Oscar 2023: మరి కాస్సేపట్లో ఆస్కార్ 2023 వేడుక, ఎన్నిగంటలకు ఎక్కడ చూడొచ్చు, పూర్తి వివరాలు

Oscar 2023: ప్రపంచ సినీ పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డుల వేడుకకు మరి కొద్దిగంటలే మిగిలింది. లాస్ ఏంజిల్స్‌లోని డోల్బీ థియేటర్ వేదికగా రేపు ఉదయం మహా వేడుక ప్రారంభం కానుంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 12, 2023, 04:50 PM IST
Oscar 2023: మరి కాస్సేపట్లో ఆస్కార్ 2023 వేడుక, ఎన్నిగంటలకు ఎక్కడ చూడొచ్చు, పూర్తి వివరాలు

Oscar 2023: ఆస్కార్ 2023 వేడుకకు మరి కొద్దిగంటలే మిగిలింది. భారత కాలమానం ప్రకారం రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకూ జరిగే వేడుక ఓవైపు..ఆర్ఆర్ఆర్ నాటు నాటు పాట మరోవైపు ఆసక్తి రేపుతున్నాయి. నాటు నాటు పాట ఆస్కార్ బరిలో విజేతగా నిలుస్తుందా లేదా అనేది మరి కొద్దిగంటల్లో తేలిపోనుంది.

ప్రతిష్ఠాత్మక ఆస్కార్ 2023 అవార్డుల వేడుక భారత కాలమానం ప్రకారం మార్చ్ 13 ఉదయం నుంచి ప్రారంభం కానుంది. అమెరికా లాస్ ఏంజిల్స్‌లోని డోల్బీ థియేటర్ వేదికగా జరిగే ఈ వేడుక ఏబీసీలో ప్రత్కక్ష ప్రసారం కానుంది. ఈసారి ఆస్కార్ అవార్డులపై గతంలో ఎన్నడూ లేనంతగా భారతీయులకు ముఖ్యంగా తెలుగువారికి ఆసక్తి నెలకొంది. కారణం రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్ నాటు నాటు పాట నామినేషన్లలో ఉండటమే. ఈసారి ఇండియా నుంచి ఆర్ఆర్ఆర్ సినిమాతో పాటు మరో భారతీయ సినిమాలు నామినేట్ అయి ఉన్నాయి.

ఈసారి ఆస్కార్ అవార్డు వేడుకను ప్రముఖ కమెడియన్ జిమ్మీ కిమ్మెల్ హోస్ట్ చేయనున్నాడు. అతనికి ఇది మూడవసారి. గతంలో 2017, 2018లో ఆస్కార్ వేడుకను హోస్ట్ చేశాడు. గత ఏడాది అంటే 2022లో మాత్రం యామీ స్కూమర్, వాండా స్కైస్, రెజినా హాల్ ముగ్గురూ కలిసి హోస్ట్ చేశారు.

ఈ ఏడాది ఆస్కార్ అవార్డుల్ని అందించేవారి జాబితాలో డ్వెయిన్ జాన్సన్, మైకేల్ బి జోర్డాన్, రిజ్ అహ్మద్, ఎమిలీ బ్లంట్, గ్లెన్ క్లోజ్, ట్రాయ్ కోట్సూర్, డోనీ యెన్, జొనాథన్ మేజర్స్, క్వెస్ట్‌లోవ్ సహా ఇండియాకు చెంది దీపికా పదుకోన్ ఉన్నారు. 

లేడీ గాగా తప్పించి మిగిలిన ఆస్కార్ నామినీలు అందరూ రేపు జరిగే వేడుకలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగరీ ఎంపిక పాటల్ని ప్రదర్శించనున్నారు. ఆస్కార్ సాంప్రదాయం ప్రకారం బెస్ట్ ఒరిజినల్ కేటగరీలో నామినేట్ అయిన పాటల్ని ప్రదర్శిస్తుంటారు. ఇందులో లిఫ్ట్ మి అప్ పాటకు రిహాన్నా, ఎప్లాస్ పాటకు సోఫియా కార్సన్ మరియు డయానే వారెన్, దిస్ ఈజ్ ఎ లైఫ్ పాటకు స్టెఫనీ సూ, డేవిడ్ బైర్న్, సన్‌లక్స్‌తో పాటు నాటు నాటు పాటను రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవలు ప్రదర్శించనున్నారు.

ఆర్ఆర్ఆర్ నాటు నాటు పాట బెస్ట్ ఒరిజినల్ పాట కేటగరీలో నామినేష్ అయింది. బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ విభాగంలో షౌనక్ సేన్ తెరకెక్కించిన ఆల్ దట్ బ్రీత్స్ , బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్‌లో గునీత్ మోంగా తెరకెక్కించిన ది ఎలిఫెంట్ విస్పరెర్స్ నామినేట్ అయ్యాయి.

Also read: Naatu Naatu Song: ఆస్కార్ ఒక్కటే కాదు, ఆ అవార్డు కూడా గెల్చుకోవాలంటున్న ఏఆర్ రెహమాన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News