Kalki 2898 AD: నాగ్ అశ్విన్ సినిమాలో ఈ హీరోయిన్ తప్పక ఉండాల్సిందే.. ఇంతకీ ఎవరంటే!

Kalki 2898 AD Tickets: మరికొద్ది గంటల్లో ప్రభాస్ కల్కి సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల.. మధ్య విడుదలకి సిద్ధం అవుతుంది. తాజాగా ఈ సినిమాలో మహాభారతం ఎపిసోడ్ కూడా ఉండబోతోందని.. వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దర్శకుడు నాగ్ అశ్విన్.. కెరియర్ మొత్తం మీద దర్శకత్వం వహించిన మూడు సినిమాల్లో.. కామన్ గా ఒక హీరోయిన్ ఉంది ఆమె ఎవరో తెలుసా..

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jun 27, 2024, 12:00 AM IST
Kalki 2898 AD: నాగ్ అశ్విన్ సినిమాలో ఈ హీరోయిన్ తప్పక ఉండాల్సిందే.. ఇంతకీ ఎవరంటే!

Kalki 2898 AD Review: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న.. కల్కి 2898 ఏడి సినిమా.. మరి కొద్ది గంటల్లో విడుదల కాబోతోంది. ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు కళ్ళుకాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఇంతకుముందు ఎన్నడూ చూడునటువంటి.. పాత్రలలో ప్రభాస్ ని మాత్రమే కాక.. మిగతా స్టార్ లని కూడా చూడటానికి ఫ్యాన్స్ ఎక్సైట్ అవుతున్నారు.ఇప్పటికే ఈ సినిమా కథ ఎలా.. ఉండబోతోంది అని నాగ్ అశ్విన్.. పలు ఇంటర్వ్యూలతో పాటు ఒక స్పెషల్ వీడియో.. కూడా చేసి చెప్పారు. సినిమాలో మూడు విభిన్నమైన ప్రపంచాలు ఉండబోతున్నాయని.. కూడా క్లారిటీ ఇచ్చారు.

ఇది ఇలా ఉండగా నాగ్ అశ్విన్ ఇప్పటి దాకా తన కెరియర్ మొత్తం మీద మూడు సినిమాలకి.. దర్శకత్వం వహించారు. ఆ మూడు సినిమాల్లో.. ఒక హీరోయిన్ మాత్రం కామన్ గా ఉంటూనే ఉంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన మొదటి సినిమా ఎవడే సుబ్రహ్మణ్యంలో.. ఆమె హీరోయిన్గా నటించింది. 

ఆ తరువాత మహానటి సినిమాలో కూడా దుల్కర్ సల్మాన్ మొదటి భార్యగా ఆ హీరోయిన్ కనిపించింది. ఇక తాజాగా ఇప్పుడు నాగ్ అశ్విన్ దర్శకత్వం.. వహించిన కల్కి సినిమాలో కూడా ఆమె ఉత్తర పాత్ర పోషిస్తుంది. ఇప్పటికే మీకు అర్థం అయిపోయి ఉంటుంది. ఆమె మరెవరో కాదు మాళవిక నాయర్. 
నాగ్ అశ్విన్ సినిమాలలో ఈమె మాత్రం కామన్ గా ఉంటూ వస్తుంది. 

ఇక మరోవైపు ప్రభాస్ కల్కి.. సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ పాత్ర కూడా.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా.. ఉండబోతుందని కొందరు పుకార్లు సృష్టించారు. కానీ అందులో ఏమాత్రం నిజం లేదని తెలుస్తోంది. 

మరోవైపు మాళవిక నాయర్ తో పాటు మహానటి సినిమాలో ఆమెతో నటించిన దుల్కర్ సల్మాన్, ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో నటించిన విజయ్ దేవరకొండ కూడా.. ఈ సినిమాలో క్యామియో పాత్రలలో కనిపించనున్నారు. కాగా విజయ్ దేవరకొండ కూడా నాగ అశ్విన్ మూడు సినిమాలలో ఉండడం విశేషం.

వైజయంతి మూవీస్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాకి సంతోష్ నారాయణన్.. సంగీతాన్ని అందించారు. ప్రస్తుతం ఉన్న ప్రీ రిలీజ్ బజ్ చూస్తుంటే ఈ సినిమాకి భారీ స్థాయిలో.. ఓపెనింగ్స్ వస్తాయని చెప్పుకోవచ్చు. ఇక విడుదల తర్వాత ఈ సినిమా ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో వేచి చూడాలి.

Read more: Pythons: కొండ చిలువలు ఒక మనిషిని ఎంత సేపట్లో మింగేస్తాయో తెలుసా..?

Read more: Canopy burst: వామ్మో.. గాల్లో తెరుచుకున్న విమానం పైకప్పు.. లేడీ పైలేట్ కు భయానక అనుభవం.. వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News