జూ.ఎన్టీఆర్ సిన్మాకి పవర్‌స్టార్ క్లాప్..!

                  

Last Updated : Oct 23, 2017, 03:22 PM IST
జూ.ఎన్టీఆర్ సిన్మాకి పవర్‌స్టార్ క్లాప్..!

జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న అతని 28వ సినిమా ప్రారంభోత్సవానికి పవర్ స్టార్ పవన్‌కళ్యాణ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. క్లాప్ కొట్టి తొలిషాట్‌కు నాంది పలికారు. ఈ సందర్భంగా సెట్‌లో కొన్ని గమ్మత్తులు జరిగాయి. "క్లాప్ కొట్టాక ఏం చేయాలి" అని అడుగుతూ, ఏం చేయాలో తెలియక వెంటనే సెట్‌లోనే క్రింద కూర్చొనిపోయారు పవన్. ఆ సంఘటన చూసి ఎన్టీఆర్ నవ్వాపుకోలేకపోయారు.

తర్వాత ఇద్దరూ ఆప్యాయంగా కౌగలించుకొని, పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకున్నారు. తర్వాత ఫోటోషూట్‌లో అందరి మధ్య నిలబడమని, ఎన్టీఆర్ పవన్‌ని కోరగా, ఆయన బలవంతంగా ఎన్టీఆర్‌నే మధ్యలో నిలుచోబెట్టారు. ఈ సంఘటన కూడా సెట్‌లో నవ్వులు పూయించింది.

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమాని హారికా-హాసిని క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.అయితే ఈ చిత్రానికి సంబంధించి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంలో తారక్ కుమారుడు అభయ్‌రామ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 

 

Trending News