Ayyapanum Koshiyum: మరో రీమేక్ సినిమాలో పవన్ కల్యాణ్ ?

అయ్యపనమ్ కోషియం ( Ayyapanum Koshiyum ) అనే మలయాళ చిత్రం మలయాళ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అలాగే OTT ప్లాట్‌ఫామ్‌లలో కూడా ఇది తెలుగు, తమిళ ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంది. ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నట్లు ఓ టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా తెలుగు రీమేక్ ( Ayyapanum Koshiyum Telugu remake ) చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. 

Last Updated : Aug 13, 2020, 09:23 AM IST
  • మళయాళంలో సూపర్ హిట్ అయిన సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు
  • గతంలో ఈ రీమేక్ కోసం రానా దగ్గుబాటి, బాలకృష్ణ, రవితేజ పేర్లు పరిశీలిస్తున్నట్టు టాక్
  • తాజాగా తెరపైకి పవన్ కల్యాణ్ పేరు
Ayyapanum Koshiyum: మరో రీమేక్ సినిమాలో పవన్ కల్యాణ్ ?

అయ్యపనమ్ కోషియం ( Ayyapanum Koshiyum ) అనే మలయాళ చిత్రం మలయాళ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అలాగే OTT ప్లాట్‌ఫామ్‌లలో కూడా ఇది తెలుగు, తమిళ ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంది. ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నట్లు ఓ టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా తెలుగు రీమేక్ ( Ayyapanum Koshiyum Telugu remake ) హక్కులను సితారా ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ హౌస్ కొనుగోలు చేసినట్టు సమాచారం. మొదటగా ఈ చిత్రంలో రానా దగ్గుబాటి, నందమూరి బాలకృష్ణ, రవితేజలు నటించనున్నట్లు చాలా పుకార్లు వచ్చాయి. కానీ ఆ చిత్ర రీమేక్ హక్కులు కొన్న ప్రొడక్షన్ హౌజ్ మాత్రం వాటిని ఇంకా ధృవీకరించలేదు. Also read : Vakeel Saab: వకీల్ సాబ్ విడుదలపై లేటెస్ట్ అప్‌డేట్స్

ఇదిలావుండగానే. ఇప్పుడు పవన్ కళ్యాణ్‌కి ( Pawan Kalyan ) త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాతలు సన్నిహితులు కావడంతో, ఈ రీమేక్‌లో పవన్ కల్యాణ్ నటించే అవకాశాలు ఉన్నాయని పుకార్లు వినబడుతున్నాయి. అదే నిజమైతే, మల్టీస్టారర్ అయిన ఈ సినిమాలో అతనితో పాటు ఇంకా ఎవరెవరు నటిస్తారో చూడాలి. ఐతే ఈ ప్రాజెక్ట్ గురించి, అలాగే వస్తున్న వార్తల గురించి ఎవరు పెదవి విప్పడం లేదు. ఇదే నిజమైతే ఈ చిత్రం గురించి పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌ పుట్టినరోజున ఎమైనా వార్తలు వినిపిస్తాయో వేచి చూడాల్సిందే. Also read : MS Dhoni: ధోని మరో రెండేళ్లు ఆడతాడు

Trending News