Kalki 2898 AD OTT Dates: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ నటి దీపికా పదుకోన్ నటించిన సూపర్ డూపర్ హిట్ సినిమా కల్కి 2898 ఏడి బాక్సాఫీసులో ఎలా దుమ్ము రేపిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఇదే సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్కు సిద్దమైంది. అయితే వేర్వేరు భాషల్లో వేర్వేరు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానుంది. ఏ భాషలో ఏ ఓటీటీలో విడుదల కానుందో తెలుసుకుందాం.
ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడి సినిమా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు దుమ్ము రేపింది. నిర్మాణ ఖర్చు కంటే చాలా రెట్లు కలెక్షన్లు వసూలు చేసింది. జూన్ 27వ తేదీన ధియేటర్లో విడుదలైన కల్కి సినిమాను ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించాడు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిషా పటానీ, దుల్కర్ సల్మాన్, దీపికా పదుకోనన్ వంటి ప్రముఖులంతా ఇందులో కన్పిస్తారు. దాదాపు రెండు నెలల తరువాత ఇప్పుడు రెండు ప్రముఖ ఓటీటీల్లో ఈ సినిమా స్ట్రీమింగ్కు సిద్ధమైంది. ఇప్పుడిక ఈ సినిమా హిందీ, తెలుగు సహా ఇతర భాషల్లో ఓటీటీ విడుదల కానుంది. ఈ మేరకు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో అధికారికంగా ప్రకటించాయి.
కల్కి 2898 ఏడి హిందీ వెర్షన్ ఆగస్టు 22వ తేదీన ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు దర్శకుడు నాగ్ అశ్విన్ ఇన్‌స్టాలో షేర్ కూడా చేశాడు. ఈ శకంలోని ఎపిక్ బ్లాక్ బస్టర్ నెట్‌ఫ్లిక్స్‌లో వస్తోందంటూ క్యాప్షన్ ఇచ్చాడు. అదే విధంగా అమెజాన్ ప్రైమ్ సైతం కల్కి స్ట్రీమింగ్ విషయంలో ప్రకటన చేసింది. ఈ సినిమా ఒరిజినల్ లాంగ్వేజ్ తెలుగు సహా తమిళం, కన్నడ, మలయాళం డబ్బింగ్ వెర్షన్లు అమెజాన్ ప్రైమ్‌లో ఆగస్టు 22 నుంచి స్ట్రీమింగ్ కానున్నాయి.
మొత్తానికి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కల్కి ఓటీటీ స్ట్రీమింగ్ తేదీలు వచ్చేశాయి. అటు నెట్ఫ్లిక్, ఇటు అమెజాన్ రెండింట్లోనూ విడుదల కానుండటంతో ఇక ఓటీటీ ప్రేమికులకు పండగే పండగ. ఇప్పటికే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్లు దాటి వసూళ్లు చేసింది.
Also read: LIC Policy Restart: ఎల్ఐసీ పాలసీ మధ్యలో వదిలేశారా మళ్లీ రీస్టార్ట్ చేయొచ్చు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook