింతగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా కోసం మహింద్రా కంపెనీ నుంచి సపరేట్‌గా ఇంజనీర్లు రావడం, సినిమా కోసం ప్రత్యేకంగా కార్లను తయారు చేయించడం చూస్తుంటే నాగ్ అశ్విన్ విజన్ ఎలా ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు.

హాలీవుడ్‌ సినిమాలకు ధీటుగా ఈ చిత్రం ఉండబోతోందని చెప్పకనే చెప్పేస్తున్నారు. ఇది పాన్ వరల్డ్ సినిమాగా వస్తోందంటూ నాగ్ అశ్విన్ ఇది వరకే ఎన్నో సార్లు చెప్పేశాడు. మామూలుగా అయితే ఈ సినిమాను ఈ ఏడాది దసరాకే విడుదల చేయాలని అశ్వనీదత్ అనుకున్నాడు. దసరా ప్లస్ ప్రభాస్ బర్త్ డే కలిసి వస్తుందని ఆశించాడు. కానీ ఇప్పుడు కొత్త డేట్‌ను ప్రకటించేశారు మేకర్లు.

ఈ సినిమా తమ బ్యానర్‌లో యాభవ సినిమా అవుతుండటంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు అశ్వనీదత్. ఇక నాగ్ అశ్విన్ సైతం ప్రభాస్‌కు ప్రస్తుతం ఉన్న ఇమేజ్‌ను వాడుకునేలానే కొత్త ప్రపంచాన్ని, కొత్త కథను క్రియేట్ చేసినట్టు టాక్. మరి ఈ సినిమా ప్రభాస్‌కు ఎలా ఉపయోగపడుతుందో చూడాలి.

ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆదిపురుష్‌ షూటింగ్ పూర్తయినా సీజీ, వీఎఫ్‌ఎక్స్ పనుల్లో బిజీగా ఉంది యూనిట్. సలార్ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ నెలలోనే సలార్ షూటింగ్ కూడా పూర్తవుతుందని టాక్. ఇక మారుతి సినిమాను ప్రభాస్ సైలెంట్‌గా కంప్లీట్ చేసేస్తున్నాడు. ఇవన్నీ అయ్యాక సందీప్ రెడ్డి వంగా స్పిరిట్, సిద్దార్థ్ ఆనంద్ సినిమాలను పట్టాలెక్కించే పనిలో ప్రభాస్ ఉన్నాడన్న సంగతి తెలిసిందే.

Also Read:  vinaro bhagyamu vishnu katha Review : వినరో భాగ్యము విష్ణు కథ రివ్యూ.. కిరణ్ అబ్బవరం పాస్ అయ్యాడోచ్

Also Read: Samantha Ruth Prabhu on Rana : ఆగలేకపోతోన్నా!.. వెంకీమామా, రానాలపై సమంత ప్రేమ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News