Modi on Pathaan Controversy: సినిమాలపై అనవసర కామెంట్లు చేయొద్దు.. 'పఠాన్' వివాదంపై మోడీ కీలక వ్యాఖ్యలు!

PM Modi on Pathaan Controversy: బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె నటించిన పఠాన్ సినిమాపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో, ఆ సినిమాపై అనవసర వ్యాఖ్యలు మానుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ నేతలకు సూచించారని తెలుస్తోంది. అందుకు సంబందించిన వివరాల్లోకి వెళితే

Written by - Chaganti Bhargav | Last Updated : Jan 19, 2023, 01:03 PM IST
Modi on Pathaan Controversy: సినిమాలపై అనవసర కామెంట్లు చేయొద్దు.. 'పఠాన్' వివాదంపై మోడీ కీలక వ్యాఖ్యలు!

PM Modi on Pathaan Controversy: బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె నటించిన పఠాన్ సినిమాపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో, ఆ సినిమాపై అనవసర వ్యాఖ్యలు మానుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ నేతలకు సూచించారని తెలుస్తోంది. 'బాయ్‌కాట్‌ ట్రెండ్‌'లో పాల్గొన్న బీజేపీ నేతలకు ప్రధాని మోదీ ఈ సలహా ఇచ్చారని బీజేపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జనవరి 16, 17 తేదీల్లో ఢిల్లీలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రధాని మోదీ నేతలకు స్పష్టంగా ఈ సలహా ఇచ్చారని అంటున్నారు.

బేషరం రాంగ్ అనే సాంగ్ లో కావాలనే కాషాయ రంగు బికినీ వాడారని ఆరోపిస్తూ పఠాన్ సినిమాను బహిష్కరిస్తున్నట్లు పలువురు బీజేపీ నేతలు బహిరంగంగానే ప్రకటించారు, దానిని ఉద్దేశించే మోడీ ఈ మేరకు కామెంట్స్ చేసినట్టు తెలుస్తోంది. కొందరు సినిమాపై ప్రకటనలు చేస్తారు, అది రోజంతా టీవీ - మీడియాలో నడుస్తుంది, అలాంటి అనవసరమైన ప్రకటనలకు దూరంగా ఉండాలని పీఎం మోడీ నేతలతో అన్నట్టుగా తెలుస్తోంది. షారుఖ్ ఖాన్ పఠాన్ మూవీ జనవరి 25, 2023న విడుదల కానుంది. ఈ సినిమాలో కాషాయ రంగు బికినీ ఉపయోగించడంపై రామ్ కదమ్, నరోత్తమ్ మిశ్రా సహా పలువురు బీజేపీ నేతలు ఈ సినిమాను బాయ్ కాట్ చేయాలంటూ పిలుపునిచ్చారు.

అయితే కొన్ని రోజుల క్రితం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ముంబై పర్యటనలో ఉన్న సమయంలో బాలీవుడ్ స్టార్స్‌తో జరిగిన సమావేశంలో సునీల్ శెట్టి బాలీవుడ్ బహిష్కరణ ట్రెండ్ ఆపేందుకు సీఎం ఆదిత్యనాథ్ సహాయాన్ని కోరారు. ఈ క్రమంలో మోడీ అదే విషయం మీద కామెంట్ చేయడం గమనార్హం. అయితే ఈ సినిమాలో కావాలనే అలాంటి పాట పెట్టడం, కావాలనే ఆ రంగులు వాడడం ఈ సినిమా యూనిట్ "చీప్ పబ్లిసిటీ" కోసం వేసిన ఎత్తుగడలా లేక వారి ఈ ప్రమోషన్స్ వెనుక కుట్ర దాగి ఉందా అని మహారాష్ట్ర బిజెపి నాయకుడు రామ్ కదమ్ చిత్ర నిర్మాతలను ప్రశ్నించడం వారికి సినిమా మీద ఉన్న అనుమానాలను అర్ధం చేసుకోవచ్చు.

మహారాష్ట్రలో హిందుత్వ ఆదర్శాల ఆధారంగా బీజేపీ ప్రభుత్వం నడుస్తోందని, హిందుత్వ మనోభావాలను కించపరిచేలా ఎలాంటి సినిమాలను, సీరియల్‌ని నడపడానికి ప్రభుత్వం అనుమతించదని బీజేపీ నేతలు అంటున్నారు. ఇక తాజా సమావేశంలో ఏ సినిమాకు వ్యతిరేకంగా ఎలాంటి వివాదాస్పద ప్రకటనలు ఇవ్వకుండా చూడాలని ఇప్పుడు నరేంద్ర మోడీ తన నేతలకు స్పష్టంగా చెప్పారని అంటున్నారు.

తాజాగా జరిగిన సమావేశంలో ప్రధాని మాట్లాడుతూ, 'మీరు ఇచ్చిన వివాదాస్పద ప్రకటన వల్ల సినిమా నిర్మాత చాలా నష్టపోతున్నారని, ఇలాంటి వివాదాస్పద ప్రకటనలు ఇవ్వడం మానుకోవాలి ఎందుకంటే మీడియా ఆ ప్రకటనలను చూపుతుంది, దాని కారణంగా సినిమాపై నిరసన మొదలవుతుందని ఆయన అన్నారు. ప్రధాని మోదీ ఈ ప్రకటన తర్వాత పఠాన్‌పై నిరసనకు తెరపడే అవకాశాలు ఉన్నాయనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఇక 2018 తరువాత షారుఖ్ హీరోగా వస్తున్నా సినిమా కావడంతో దేశవ్యాప్తంగా ఉన్న థియేటర్లలో పఠాన్ భారీ ఓపెనింగ్స్ పొందవచ్చని అంచనా వేస్తున్నారు. దీంతో పాటు విదేశాల్లో కూడా ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ చిత్రంలో షారూఖ్‌తో పాటు దీపికా పదుకొణె, జాన్ అబ్రహం ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. 
Also Read: Veera Simha Reddy Story: రియల్ స్టోరీ చేద్దామంటే వద్దన్న బాలయ్య.. అందుకే 'వీరసింహా రెడ్డి'గా మార్పు!

Also Read: Re Releases from Tollywood: తొలిప్రేమ, సింహాద్రి సహా రీ రిలీజ్ కాబోతున్న సినిమాలు ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

 
 

Trending News