Adipurush Advance Booking Cancelled: రెబల్ స్టార్ ప్రభాస్-బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబోలో తెరకెక్కిన మూవీ ఆదిపురుష్. ప్రభాస్ రాఘవుడిగా నటించగా.. కృతి సనన్ జానకీదేవిగా మెప్పించింది. శుక్రవారం ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమాకు పాన్ ఇండియా లెవల్లో మిక్స్‌డ్ టాక్ వస్తోంది. తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.140 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. కొన్ని చోట్ల ప్రశంసల వర్షం కురుస్తుండగా.. మరికొన్ని చోట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రామాయణాన్ని తప్పుగా చూపించారని మండిపడుతున్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఓం రౌత్ పాత్రలను తీశారంటూ ఆరోపణలు వస్తున్నాయి. టీజర్, ట్రైలర్‌తో భారీ అంచనాలు పెరిగిపోవడంతో మొదటి మూడు రోజులకు చాలా మంది టికెట్లు అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నారు. అయితే సినిమాపై డివైడ్ టాక్ రావడంతో కొందరు సినిమా చూడొద్దని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఆదిపురుష్ సినిమాలో రామకథను చూపించిన తీరు, రాముడు-హనుమంతుడు, రావణుడి పాత్రలను చెప్పిన తీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో ట్రోల్స్, సినిమా రివ్యూలు, ఆడియన్స్ రియాక్షన్ చూసి.. చాలా మంది అడ్వాన్స్ టికెట్లు బుక్ చేసుకున్నవాళ్లు టిక్కెట్లను క్యాన్సిల్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. క్యాన్సిల్ చేసుకున్న టికెట్లను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. అంతేకాదు బాయ్‌కాట్ ఆదిపురుష్, డిజాస్టర్ ఆదిపురుష్ అనే హ్యాష్‌ట్యాగ్‌లను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. సినిమా నిర్మాతలు, డైరెక్టర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.
అయితే మరో వాదన తెరపైకి వచ్చింది. అడ్వాన్స్ బుకింగ్స్ చేసుకున్న కొందరు తొలిరోజే సినిమా చూశారని.. వాళ్లే శని, ఆదివారం టిక్కెట్లను క్యాన్సిల్ చేసుకుంటున్నారని అంటున్నారు. ఈ మూవీపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తం కావడంతో ఆన్‌లైన్‌లో బుకర్ల టిక్కెట్‌లను క్యాన్సిల్ చేస్తున్నారు. సినిమా వీఎఫ్ఎక్స్ పేలవంగా ఉన్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్ని వైపుల నుంచి డివైడ్ టాక్, ట్రోల్స్ వస్తుండడంతో అడ్వాన్స్ బుకింగ్స్‌లు క్యాన్సిల్ అవుతున్నట్లు తెలుస్తోంది.
Also Read: Online Earning Methods: ఆన్‌లైన్‌లో రోజుకు రూ.10 వేల వరకు సంపాదించుకోండి.. ఎలాగంటే..?
టికెట్లను రద్దు చేసుకున్న ప్రేక్షకులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. తన కుమార్తెకు రామాయణం తప్పుగా బోధించకూడదని అనుకుంటున్నానని.. అందుకే తాను ఆదిపురుష్ టికెట్లను క్యాన్సిల్ చేసుకుంటున్నట్లు ఓ ఆడియన్ ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టాడు. అసలు రామాయణం కథ కానందున ఆదిపురుష్ సినిమా టికెట్లను రద్దు చేసుకున్నానని మరో ప్రేక్షకుడు రాశాడు. మొత్తానికి బాహుబలి తరువాత సూపర్ హిట్ కోసం ఎదురుచూస్తున్న ప్రభాస్‌కు ఆదిపురుష్ కూడా నిరాశపరిచిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
Also Read: Pawan Kalyan Speech: సీఎం కావడానికి నేను సంసిద్ధం.. తల తెగినా మాటకు కట్టుబడి ఉంటా: పవన్ కళ్యాణ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి