Adipurush Tension: ఆదిపురుష్ వాయిదా.. పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టు ఫీలవుతున్న ఫ్యాన్స్?

Prabhas Fans in Tension: ప్రభాస్ ఆదిపురుష్ వాయిదా పడిన క్రమంలో ప్రభాస్ ఫాన్స్ అందరూ టెన్షన్ పడుతున్నారు. సంక్రాంతి పోటీ తప్పింది అనుకుంటే ఈసారి మరో తలనొప్పి వచ్చిపడినట్టు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే 

Written by - Chaganti Bhargav | Last Updated : Nov 7, 2022, 10:58 AM IST
Adipurush Tension: ఆదిపురుష్ వాయిదా.. పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టు ఫీలవుతున్న ఫ్యాన్స్?

Prabhas Fans in Tension due to Adipurush New Release Date: గత కొద్ది రోజుల నుంచి జరుగుతున్న ప్రచారమే నిజమైంది. ఆది పురుష్ సినిమా సంక్రాంతికి విడుదల కాకపోవచ్చు అని ముందు నుంచి వార్తలు వినిపించాయి. నిజానికి ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న అన్ని సినిమాలు కంటే ముందుగానే ఆది పురుష్ మేకర్స్ తాము సంక్రాంతికి వస్తామని ప్రకటించారు. అయితే అదే సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య, నందమూరి బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమాలు విడుదలవుతున్నట్లుగా ప్రకటించడం ఒక్కసారిగా కలకలం రేపింది. ఒకేసారి మూడు పెద్ద సినిమాలు విడుదలవుతాయా అని అందరూ ఆశ్చర్యపోతున్న సమయంలో దిల్ రాజు తన నిర్మాణంలో విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకుడిగా రూపొందుతున్న వారసుడు సినిమాని కూడా రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు.

ఈ క్రమంలో ప్రభాస్ ఆది పురుష సినిమా వాయిదా పడవచ్చని ముందు నుంచి ప్రచారం జరిగింది. ఎట్టకేలకు ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ ఆ సినిమా దర్శకుడు ఓం రౌత్ సోమవారం ఉదయం అధికారికంగా ప్రకటించారు. ఆది పురుష్అనేది ఒక సినిమా కాదు శ్రీరాముడి పై భక్తి ,సంస్కృతి చరిత్రలపై మనకున్న నిబద్ధతకు నిదర్శనం, ప్రేక్షకులకు అద్భుతమైన విజువల్ ఫీస్ట్ అందించడం కోసం మరికొంత సమయం తీసుకోవాల్సి వస్తోంది ఈ నేపద్యంలో సంక్రాంతికి కాకుండా సినిమాని వచ్చే ఏడాది జూన్ 16వ తేదీన విడుదల చేయబోతున్నామని ప్రకటించారు. భారత దేశం గర్వించదగ్గ సినిమాని మీ ముందుకు తీసుకురావాలని మేము నిర్ణయించుకున్నామని మీ ప్రేమాభిమానాలే మమ్మల్ని నడిపిస్తున్నాయని చెబుతూ ఆయన ట్వీట్ చేశారు.

దీంతో ప్రభాస్ అభిమానులైతే ఒక్కసారిగా నిరాశ నిస్పృహలతో కూరుకు పోయారు. మరికొందరు మాత్రం ఇప్పుడు పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు మా పని తయారైందని కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే సంక్రాంతికి నందమూరి బాలకృష్ణ మెగాస్టార్ చిరంజీవి సినిమాలతో పోటీ ఎలా అని ఆలోచిస్తుండగా సినిమా వాయిదా పడింది. హమ్మయ్య ఫర్వాలేదు అని అనుకుంటుండగానే ఇప్పుడు ఏకంగా మరో రెండు పెద్ద సినిమాలతో పోటీ పడాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని అంటున్నారు. అసలు ఆదిపురుష్ సినిమా వాయిదా పడడానికి ముఖ్యమైన కారణం సినిమాలో వాడిన గ్రాఫిక్స్ వర్క్. కొన్నాళ్ల క్రితం ఈ సినిమాకి సంబంధించిన టీజర్ విడుదల చేయగా అందులో యానిమేషన్ దరిద్రంగా ఉందని పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చాయి.

సినిమాలో ఆంజనేయుడు, రాముడు ధరించిన బట్టల మీద, రావణుడి లుక్ మీద కూడా చర్చ జరిగింది. ఈ విషయం మీద పోలీస్ కేసులు, కోర్టు కేసులు కూడా అయ్యాయి. ఈ టీజర్ మీద వచ్చిన నెగెటివిటీని దృష్టిలో పెట్టుకున్న ఆది పురుష్ సినిమా యూనిట్ మొత్తం సన్నివేశాలు మార్చి ప్రేక్షకులు అందరినీ ఆమోదింప చేసే విధంగా రూపొందించేలా ప్లాన్ చేస్తున్నారట. అందుకే సుమారు 100 కోట్ల రూపాయలతో మళ్ళీ రీషూట్ చేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది. అలాగే ఈసారి త్రీడీలో సినిమాని రిలీజ్ చేయడానికి పెద్ద ఎత్తున ప్లానింగ్ జరుగుతున్నట్టుగా చెబుతున్నారు. అయితే సరిగ్గా జూన్ రెండవ తేదీన షారుక్ ఖాన్ హీరోగా అట్లీ డైరెక్షన్లో రూపొందుతున్న జవాన్ సినిమా విడుదలవుతోంది. దానితో ప్రభాస్ సినిమాకు పెద్దగా నష్టం తెలుగు రాష్ట్రాల్లో లేకపోవచ్చు కానీ థియేటర్లు పొందే విషయంలో నార్త్ లో కాస్త ఇబ్బందే. పోనీ ఆ విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టేద్దాం.

అయితే అదే రోజున హాలీవుడ్ మూవీ స్పైడర్ మాన్ కూడా పెద్ద ఎత్తున విడుదలవుతోంది. ఇక మరో వారం తర్వాత అంటే జూన్ 9వ తేదీన ట్రాన్స్ఫార్మర్ సిరీస్ లో కొత్త సినిమా రిలీజ్ అవుతుంది. ట్రాన్స్ఫార్మర్ మూవీ అలాగే స్పైడర్ మాన్ మూవీ రెండూ 3D సినిమాలే. ఈ రెండు సినిమాలకు భారీ ఎత్తున కేవలం అమెరికా లాంటి దేశంలోనే కాదు భారతదేశంలో కూడా 3D స్క్రీన్స్ వాటికి కేటాయించాల్సి వస్తోంది. మరోపక్క మా సినిమా ఫోన్లలో మామూలు థియేటర్లలో చూసేది కాదు ఐమాక్స్, 3D థియేటర్లలో మాత్రమే చూసేది అంటూ సినిమా టీజర్ రిలీజ్ అయినప్పుడు ఓం రౌత్ కొన్ని కామెంట్లు చేశారు.

ఇప్పుడు ఈ రెండు సినిమాల దెబ్బకి అసలు ఆది పురుషుడికి త్రీడీ థియేటర్లు దొరుకుతాయా? ఐమాక్స్ స్క్రీన్స్ అందుతాయా అనే చర్చ జరుగుతోంది. ఆ రెండు హాలీవుడ్ సినిమాలకు టాక్ బాగుంటే మన దేశ ప్రేక్షకులు ఖచ్చితంగా ఆదరిస్తారు. అది గతంలో అనేకమార్లు ప్రూవ్ అయింది. అయితే ఐమాక్స్, 3D స్క్రీన్లు మామూలుగానే భారత దేశంలో చాలా తక్కువ. అలాంటిది ఇప్పుడు ఈ రెండు సినిమాల విడుదల ఆది పురుష్ మీద ప్రభావం చూపే అవకాశం ఎక్కువగా ఉందని ప్రచారం అయితే జరుగుతోంది. చూడాలి మరి భవిష్యత్తులో ఏం జరగబోతోంది అనేది.

Also Read: Balakrishna - Chiranjeevi: బాలయ్య- చిరు ఫాన్స్ కు అదిరే న్యూస్.. ఇక ఆ టెన్షన్ పడక్కర్లేదు!

Also Read: Kamal Haasan - Mani Ratnam: బ్లాస్ట్ అయ్యే కాంబినేషన్ సెట్..35 ఏళ్ల తరువాత మాములు రచ్చ కాదుగా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News