Nandamuri Brothers Pic: ఇది కదా నందమూరి ఫ్యాన్స్ కోరుకుంది

నందమూరి అభిమానులంటే తెలుగు ప్రేక్షకులకు ఎంత ప్రేమో మనకి తెలిసిందే. అయితే కళ్యాణ్ రామ్ - ఎన్టీఆర్ కలిసి దిగిన ఫోటోలు చాలానే ఉన్నాయి. కానీ మోక్షజ్ఞతో కలిసి దిగిన ఫోటోలు అభిమానులు ఇప్పటి వరకి చూడలేదు. కళ్యాణ్ రామ్ - ఎన్టీఆర్ - మోక్షజ్ఞ దిగిన ఒక ఫోటో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 21, 2023, 08:58 PM IST
Nandamuri Brothers Pic: ఇది కదా నందమూరి ఫ్యాన్స్ కోరుకుంది

Nandamuri Brothers Pic: నందమూరి ఫ్యామిలీ ఫ్యాన్స్ తో పాటు తెలుగు ప్రేక్షకులు అంతా కూడా మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నారు. నందమూరి తారక రామారావు తర్వాత బాలకృష్ణ, హరికృష్ణ సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. హరికృష్ణ కొన్నాళ్ల తర్వాత ఇండస్ట్రీకి దూరం అయినా కూడా ఇప్పటి వరకు బాలకృష్ణ హీరోగా కొనసాగుతున్నాడు. నందమూరి ఫ్యామిలీ నుండి మూడవ తరం హీరోలు ఎన్టీఆర్‌, కళ్యాణ్ రామ్‌ లు కొనసాగుతున్నారు. తారకరత్న కూడా ఇండస్ట్రీలో అడుగు పెట్టినా కూడా ఆయన సక్సెస్ అవ్వలేక పోయాడు. కళ్యాణ్ రామ్‌ ఇండస్ట్రీలో అడుగు పెట్టి చాలా సంవత్సరాలు అయినా కూడా సక్సెస్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బాలయ్య తనయుడు మోక్షజ్ఞ మీడియా ముందు కనిపించడమే చాలా అరుదుగా అనుకుంటూ ఉంటాం. 

బాలయ్య తనయుడు ఫోటో సోషల్‌ మీడియాలో కనిపిస్తే గొప్ప విషయం. అలాంటిది మోక్షజ్ఞ తాజాగా ఫ్యామిలీ వేడుకలో ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్‌ తో కలిసి కనిపించడం అందరికి షాకింగ్‌ గా అనిపించింది. బాలయ్య తో పాటు నందమూరి, నారా ఫ్యామిలీకి చెందిన చాలా మంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నందమూరి హరికృష్ణ కూతురు సుహాసిని కొడుకు పెళ్లి వేడుకలో వీరంతా కూడా కలిశారు. సుహాసిని తనయుడు నిశ్చితార్థ వేడుకలో ఎన్టీఆర్‌ కనిపించక పోవడంతో పెళ్లికి అయినా హాజరు అవుతాడా లేదా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. పెళ్లి లో ఎన్టీఆర్‌ సందడి చేయడం మాత్రమే కాకుండా బాలకృష్ణ తో కలవడం, ఆయనతో మాట్లాడటం జరిగింది. అందతా ఒక ఎత్తు అయితే తమ్ముడు మోక్షజ్ఞ తో కూడా ఎన్టీఆర్‌ చాలా క్లోజ్ గా మాట్లాడటం జరిగింది. 

Also Read: Baby OTT Release Date: బేబీ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?  

ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్‌ లు ఈ మధ్య కాలంలో చాలా క్లోజ్ గా ఉంటున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్‌ నటిస్తున్న దేవర సినిమాకు ఒక నిర్మాతగా కూడా కళ్యాణ్ రామ్‌ వ్యవహరిస్తున్నాడు. కనుక ఈ ఇద్దరు బ్రదర్స్‌ కలవడం అనేది స్పెషల్‌ కాదు. కానీ ఎన్టీఆర్‌, కళ్యాణ్‌ రామ్‌ లతో మోక్షజ్ఞ కలవడం మాత్రం చాలా స్పెషల్‌ అన్నట్లుగా నందమూరి అభిమానులు సోషల్‌ మీడియాలో ఫోటోలను తెగ షేర్‌ చేస్తున్నారు. మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఇవ్వాలని బలంగా కోరుకుంటే మాత్రం ఎన్టీఆర్ తో సన్నిహిత సంబంధాలను కలిగి ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు. బాలకృష్ణ కాస్త ఎడమొహం పెడమొహం అన్నట్లుగా ఉన్నా కూడా మోక్షజ్ఞ చాలా క్లోజ్‌ గా ఎన్టీఆర్‌ కి ఉంటే మాత్రం కచ్చితంగా భవిష్యత్తులో మంచి కలయికలో సినిమాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Also Read: Shilpa Shetty: చెప్పులు ధరించి జాతీయ జెండాను ఎగురవేసిన శిల్పాశెట్టి.. నెట్టింట ట్రోలింగ్  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News