SRK Follows 6 People: షారుఖ్ ఖాన్ ఫాలో అవుతున్న ఆ ఆరుగురు ఎవరో తెలుసా ?

SRK Follows 6 People on Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లో తనని 36 మిలియన్ల మంది ఫాలో అవుతున్నప్పటికీ.. షారుఖ్ ఖాన్ మాత్రం కేవలం ఆరుగురినే తిరిగి ఫాలో అవుతున్నాడు. ఇంతకీ ఆ ఆరుగురు లక్కీ పర్సన్స్ ఎవరో తెలియాలంటే ఇదిగో ఈ డీటేల్స్ తెలుసుకోవాల్సిందే.

Written by - Pavan | Last Updated : Feb 23, 2023, 07:08 AM IST
SRK Follows 6 People: షారుఖ్ ఖాన్ ఫాలో అవుతున్న ఆ ఆరుగురు ఎవరో తెలుసా ?

SRK Follows 6 People on Instagram: పఠాన్ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ అవడంతో బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ ఆనందంలో మునిగి తేలుతున్నాడు. జీరో మూవీ తరువాత నాలుగేళ్ల విరామంతో మొదటిసారిగా ఆడియెన్స్ ముందుకొచ్చిన షారుఖ్ ఖాన్.. పఠాన్ మూవీతో ఆ వెలితిని భర్తీ చేసే రేంజ్ పర్‌ఫార్మెన్స్ ఇచ్చాడు. దీపికా పదుకునె, షారుఖ్ ఖాన్ జంటగా నటించిన పఠాన్ మూవీ ప్రస్తుతం బాలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇండియా టుడే ప్రచురించిన ఓ కథనం ప్రకారం పఠాన్ మూవీ 1000 కోట్ల క్లబ్‌లో చేరినట్టు తెలుస్తోంది.

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌కి ఇండియాలోనే కాదు.. ప్రపంచ దేశాల్లోనూ ఫాన్స్ ఉన్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా వీలైతే సినిమా అప్‌డేట్స్.. లేదంటే సెల్ఫీలు, పర్సనల్ అప్‌డేట్స్ ఇస్తూ అప్పుడప్పుడు అభిమానులతో టచ్‌లో ఉండే కింగ్ ఖాన్‌కి ఒక్క ఇన్‌స్టాగ్రామ్‌లోనే దాదాపు 36 మిలియన్స్ మంది ఫాలోవర్స్ ఉన్నారు. వీళ్లలో చాలామంది షారుఖ్ ఖాన్‌కి హార్డ్‌కోర్ ఫ్యాన్సే. అయితే, తనని 36 మిలియన్ల మంది ఫాలో అవుతున్నప్పటికీ.. షారుఖ్ ఖాన్ మాత్రం కేవలం ఆరుగురినే తిరిగి ఫాలో అవుతున్నాడు. ఇంతకీ ఆ ఆరుగురు లక్కీ పర్సన్స్ ఎవరో తెలియాలంటే ఇదిగో ఈ డీటేల్స్ తెలుసుకోవాల్సిందే.

షారుఖ్ ఖాన్ ఫాలో అవుతున్నాడంటే వాళ్లు కచ్చితంగా ఆయనకు సమకాలికులు అయ్యుండాలి లేదా నేషనల్, ఇంటర్నేషనల్ ఫిగర్స్ అయ్యుండాలి అని అనుకుంటున్నారా ? అబ్బే అలాంటిదేమీ లేదండి. అలా ఆలోచిస్తే ఆ ఆరుగురు ఎవరనేది ఊహించడం కూడా కష్టమే.

షారుఖ్ ఖాన్ ఫాలో అవుతున్న ఆరుగురిలో మొదటి వ్యక్తి ఆయన భార్య గౌరీ ఖాన్ ఉన్నారు. అవును.. షారుఖ్ ఖాన్‌కి తన భార్య గౌరీ ఖాన్‌ అంటే చాలా ఇష్టం. స్టార్ హీరో కాకముందే గౌరీ ఖాన్‌ని ఫాలో అవుతూ ఆమెతో ప్రేమాయణం సాగించాడు. అందుకే ఇప్పటికీ ఆమెను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతున్నాడు.

ఇక షారుఖ్ ఖాన్ ఫాలో అవుతున్న రెండో వ్యక్తి తన కుమారుడు ఆర్యన్ ఖాన్. షారుఖ్ ఖాన్‌కి భార్య  గౌరి ఖాన్‌పైనే కాదు.. కుమారుడు ఆర్యన్ ఖాన్ అన్నా అంతే ఇష్టం. తన నట వారసుడిగా ఎంతో భవిష్యత్ ఉన్న ఆర్యన్ ఖాన్‌ని షారుఖ్ ఖాన్ ఇన్‌స్టాలో ఫాలో అవుతున్నాడు.

షారుఖ్ ఖాన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతున్న మూడో వ్యక్తి మరెవరో కాదు.. షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్. షారుఖ్ ఖాన్ గారాలపట్టిగా సుహాన్ ఖాన్‌కి పేరుంది. ప్రస్తుతం సుహానా ఖాన్‌ని హీరోయిన్‌గా పరిచయం చేస్తూ ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాతోనే అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నంద కూడా హీరోగా పరిచయం అవుతున్నాడు.

ఇంట్లో అందరికంటే చిన్నోడు అబ్రామ్ ఖాన్ తప్ప.. మిగతా ముగ్గురూ అయిపోయారు కదా.. మరి ఈ నాలుగో పర్సన్ ఎవరు అని అనుకుంటున్నారా ? ఈ నాలుగో మనిషి కూడా తన కుటుంబానికి చెందిన వాళ్లే కావడం విశేషం. ఆమె ఎవరో కాదు.. ఆలియా చిబా. ఆలియా చిబా అంటే షారుఖ్ ఖాన్ బావమరిది కూతురు. గౌరి ఖాన్ సోదరుడి కూతురు ఆలియా చిబాకు షారుఖ్ ఖాన్ కుటుంబంతో మంచి అనుబంధం ఉంది. ఆలియాను కూడా షారుఖ్ తన పిల్లల్లాగే ట్రీట్ చేస్తాడు. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఫాలో అవుతున్నాడు.

షారుఖ్ ఖాన్ ఫాలో అవుతున్న ఐదో పర్సన్ ఎవరో కాదు.. షారుఖ్ ఖాన్ పర్సనల్ మేనేజర్ పూజా దద్లాని. షారుఖ్ ఖాన్ వద్ద ఆమె 2012 నుంచి మేనేజర్‌గా పనిచేస్తోంది. పూజాను షారుఖ్ కుటుంబం తమ ఇంటి మనిషిగానే ట్రీట్ చేస్తారు. షారుఖ్ ఖాన్ భార్య గౌరి ఖాన్‌తోనూ పూజాకు మంచి అనుబంధం ఉంది.

షారుఖ్ ఖాన్ ఫాలో అవుతున్న ఆరో వ్యక్తి పేరే కాజల్ ఆనంద్. కాజల్ ఆనంద్ షారుఖ్ ఖాన్‌కి మంచి స్నేహితురాలు. లా చదువుకున్న కాజల్ ఆనంద్.. గతంలో సంజయ్ దత్ లీగల్ టీమ్‌లోనూ పనిచేశారు. కానీ ప్రస్తుతం ఆమె తన లా కెరీర్‌కి గుడ్ బై చెప్పి లైఫ్ స్టైల్ అండ్ ఫ్యాషన్ బిజినెస్‌లోకి అడుగుపెట్టారు. చూశారు కదా.. షారుఖ్ ఖాన్ తన కుటుంబానికి, తన వద్ద పనిచేసే వారికి, తనతో ఆత్మీయంగా ఉండే మిత్రులకు ఎంత ప్రాధాన్యతను ఇస్తున్నాడో. అందుకే షారుఖ్ ఖాన్ అన్ని కోట్ల మంది హృదయాలను గెలుచుకున్నాడు. దటీజ్ బాలీవుడ్ కీ బాద్‌షా.. షారుఖ్ ఖాన్.

ఇది కూాడా చదవండి : UPI Transactions News: యూపీఐ పేమెంట్స్ ఇప్పుడు ఇలా కూడా చేయొచ్చు

ఇది కూాడా చదవండి : Fake Passport Alert: పాస్‌పోర్ట్ కోసం అప్లై చేసే వాళ్లు తప్పక తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం

ఇది కూాడా చదవండి : Tata Tiago Car: జనం కళ్లు మూసుకుని కొంటున్న చీప్ అండ్ బెస్ట్ టాటా కారు ఇదే

ఇది కూాడా చదవండి : Nikki Tamboli Pics: దాచుకోవడానికంటూ ఏమీ లేదు.. ఇక్కడంతా ఓపెనే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

యాపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News