Naresh - Pavitra Lokesh : పెళ్లి వార్తల నేపథ్యంలో భర్త అలాంటి వాడంటూ పవిత్ర లోకేష్ కామెంట్స్ వైరల్!

Pavitra Lokesh about Suchendra Prasad :  నటుడు నరేష్ తో వివాహం విషయంలో వార్తల్లోకి ఎక్కిన పవిత్ర పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతోంది. అయితే ఇప్పుడు ఆమె గతంలో తన భర్త గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 24, 2022, 02:32 PM IST
  • నటుడు నరేష్ తో పవిత్ర వివాహం అంటూ ప్రచారం
  • గతంలో భర్త గురించి పవిత్ర కామెంట్స్ వైరల్
  • ఐదేళ్ళ క్రితం వీడియో ఇప్పుడు తెరమీదకు
Naresh - Pavitra Lokesh : పెళ్లి వార్తల నేపథ్యంలో భర్త అలాంటి వాడంటూ పవిత్ర లోకేష్ కామెంట్స్ వైరల్!

Pavitra Lokesh about Suchendra Prasad : తండ్రి నటనా వారసత్వం అందుకుని నటిగా మారిన పవిత్ర లోకేష్ తొలుత కన్నడలో ఎంట్రీ ఇచ్చింది. అక్కడ వరుస సినిమా అవకాశాలు అందుకున్న ఆమె తరువాత సీరియల్స్ లో కూడా నటించారు. ఇక దొంగోడు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆమె ఇప్పటికే దాదాపు 50 సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఎక్కువగా తల్లి, అక్క, వదిన పాత్రలకు ఫేమస్ అయిన ఆమె ఇప్పుడు అనూహ్యంగా వార్తల్లోకి ఎక్కింది. నటుడు నరేష్ తో వివాహం విషయంలో వార్తల్లోకి ఎక్కిన ఆమె ఆ విషయం గురించి పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతోంది. అయితే ఇప్పుడు ఆమె గతంలో తన భర్త గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 

ఈ ఇంటర్వ్యూ ఇప్పటిది కాదు, సుమారు ఐదేళ్ల క్రితం ఇచ్చిన ఇంటర్వ్యూలో పవిత్ర చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మళ్ళీ వైరల్ అవుతున్నాయి. తన భర్త కన్నడ నటుడు సుచేంద్ర ప్రసాద్ గురించి పవిత్ర సదరు ఇంటర్వ్యూలో చాలా మంచిగా చెప్పారు. సుచేంద్ర ప్రసాద్ తో కలిసి ఒక సీరియల్‌లో నటించానని, అప్పుడు తమ మధ్య పరిచయం ఏర్పడిందని పేర్కొంది. అది స్నేహమో, ప్రేమో, గౌరవమో తెలీదు కానీ.. ఒకరిపై ఒకరికి ఉన్న అభిమానంతో పెళ్లి చేసుకున్నామని, తరువాత చాలా సంతోషంగా కాలం గడుపుతున్నామని ఆమె అన్నారు.  సుచేంద్ర ప్రసాద్ చాలా గొప్ప వ్యక్తి అని, తనతో పోల్చుకుంటే ఆయన చాలా మంచి వ్యక్తని కూడా కామెంట్ చేసింది. 

అసలు సుచేంద్రలో ఒక్క లోపాన్ని కూడా కనిపెట్టలేమని, ఎంతో గౌరవం ఇచ్చి పుచ్చుకుంటరని పవిత్ర వెల్లడించారు. స్వతహాగా సుచేంద్ర రచయిత, దర్శకుడు, నటుడు. కానీ సుచేంద్ర నటుడిగానే తనకు నచ్చుతారని పవిత్ర వెల్లడించారు. తాము ఇద్దరమూ కలిసి జంటగా నటించే అవకాశం వచ్చింది కానీ ఒకేసారి షూటింగ్‌కు వెళ్తే పిల్లలను చూసుకోడానికి ఎవరూ ఉండరు కాబట్టి ఆ అవకాశాలు వదులుకొనే వాళ్లమని కూడా చెప్పుకొచ్చారు. 

సుచేంద్ర లాంటి భర్త దొరికినందుకు తాను చాలా లక్కీ అని, టైమ్ దొరికితే సుచేంద్ర వండి పెట్టేస్తారని, ఇంట్లో అన్ని పనులు కూడా చేస్తారని పవిత్ర చెప్పుకొచ్చారు. సుచేంద్ర ప్రసాద్ నేను ఆయనకే సొంతమని భావించేవారు కాబట్టి నేను చేసిన సినిమాలు కూడా చూసేవారు కాదని, నేను కూడా ఏ రోజు సినిమాలు చూడమని ఒత్తిడి చేయలేదని పవిత్ర చెప్పుకొచ్చారు. అయితే ఆమె భర్తతో విడాకులకు అప్ప్లై చేసినట్టు ప్రచారం జరుగుతోంది కానీ ఆ విషయం మీద ఎలాంటి క్లారిటీ లేదు. ఇక వీరికి ఇద్దరు సంతానం కూడా ఉన్నారు. 
Also Read: Chor Bazaar Review : ఆకాష్ పూరి 'చోర్ బజార్' రివ్యూ.. ఎలా ఉందంటే?

Also Read:Neha Malik Bikini Pics: బికినీలో నేహా మాలిక్.. ఎద అందాలు ఫోకస్ చేస్తూ అరాచకం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News