Payal Rajput Pic : నా జుట్టుతో ఆడుకోండి.. పాయల్ ఫోటో వైరల్.. నెటిజన్ల డబుల్ మీనింగ్ కామెంట్లు

Payal Rajput Trolls పాయల్ రాజ్‌పుత్ తాజాగా షేర్ చేసిన ఫోటో, వేసిన కామెంట్ రెండూ ట్రోలింగ్‌కు గురవుతున్నాయి. ఆమె ఒక ఉద్దేశంతో వేస్తే.. జనాలు అందులోంచి డబుల్ మీనింగ్‌ ఉద్దేశం తీసుకున్నారు. ఇప్పుడు ఈ ఫోటో వైరల్ అవుతోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 22, 2023, 05:59 PM IST
  • నెట్టింట్లో పాయల్ సందడి
  • జుట్టుని పైకెత్తిన ఆర్ఎక్స్ 100 బ్యూటీ
  • డబుల్ మీనింగ్‌తో పాయల్‌పై ట్రోల్స్
Payal Rajput Pic : నా జుట్టుతో ఆడుకోండి.. పాయల్ ఫోటో వైరల్.. నెటిజన్ల డబుల్ మీనింగ్ కామెంట్లు

Payal Rajput Trolls పాయల్ రాజ్‌పుత్‌ సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రోలింగ్ మెటీరియల్‌గా మారుతుంటుంది. ఆమె వేసే పోస్టులన్నీ ట్రోలింగ్‌కు గురవుతుంటాయి. ఆమె కావాలనే అలాంటి ఫోటోలు, కామెంట్లు పెడుతుందా? లేదంటే తెలియకుండా పోతుందా? అన్నది మాత్రం ఎవ్వరికీ అంతు చిక్కదు. ట్రోలింగ్ జరుగుతుందని తెలిసే కావాలనే అలా పెడుతుందని, అలా అయినా ఫేమస్ అవుతామని, వార్తల్లో నిలుస్తామనే ఉద్దేశంతోనే చేస్తుందని కొంత మంది అంటుంటారు.

పాయల్ రాజ్‌పుత్ తాజాగా షేర్ చేసిన ఫోటో, వేసిన కామెంట్ వైరల్ అవుతోంది. తన జుట్టుతో ఆడుకోండి కానీ హృదయంతో ఆటలు ఆడకండి అని చెప్పుకొచ్చింది. ఇక ఆ కామెంట్ వేస్తూ షేర్ చేసిన ఫోటోలో ఆమె తన జుట్టుని పైకి ఎత్తి పట్టుకుని ఉంది. దీంతో జనాలు ఆమెను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

నువ్ ఏ ఉద్దేశ్యంతో అన్నావో మాకు అర్థం అయింది లే అంటూ జనాలు దారుణంగా సెటైర్లు వేస్తున్నారు. అలా పాయల్ వేసే పోస్టులన్నీ కూడా ట్రోలింగ్‌కు గురవుతుంటాయి. ఇక ఆమె ఆ మధ్య ఓ వీడియోను షేర్ చేసింది. ఫోటో షూట్‌లో భాగంగా ఓ వీడియోను షేర్ చేస్తే.. అందులో ఆమె ప్రైవేట్ పార్ట్ బయటకు కనిపించింది.

 

ప్రైవేట్ పార్ట్ కనిపించేలా ఫోటో షూట్ చేయడంతో జనాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ట్రోల్ చేశారు. ఇక ఆ ట్రోలింగ్‌ను భరించలేని పాయల్ నెటిజన్ల మీద భగ్గుమంది. ఎవ్వరికీ లేని బాడీ పార్ట్స్ నాకే ఉన్నాయా? నేనేమైనా అది కావాలని చేశానా? మీరు నా మీద ఎందుకు ఇంత నెగెటివిటీని చూపిస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేసింది.

పాయల్ చేతిలో  ఇప్పుడు ఒకే ఒక్క సినిమా ఉన్నట్టుగా కనిపిస్తోంది. అజయ్ భూపతితోనే మళ్లీ సినిమా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. గత ఏడాది పాయల్ చేసిన జిన్నా సినిమా దారుణంగా బెడిసి కొట్టేసింది. డిజస్టర్లకే డిజస్టర్‌గా ఈ సినిమా మిగిలిపోయింది. కరోనా కంటే ముందు థియేటర్లోకి వచ్చిన పాయల్ దాదాపు రెండు మూడేళ్ల తరువాత జిన్నాతో వచ్చినా ప్రయోజనం లేకుండా పోయింది.

Also Read:  Rashmi on amberpet stray dog : కుక్కల దాడిలో పసిబిడ్డ మృతి.. కనికరం చూపించకుండా వాటికే యాంకర్ రష్మీ సపోర్ట్

Also Read: Prabhu Hospitalized : హాస్పిటల్‌లో చేరిన ప్రముఖ నటుడు ప్రభు.. కారణం ఏంటంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News