Project K Glimpse: హాలీవుడ్ రేంజ్‌లో 'ప్రాజెక్ట్ కె' ఫస్ట్ గ్లింప్స్.. టైటిల్ ఏంటో తెలుసా?

Project K Glimpse: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లీడ్ రోల్ చేస్తున్న ప్రాజెక్ట్ కె మూవీ ఫ‌స్ట్ గ్లింప్స్ వ‌చ్చేసింది. అమెరికాలోని శాన్ డియాగోలో జ‌రిగిన కామిక్ కాన్ ఈవెంట్‌లో ఈ సినిమా ప్రచారచిత్రంతోపాటు టైటిల్‌ను కూడా రివీల్ చేశారు మేకర్స్.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 21, 2023, 06:31 AM IST
Project K Glimpse: హాలీవుడ్ రేంజ్‌లో 'ప్రాజెక్ట్ కె' ఫస్ట్ గ్లింప్స్.. టైటిల్ ఏంటో తెలుసా?

Project K title and Glimpse Released: మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ప్రాజెక్టు కె' గ్లింప్స్ వచ్చేసింది. ఈ మూవీకి కల్కి '2898 ఏడీ’ (Kalki 2898 AD)' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమా టైటిల్, గ్లింప్స్ ను శాన్ డియాగోలోని కామిక్ కాన్ వేడుకలో శుక్ర‌వారం తెల్ల‌వారుజామున‌ విడుదల చేశారు. కొన్ని దుష్టశక్తులు ప్రజలను బందీలను చేస్తే.. వారిని రక్షించే సూపర్ హీరోగా ప్రభాస్ ను చూపించారు. యాక్షన్ సీన్స్ అదిరిపోయాయి. విజువల్ ఎఫెక్ట్ హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయి. ప్రభాస్ ఎంట్రీ అద్భుతంగా ఉంది. చివ‌రిలో 'వాట్ ఈజ్ ప్రాజెక్ట్ కె' అని ఓ వ్యక్తి అడగ్గా వెంటనే టైటిల్ రివీల్ చేయడం ఆకట్టుకుంటోంది. 

అమెరికాలో ప్రతిష్ఠాత్మక 'శాన్‌ డియాగో కామిక్ కాన్‌’ (San Diego Comic Con)' వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకల్లోనే ప్రాజెక్టు-కె మేకర్స్ గ్లింప్స్‌, టైటిల్‌ని ప్రకటించారు. ఈ ఈవెంట్‌లో ప్రచార చిత్రాన్ని రిలీజ్ చేసిన తొలి ఇండియన్ సినిమాగా ఇది చరిత్ర సృష్టించింది. ఈ కార్యక్రమంలో ప్ర‌భాస్‌తో పాటు క‌మ‌ల్‌హాస‌న్‌, ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్‌, నిర్మాత అశ్వ‌నీద‌త్ పాల్గొన్నారు. వీరితోపాటు హీరో రానాకు కూడా అక్కడకు వెళ్లారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News