Pooja Hegde Pics: ట్రాన్స్‌పరెంట్ డ్రెస్‌లో పూజా హెగ్డే.. బుట్టబొమ్మ అందానికి కుర్రకారు ఫిదా!

Actress Pooja Hegde looks stunning in transparent glass shining dress. 'బుట్టబొమ్మ' పూజా హెగ్డే తాజాగా ట్రాన్స్‌పరెంట్ గ్లాస్ షైనింగ్ డ్రెస్‌లో హొయలు పోయారు. ఆమె అందానికి ఫాన్స్ ఫిదా అయ్యారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Oct 20, 2022, 01:38 PM IST
  • ట్రాన్స్‌పరెంట్ డ్రెస్‌లో పూజా హెగ్డే
  • బుట్టబొమ్మ అందానికి కుర్రకారు ఫిదా
  • పూజా హెగ్దే అందాల విందు
Pooja Hegde Pics: ట్రాన్స్‌పరెంట్ డ్రెస్‌లో పూజా హెగ్డే.. బుట్టబొమ్మ అందానికి కుర్రకారు ఫిదా!

Actress Pooja Hegde poses in a transparent glass shining dress: తమిళ సినిమా 'ముగముడి' ద్వారా సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన పూజా హెగ్డే.. 'ఒక లైలా కోసం' సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. అనతి కాలంలోనే స్టార్ హీరోలతో జతకట్టి టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించారు. 

ఒక లైలా కోసం, ముకుందా, దువ్వాడ జగన్నాథం, సాక్ష్యం, అరవింద సమేత, మహర్షి, అల వైకుంఠపురములో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లాంటి సినిమాలతో తెలుగులో పూజా హెగ్డేకు మంచి పేరు వచ్చింది. 

పూజా హెగ్డే చివరగా నటించిన 'రాధేశ్యామ్', బీస్ట్, ఆచార్య సినిమాలు నిరాశే మిగిల్చాయి. వరుస డిజాస్టర్స్ పడినా పూజాకు అవకాశాలు ఏమాత్రం తగ్గడం లేదు. 

మహేష్ బాబు-త్రివిక్రమ్ సినిమాలో పూజా హెగ్డే నటించనున్నారు. ప్రస్తుతం హిందీలో సల్మాన్ ఖాన్ సరసన బుట్టబొమ్మ ఓ సినిమా చేస్తున్నారు.

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే పూజా హెగ్దే.. నిత్యం తన ఫోటో షూట్‌కు సంబందించిన పోటోలను షేర్ చేస్తూ కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తున్నారు. ఆమె పోస్ట్ చేసే ఒక్కో ఫొటోకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తుంటుంది. 

ఇటీవలి కాలంలో పూజా హెగ్దే వరుస ఫొటో షూట్స్ చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. తాజాగా బుట్టబొమ్మ ట్రాన్స్‌పరెంట్ గ్లాస్ షైనింగ్ డ్రెస్‌లో హొయలు పోయారు. ఆమె అందానికి ఫాన్స్ ఫిదా అయ్యారు. 

Also Read: పాక్‌లో షాహీన్ ఆఫ్రిది కంటే ప్రమాదకరమైన బౌలర్ ఉన్నాడు.. భారత్ అప్రమత్తంగా ఉండాల్సిందే: ఆకాశ్‌ 

Also Read: Omicron Variant BF 7: దీపావళి వేళ అలర్ట్.. భయపెడుతున్న ఒమిక్రాన్ కొత్త వేరియంట్.. లక్షణాలు ఇవే..!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News