Prabhas: ‘కన్నప్ప’ కాకుండా ప్రభాస్ గెస్ట్ రోల్ చేసిన ఈ సినిమా తెలుసా..

Prabhas Cameo Role: మరో మూడు రోజుల్లో ప్రభాస్ ‘కల్కి 2898 AD’  మూవీతో పలకరించబోతున్నాడు. ఈ సినిమాపై భారతీయ సినీ పరిశ్రమలో భారీ అంచనాలే ఉన్నాయి. ఆ సంగతి పక్కన పెడితే.. ప్రభాస్.. మంచు విష్ణు హీరోగా టైటిల్ రోల్ ప్లే చేస్తోన్న ‘కన్నప్ప’లో పవర్ ఫుల్ క్యామియో రోల్ చేస్తున్నారు. ఈ సినిమా కంటే ముందు ప్రభాస్ మరో సినిమాలో క్యామియో రోల్ చేసాడు.

Written by - TA Kiran Kumar | Last Updated : Jun 24, 2024, 08:41 AM IST
Prabhas: ‘కన్నప్ప’ కాకుండా  ప్రభాస్ గెస్ట్ రోల్ చేసిన ఈ సినిమా తెలుసా..

Prabhas Cameo Role:  రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి’ సిరీస్ తో ప్రభాస్ ప్యాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఆ సినిమా తర్వాత వరుసగా ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్స్ తో అలరిస్తున్నాడు. గతేడాది ‘సలార్’ మూవీతో ప్రభాస్ పవర్ ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఈ సినిమా తర్వాత ఇపుడు ‘కల్కి 2898 AD’ మూవీతో పలకరించబోతున్నాడు. ఈ సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే యూఎస్ బ్యాక్సాఫీస్ దగ్గర ప్రీమియర్స్ రూపేణా దాదాపు $3 మిలియన్ యూఎస్ డాలర్స్ కలెక్ట్ చేసి ఔరా అనిపించింది. మరోవైపు తెలంగాణలో కల్కి టికెట్ రేట్స్ పెంచుకోవడానికి పర్మిషన్స్ ఇచ్చారు. దీంతో బుకింగ్స్ ఓపెన్ అవ్వడం లేదో గంట సేపట్లోనే 69 వేల టికెట్స్ సేల్ ఔట్ అయిపోయాయి. అంతేకాదు అందరు ఒకేసారి టికెట్స్ కోసం ఎగబడటంతో మొత్తం బుక్ మై షో సర్వర్ క్రాష్ అయిపోయింది.

ఆంధ్ర ప్రదేశ్ ఈ సినిమా టికెట్ రేట్స్ హైక్స్ పై పర్మిషన్ రాలేదు. ఈ రోజు రావచ్చు. పైగా ఏపీలో  వైజయంతీ మూవీస్ అధినేత అశ్వనీదత్ కు అనుకూలమైన ప్రభుత్వం కొలువు తీరింది. దీంతో టికెట్ పెంపు పై పర్మిషన్స్ ఈ రోజు రావచ్చు. ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత బుకింగ్స్ ఏ రేంజ్ లో ఉండబోతుందో చూడాలి.

ఇప్పటికే ఈ సినిమా గంటల సేపట్లోనే దాదాపు రూ. 6  కోట్ల నుంచి రూ. 7 కోట్ల వరకు గ్రాస్ బుకింగ్స్ నిన్న ఒక్కరోజే నైజాం (తెలంగాణ)లో జరిగింది. ఇక ఏపీ సంగతి పక్కనపెడితే.. మిగిలిన రాష్ట్రాల్లో బుకింగ్స్ కూడా ఓ రేంజ్ లో ఉన్నాయి. మొత్తంగా కల్కి మూవీ మొదటి రోజు రికార్డు బ్రేక్ కలెక్షన్స్ రాబట్టే అవకాశాలున్నాయి.

ఆ సంగతి పక్కన పెడితే.. ప్రభాస్.. కన్నప్ప మూవీ కంటే ముందు హిందీలో అజయ్ దేవ్ గణ్, సోనాక్షి సిన్హా హీరో, హీరోయిన్లుగా ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కిన ‘యాక్షన్ జాక్సన్’ సినిమాలో క్యామియో రోల్ చేసాడు. ఇపుడు చాలా యేళ్ల తర్వాత ‘కన్నప్ప’లో క్యామియో రోల్లో కనిపించనున్నాడు.  ఇప్పటికే ఈ సినిమాలో ప్రభాస్ పాత్రకు సంబంధించిన షూట్ పూర్తైయింది. మొత్తంగా ‘కన్నప్ప’లో ప్రభాస్ క్యామియో రోల్ తో ఈ సినిమాకు ఏ మేరకు ఉపయోగపడుతుందనేది చూడాలి.

Also read: IRCTC Alert: ఫ్రెండ్స్ కోసం రైల్వే టికెట్ బుక్ చేస్తున్నారా, మూడేళ్లు జైలు శిక్ష తప్పదు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook.

Trending News