Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో... 'కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్' అంటున్న నాగార్జున..

Bigg Boss 7: ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ మరోసారి బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమైంది. త్వరలో ఏడో సీజన్ తో మన ముందుకు రానుంది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 19, 2023, 08:10 AM IST
Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో... 'కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్' అంటున్న నాగార్జున..

Bigg Boss 7 Telugu latest Promo: బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ (Bigg Boss 7 Telugu) మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయింది. ఈ మెగా షో త్వరలో ఏడో సీజన్ తో మన ముందుకు రానుంది. ఇప్పటికే సక్సెస్ పుల్ గా ఆరు సీజన్లు కంప్లీట్ చేసుకున్న ఈ షో ఏడో సీజన్ కు ముస్తాబవుతుంది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు నిర్వాహకులు. ఇందులో టాలీవుడ్ స్టార్ హీరో, ప్రోగ్రాం హోస్ట్ అక్కినేని నాగార్జున కనిపించి సందడి చేశారు. ఈ సారి షో రోటీన్ కు భిన్నంగా ఓ సరికొత్త కాన్సెప్ట్ తో రాబోతున్నట్లు ఆయన హింట్ ఇచ్చారు. కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ అంటూ ఈ షోపై అడియన్స్ కు క్యూరియసిటీ పెంచేశారు. 

అయితే బిగ్ బాస్ సీజన్ 7కు ఎవరు హోస్ట్ చేస్తారనే విషయంపై ప్రేక్షకుల్లో గందరగోళం ఉండేది. తాజా ప్రోమోతో వాటిన్నింటికి చెక్ పెట్టినట్లయింది. తొలి సీజన్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్, రెండో సీజన్ కు నేచురల్ స్టార్ నాని హోస్ట్ చేశారు. ఇక మూడు నుంచి ఆరు సీజన్ల వరకు కింగ్ నాగార్జుననే వ్యాఖ్యతగా వ్యవహారించారు. మరోసారి బుల్లితరెపై అలరించేందుకు ఆయన సిద్దమయ్యారు. ఈ మెగా షో ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.

ఇక కంటెస్టెంట్స్ విషయానికొస్తే... రకరకాల పేర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈసారి హౌస్ లోకి టీమిండియా మాజీ క్రికెటర్ అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఆయనే ఆంధ్రా ప్లేయర్ వేణుగోపాలరావు. చాలా కాలంగా క్రికెట్ కు దూరంగా ఉన్న ఆయనను ఈ షోకి తీసుకొచ్చేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారట మేకర్స్. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. 

Also Read: Bigg Boss 7: బిగ్‌బాస్‌ హౌస్‌లోకి టీమిండియా మాజీ క్రికెటర్‌.. ఎవరో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News