దర్శకేంద్రుడి స్టైల్ లో 'పెళ్లి సందD' టైటిల్ సాంగ్..అదిరిపోయిందిగా..!

Pelli Sandadi Title Song: దర్శకేంద్రుడు కే.రాఘవేంద్ర రావు పర్యవేక్షణలో రోషన్ హీరోగా,  శ్రీలీలా హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం ‘పెళ్లి సందD’. ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్.

Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 12, 2021, 02:43 PM IST
  • 'పెళ్లి సందD' టైటిల్ సాంగ్ విడుదల
  • రాఘవేంద్రరావు స్టైల్ లో పాట
  • కీరవాణి సంగీతం
దర్శకేంద్రుడి స్టైల్ లో 'పెళ్లి సందD' టైటిల్ సాంగ్..అదిరిపోయిందిగా..!

Pelli sandadi movie: దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు(K Raghavendra Rao) పర్యవేక్షణలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పెళ్లి సందD’. పాతికేళ్ల కిందట ఇదే టైటిల్ తో శ్రీకాంత్ హీరోగా తీసిన చిత్రం రికార్డులు సృష్టించింది. ఇప్పుడు మోడ్రన్ ‘పెళ్లి సందD’తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

అనాటి పెళ్లిసందడి(Pelli sandadi )సినిమా ఏడాది పాటు ప్రదర్శించబడి...బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్ గా నిలిచింది. రాఘవేంద్రరావు టేకింగ్, కీరవాణి(Keeravani) మ్యూజిక్, శ్రీకాంత్(Srikanth) యాక్టింగ్ అన్ని వర్గాల ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఇప్పుడు ఈ కొత్త ‘పెళ్లి సందD’ సినిమాకు  రాఘవేంద్ర రావు దర్శకత్వం చేయట్లేదు.  గౌరీ రోనంకి (Gauri Ronanki)  ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.  శ్రీకాంత్ తనయుడు రోషన్(Roshan) ఈ సినిమాలో హీరోగా నటిస్తుండగా.. శ్రీలీల(Srileela) హీరోయిన్‌గా చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు పాటలను విడుదల చేశారు. ‘ప్రేమంటే ఏంటీ', 'బుజ్జులు’ అనే పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. 

Also Read: పాగ‌ల్ ట్రైల‌ర్‌ విడుదల..విశ్వక్ సేన్ కుమ్మేశాడు భయ్యా!

తాజాగా ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్ ను విడుదల చేసింది చిత్ర బృందం. రాఘవేంద్ర రావు(Raghavendra Rao) స్టైల్‌లోనే  ఈ పాటను చిత్రీకరించారు.  ఓ పెళ్లి వేడుకకు సంబంధించి హీరో, హీరోయిన్లు కలిసి పాడే పాటే ఇది. చంద్రబోస్(Chandabose) సాహిత్యం అందించిన ఈ పాటను హేమచంద్ర, దీపు, రమ్య బెహ్రా ఆలపించారు. కీరవాణి సంగీతం అందించగా...శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా పని చేశారు.  ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియా(Social Media)లో ట్రెండ్ అవుతోంది. 

 ఆర్‌కే ఫిలిం అసోసియేట్స్‌, ఆర్కా మీడియా వ‌ర్క్స్ బ్యానర్స్‌పై కె. కృష్ణ‌మోహ‌న్ రావు‌ సమర్పణలో రూపొందుతున్న ఈ మూవీకి మాధ‌వి కోవెల‌మూడి, శోభు యార్ల‌గడ్డ‌(Shobu yarlagadda), ప్ర‌సాద్ దేవినేని నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్నట్లు  తెలుస్తోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter Facebook

Trending News