Adipurush Pre Release Event in Tirupati: పాన్ ఇండియా లెవల్లో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ ఆదిపురుష్. రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ జంటగా నటించిన ఈ సినిమా.. జూన్ 16న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది. ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణ మహాకావ్యం ఆధారంగా తెరకెక్కించారు. రాఘవుడిగా ప్రభాస్.. జానకిగా కృతి సనన్ యాక్ట్ చేశారు. లంకేశ్వరుడి క్యారెక్టర్‌లో సైఫ్ అలీ ఖాన్ నటించారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్ కార్యక్రమాలను షూరు చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 6వ తేదీన తిరుపతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను భారీగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే స్టేజీ పనులు పూర్తి కావచ్చాయి.
ఈ గ్రాండ్ ఈవెంట్‌కు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి చీఫ్ గెస్ట్‌గా హాజరుకానున్నారని మొదట్లో ప్రచారం జరిగింది. అయితే ఈ వేడుకకు చిన జీయర్ స్వామీజి ముఖ్య అతిథిగా రాబోతున్నట్లు సమాచారం. చిన జీయర్ భక్తులు, తిరుపతికి విచ్చేసిన భక్తులకు ఇప్పటికే ప్రీ రిలీజ్ ఈవెంట్ పాసులు అందజేసినట్లు తెలిసింది. ప్రభాస్ అభిమానులతోపాటు.. భక్తులు, సినీ లవర్స్‌తో తిరుపతి జనసంద్రం కానుంది. ఎస్‌వీ యూనివర్సిటీ గ్రౌండ్స్ ప్రభాస్ నమస్మరణతో మార్మోగనుంది. ఈ ఈవెంట్‌లో 200 మంది సింగర్స్, 200 మంది డ్యాన్సర్లతో ప్రదర్శన ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
ఆదిపురుష్ ప్రీ రిలీజ్ వేడుకను శ్రేయాస్ మీడియా నిర్వహిస్తోంది. శ్రీవారి పాదల చెంత గ్రాండ్‌గా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తోంది. అయితే ప్రస్తుతం తిరుపతిలో వర్షాలు కురుస్తుండడం ప్రభాస్ ఫ్యాన్స్‌ను కలవరపెడుతోంది. రేపు కూడా వర్షాలు పడితే ఇబ్బందులు ఎదురవుతాయని అంటున్నారు. వర్షాలను దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.
Also Read: WTC Final Rules: డబ్ల్యూటీసీ ఫైనల్‌లో కొత్త రూల్స్.. ఈ ఫీల్డర్లు హెల్మెట్లు ధరించడం తప్పనిసరి
ఎస్వీ యూనివర్సిటీ గ్రౌండ్స్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహిస్తుండడంతో ఆదిపురుష్ మూవీ బంపర్ హిట్ అవ్వడం ఖాయమని అభిమానులు అంటున్నారు. ఎందుకంటే గతంలో ఇదే వేదికలో బాహుబలి ది బిగినింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను వేడుకను నిర్వహించారు. ఈ మూవీ దేశవ్యాప్తంగా ఎన్ని రికార్డులు బద్దలు కొట్టిందో అందరికీ తెలిసిందే. మరోసారి ప్రభాస్ మూవీ ఈవెంట్ ఎస్వీ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తుండడంతో ఆదిపురుష్ కూడా సూపర్ సక్సెస్ అవుతుందని రెబల్ స్టార్ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. సాహో, రాధేశ్యామ్ వంటి సినిమాలు ఫ్లాప్ అవ్వగా.. ఈ సినిమాతో అయినా హిట్ అందుకుంటాడో లేదో జూన్ 16న తేలిపోనుంది.
Also Read: ENG Vs IRE: బ్యాట్ టచ్ చేయకుండా.. బాల్ ముట్టకుండా.. బెన్ స్టోక్స్ అరుదైన రికార్డు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి