Prabhas Maruthi Movie: ఫస్ట్ లుక్,‌ టైటిల్ అప్డేట్ ఇచ్చేసిన మారుతీ.. మరోసారి డార్లింగ్ గా ప్రభాస్

Prabhas Maruthi Movie Updates: సలర్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు ప్రభాస్. ప్రభాస్ అభిమానులు ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ సంబరాలు చేసుకుంటుండగా ఇప్పుడు తన తదుపరిచిత్రం అప్డేట్ కూడా ఇచ్చేసి మరింత ఖుషి చేస్తున్నారు..

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 29, 2023, 02:59 PM IST
Prabhas Maruthi Movie: ఫస్ట్ లుక్,‌ టైటిల్ అప్డేట్ ఇచ్చేసిన మారుతీ.. మరోసారి డార్లింగ్ గా ప్రభాస్

Prabhas Maruthi Movie Update: వరుస సినిమాలతో బిజీగా ఉన్న రెబల్ స్టార్ ప్రభాస్ డైరెక్టర్ మారుతితో కూడా ఒక చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించినప్పటికీ చాలా రోజుల నుంచి షూటింగ్ ని మాత్రం జరుపుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే పలు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను దర్శకుడు మారుతి ఇప్పుడు అఫీషియల్ గా అనౌన్స్ చేయడంతో పాటు మూవీ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్ధమయ్యారని అప్పుడే ఇచ్చేసారు.

మారుతి తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేసిన అప్డేట్ ప్రభాస్ అభిమానులకు సంక్రాంతి కానుకగా ఈ సినిమా అప్డేట్ ని ఇవ్వబోతున్నారట. అదే రోజు సినిమాని అఫీషియల్ గా ప్రకటిస్తూ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయనున్నారట. ఇప్పటికే ఈ మూవీ నుంచి లీక్ అయిన ప్రభాస్ లుక్స్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు మారుతీ తన ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఫోటో కూడా మళ్ళీ చాలా రోజుల తర్వాత మన రెబల్ స్టార్ ప్రభాస్ ని డార్లింగ్ గా చూపించబోతున్నారు అని ఒక నమ్మకాన్ని తెచ్చిపెడుతోంది.

దీంతో ఇప్పుడు ఫస్ట్ లుక్ పై మంచి అంచనాలే క్రియేట్ అయ్యాయి. కాగా ఈ చిత్రానికి ‘రాజా డీలక్స్’ అనే టైటిల్ ని అనుకుంటున్నట్లు సమాచారం.మరి మూవీ టీం అదే టైటిల్ ని అనౌన్స్ చేస్తుందా లేదా మరో టైటిల్ ని ప్రకటిస్తుందా అనేది చూడాలి.

 

ఈ చిత్రం హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో బాలీవుడ్ న‌టుడు సంజ‌య్ ద‌త్ కీల‌క పాత్ర‌ను పోషిస్తున్న‌ట్లు కూడా వార్తలు వస్తున్నాయి.  ఇక ప్రభాస్ సరసన ఈ సినిమాలో నిధి అగర్వాల్, రిధి కుమార్, మాళవిక మోహనన్ నటిస్తున్నారట. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తోంది.

మరోపక్క ప్ర‌భాస్ హీరోగా న‌టించిన స‌లార్ మూవీ ఇటీవ‌లే ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఏడు రోజుల్లోనే ఈ మూవీ 500 కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టి ప్రభాస్ అభిమానులకు మంచి ట్రీట్ ఇచ్చింది. ప్ర‌భాస్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ మూవీల‌లో ఒక‌టిగా నిలిచింది. ఇక ప్రభాస్ మారుతి మూవీతో పాటు నాగ్ అశ్విన్‌తో క‌ల్కి 2989 ఏడీ మూవీ చేస్తోన్నాడు.

Also Read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం

Also Read: Oneplus Nord Ce 3 5G Price: అమెజాన్‌లో సగం ధరకే Oneplus Nord Ce 3 5G మొబైల్‌..అదనంగా రూ.18,900 తగ్గింపు..

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News