Pawan Kalyan OG Shoot : OG సెట్లో పవన్ కళ్యాణ్‌.. సింపుల్ అండ్ స్టైలీష్.. వైరల్ పిక్

They Call Him OG Shoot పవన్ కళ్యాణ్‌ సుజిత్ కాంబోలో దే కాల్ హిమ్ ఓజీ అనే సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ అని అర్థం. ఈ మూవీ మొత్తం మాఫియా చుట్టూ ఉంటుందని అర్థం అవుతోంది. అందుకే ఈ సినిమా అంతా కూడా ముంబై బేస్డ్‌గా నడుస్తునంది తెలుస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 18, 2023, 01:27 PM IST
  • ముంబైలో అడుగు పెట్టిన పవన్ కళ్యాణ్‌
  • ఓజీ సినిమా షూటింగ్ మొదలెట్టేసిన యూనిట్
  • వారం రోజుల పాటు ముంబైలోనే షూట్‌?
Pawan Kalyan OG Shoot : OG సెట్లో పవన్ కళ్యాణ్‌.. సింపుల్ అండ్ స్టైలీష్.. వైరల్ పిక్

They Call Him OG Shoot పవన్ కళ్యాణ్‌ చేతిలో ప్రస్తుతం నాలుగైదు సినిమాలున్నాయి. తాజాగా మళ్లీ ఓ కొత్త మూవీ షూటింగ్‌ను స్టార్ట్ చేశాడు. డీవీవీ దానయ్య నిర్మిస్తోండగా.. సుజిత్ తెరకెక్కిస్తున్న ఓజీ సినిమా షూటింగ్ కోసం పవన్ కళ్యాణ్‌ ముంబైలో అడుగు పెట్టాడు. ఓ వారం రోజుల పాటు ముంబైలోనే ఈ మూవీ షూటింగ్ కోసం పవన్ కళ్యాణ్‌ ఉండబోతోన్నట్టు తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్‌ మొన్నటి వరకు వినోదయ సిత్తం సినిమా రీమేక్ షూటింగ్‌ను పూర్తి చేశాడు. సాయి ధరమ్ తేజ్‌తో పవన్ కళ్యాణ్‌ సీన్లను చకచకా పూర్తి చేశాడు సముద్రఖని. ఆ తరువాత వెంటనే మళ్లీ హరీష్‌ శంకర్ సినిమా సెట్‌లో సందడి చేశాడు. ఎనిమిది రోజుల పాటుగా జరిగిన ఈ షూటింగ్‌లో భారీ యాక్షన్ సీక్వెన్స్‌లను షూట్ చేశారని తెలుస్తోంది.

అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మరో యాక్షన్ మూవీకి షూటింగ్ సెట్‌లో అడుగు పెట్టేశాడు. సుజిత్ దానయ్య కాంబోలో రాబోతోన్న ఓజీ సినిమా సెట్‌లో పవన్ కళ్యాణ్‌ అడుగు పెట్టాడు. ఇప్పుడు ఆయన ఈ మూవీ షూటింగ్ కోసం ముంబైకి స్పెషల్ ఫ్లైట్లో వెళ్లినట్టు సమాచారాం అందుతోంది. ఈ మూవీ షూటింగ్ కోసం పవన్ కళ్యాణ్‌ వారం రోజుల పాటు అక్కడే ఉంటాడని టాక్.

Also Read:  Ileana D'cruz : తల్లి కాబోతోన్న ఇలియానా?.. హీరోయిన్ పోస్ట్‌పై కామెంట్లు.. తండ్రి ఎవరంటూ ట్రోల్స్

ఇక ఆ వెంటనే మళ్లీ హరిహర వీరమల్లు సినిమా షూటింగ్‌ను మొదలుపెడతాడని తెలుస్తోంది. ఈ మూవీ అయితే కరోనా కంటే ముందు పూర్తి అవ్వాలి. కానీ ఈ సినిమా అంతకంతకూ ఆలస్యం అవుతూనే వస్తోంది. మధ్యలో క్రిష్‌ ఓ సినిమాను కూడా చేసుకుని వచ్చాడు. ఈ హరిహర వీరమల్లు సినిమాను ఆపేశారని కూడా మధ్యలో టాక్ వచ్చింది. కానీ ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలని ఏఎం రత్నం అనుకుంటున్నాడట.

 

ఇక ఓజీ మూవీ విషయానికి వస్తే.. ఇప్పటికే ఓ కాన్సెప్ట్ వీడియోను వదిలారు. అందులో చాలానే హింట్లు ఇచ్చారు. తమన్ కొట్టిన ఆర్ఆర్‌కు అంతా ఫిదా అయ్యారు. మొత్తానికి మరోసారి గ్యాంగ్ స్టర్, మాఫియా కథతో పవన కళ్యాణ్ రఫ్పాడించేందుకు రెడీ అవుతున్నాడు.

Also Read: Samantha Realisation : రియలైజ్ అయిన సమంత?.. తత్త్వం బోధపడినట్టుందిగా.. ఆ పోస్ట్ ఉద్దేశం అదేనా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News