Vakeel Saab: వకీల్ సాబ్ మూవీ లేటెస్ట్ అప్‌డేట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అప్ కమింగ్ మూవీ వకీల్ సాబ్ సినిమా మొత్తం షూటింగ్ భాగం పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్‌లోకి ఎంటరైంది. పవన్ కళ్యాణ్ ఇదివరకే తన షూటింగ్ పార్ట్ పూర్తి చేయగా తాజాగా సినిమాకు సంబంధించిన మొత్తం ప్రొడక్షన్ వర్క్ పూర్తయింది.

Last Updated : Jan 10, 2021, 04:26 AM IST
Vakeel Saab: వకీల్ సాబ్ మూవీ లేటెస్ట్ అప్‌డేట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అప్ కమింగ్ మూవీ వకీల్ సాబ్ సినిమా మొత్తం షూటింగ్ భాగం పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్‌లోకి ఎంటరైంది. పవన్ కళ్యాణ్ ఇదివరకే తన షూటింగ్ పార్ట్ పూర్తి చేయగా తాజాగా సినిమాకు సంబంధించిన మొత్తం ప్రొడక్షన్ వర్క్ పూర్తయింది. దీంతో ఇక సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తుండగా బోనీ కపూర్ ప్రజెంట్ చేస్తున్నాడు. వకీల్ సాబ్ మూవీ సమ్మర్ బాక్సాఫీస్ మార్కెట్‌ను క్యాష్ చేసుకునేందుకు వీలుగా ఏప్రిల్‌లో థియేటర్స్‌లోకి రానుంది. 

పవన్ కల్యాణ్ అభిమానులకు సంక్రాంతి ( Sankranti festival ) కానుకగా జనవరి 14న సాయంత్రం 6.03 గంటలకు వకీల్ సాబ్ మూవీ టీజర్‌ని రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే చిత్ర నిర్మాతలు ప్రకటించిన సంగతి తెలిసిందే.

Also read : Vakeel Saab teaser: వకీల్ సాబ్ టీజర్‌ విడుదలకు ముహూర్తం ఖరారు

వకీల్ సాబ్ సినిమాలో న్యాయం కోసం పలువురు అమ్మాయిలు సాగించే న్యాయ పోరాటంలో వారికి బాసటగా నిలిచిన న్యాయవాది పాత్రలో పవన్ కల్యాణ్ ( Pawan Kalyan ) కనిపించనుండగా.. పవర్ స్టార్‌కి జంటగా శ్రుతి హాసన్ ( Shruti Haasan ) నటిస్తోంది. పింక్ సినిమాకు తెలుగు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అంజలి, అనన్య నాగళ్ల, నివేదా థామస్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఫేమస్ మ్యూజిక్ కంపోజర్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News