Pelli sandaD Heroine Dispute: పెళ్లి సందD హీరోయిన్ శ్రీలీల చుట్టూ వివాదం రేగుతోంది. ఈ హీరోయిన్ తన కూతురు కాదంటున్నారు ప్రముఖ వ్యాపారవేత్త సూరపనేని శుభాకరరావు.
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు(Raghavendrarao) పర్యవేక్షణలో రూపొందిన చిత్రం పెళ్లిసందD.ప్రముఖ హీరో శ్రీకాంత్(Srikanth) తనయుడు రోషన్, యువ హీరోయిన్ శ్రీలీల జంటగా నటించిన సినిమా ఎందుకో ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది. సినిమా కథ, కథనం చాలా వీక్‌గా ఉన్నాయి. విజువల్స్ రాఘవేంద్రరావు స్టైల్‌కు తగ్గట్టుగా ఉన్నా సరే కథలో బలం లేకపోవడంతో అవన్నీ తేలిపోతాయి. గౌరి రోణంకి దర్శకత్వం వహించగా..మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మాతలుగా ఉన్నారు. ఎప్పుడూ తెర వెనుక ఉండే రాఘవేంద్రరావు ఈ సినిమాలో తొలిసారిగా నటించారు.
ఇప్పుడు ఈ పెళ్లి సందD (Pelli sandaD)హీరోయిన్ శ్రీలీల వివాదంలో(Sreeleela) చిక్కుకున్నారు. శ్రీలీల తన కూతురని వస్తున్న వార్తల్ని ప్రముఖ వ్యాపారవేత్త సూరపనేని శుభాకరరావు ఖండించారు. ఈ విషయంపై ఆయన మాట్లాడారు. శ్రీలీల నా కూతురు కాదు. ఆమె నా మాజీ భార్య కూతురు. మేము విడిపోయిన తర్వాత నా మాజీ భార్య శ్రీలీలకు జన్మనిచ్చింది. నా ఆస్తులను క్లెయిమ్ చేయడానికి ఇంటర్వ్యూలలో నా పేరు వాడుతున్నారంటూ సూరపనేని శుభాకరరావు(Surapaneni Subhakar rao) ఆరోపించారు. ఈ విషయంలో న్యాయపరంగా ముందుకెళ్తామని..విడాకులపై కేసు నడుస్తోందని తెలిపారు. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు చేరింది ఈ వ్యవహారం.
Also read: Love Story in Aha: ఆహాలో 'లవ్‌స్టోరీ'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి