RRR Movie: ఆ థియేటర్‌లో 'ఆర్ఆర్ఆర్' ఫస్టాఫ్ మాత్రమే.. నో సెకండాఫ్... షాక్ తిన్న ప్రేక్షకులు

RRR Latest Updates:ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్లి భంగపడ్డ అనుపమ చోప్రా.. ఎట్టకేలకు సెకండాఫ్‌ని కూడా చూసినట్లు మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. సినిమాను ఎంజాయ్‌ చేశానని.. రాజమౌళి కన్విక్షన్, కమిట్‌మెంట్‌తో ఫాంటసీ-రియాలిటీ హైబ్రిడ్ వర్కౌట్ అయిందని అన్నారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 26, 2022, 06:08 PM IST
  • ఆర్ఆర్ఆర్ చూసేందుకు వెళ్లిన ప్రేక్షకులకు షాక్
  • ఆ థియేటర్‌లో కేవలం ఫస్టాఫ్ మాత్రమే
  • సెకండాఫ్ చూడకపోవడంతో ఫ్రస్టేట్ అయిన ప్రేక్షకులు
RRR Movie: ఆ థియేటర్‌లో 'ఆర్ఆర్ఆర్' ఫస్టాఫ్ మాత్రమే.. నో సెకండాఫ్... షాక్ తిన్న ప్రేక్షకులు

RRR Latest Updates: 'ఆర్ఆర్ఆర్' లాంటి మోస్ట్ ఎగ్జయిటింగ్ సినిమాకు వెళ్లి.. తీరా ఫస్టాఫ్ చూశాక.. సెకండాఫ్ లేదు, ఇక దయచేయండి అని థియేటర్ యాజమాన్యం చెబితే ఎలా ఉంటుంది... అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న సినీమార్క్ థియేటర్‌లో ఆర్ఆర్ఆర్ సినిమా చూసేందుకు వెళ్లినవారికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఫస్టాఫ్ అయ్యాక.. సెకండాఫ్ లేదని థియేటర్ యాజమాన్యం చెప్పడంతో సినిమాకు వెళ్లినవారు షాక్ తిన్నారు. ఇదే విషయంపై అనుపమ చోప్రా అనే ఫిలిం క్రిటిక్ ఓ ట్వీట్ చేశారు.

'ఇలా జరగడం ఇదే తొలిసారి. ఆర్ఆర్ఆర్ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేందుకు నార్త్ హాలీవుడ్ సినీమార్క్ థియేటర్‌కి వెళ్లాను. అయితే ఫస్టాఫ్ మాత్రమే చూశాను. ఎందుకంటే థియేటర్‌ సిబ్బంది సెకండాఫ్ ఇంజెస్ట్ చేయలేదు. దీనిపై మేనేజర్‌ను ఆరా తీస్తే.. సినిమా ఇంకా ఉందనే విషయంపై తనకెలాంటి సూచనలు అందలేదన్నారు. చాలా ఫ్రస్టేటింగ్‌గా ఉంది..' అని అనుపమ చోప్రా తన ట్వీట్‌లో పేర్కొన్నారు. సాంకేతిక కారణాల వల్లే ఆ థియేటర్‌లో ఫస్టాఫ్ మాత్రమే ప్రదర్శించినట్లు తెలుస్తోంది.

ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్లి భంగపడ్డ అనుపమ చోప్రా.. ఎట్టకేలకు సెకండాఫ్‌ని కూడా చూసినట్లు మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. సినిమాను ఎంజాయ్‌ చేశానని.. రాజమౌళి కన్విక్షన్, కమిట్‌మెంట్‌తో ఫాంటసీ-రియాలిటీ హైబ్రిడ్ వర్కౌట్ అయిందని అన్నారు. తారక్, రాంచరణ్ పెర్ఫామెన్స్ అద్భుతంగా ఉందని ప్రశంసించారు. ఆర్ఆర్ఆర్ సినిమా శుక్రవారం (మార్చి 25) ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. విడుదలైన అన్నిచోట్ల సినిమా పాజిటివ్ టాక్ దక్కించుకుంది. రాజమౌళి దర్శకత్వం, తారక్, చెర్రీల అద్భుత నటన, అద్భుతమైన విజువల్స్ సినిమాను ఎక్కడికో తీసుకెళ్లాయని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. 

Also Read: AP New Districts: ఏపీ కొత్త జిల్లాలపై 4-5 రోజుల్లో తుది నోటిఫికేషన్ విడుదల

Also Read: Video: గుండెలు పిండేసే వీడియో.. కూతురి శవాన్ని భుజాలపై 10కి.మీ మోసుకెళ్లిన తండ్రి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News