Game Changer Release Date: ఈ మధ్యనే కమల్ హాసన్ హీరోగా..నటించిన భారతీయుడు 2 సినిమాతో.. స్టార్ డైరెక్టర్ అందుకున్నారు. ఈ మధ్య వరుస ఫెయిల్యూర్స్ అందుకుంటున్న శంకర్.. భారతీయుడు 2 సినిమా మీదే తన ఆశలన్నీ పెట్టుకున్నారు. అభిమానులకి కూడా సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. కానీ అంచనాలను.. అందుకోవడంలో సినిమా పూర్తిగా విఫలమైంది.
ఈ నేపథ్యంలో శంకర్ తదుపరి సినిమా గేమ్ చేంజర్.. మీద కూడా సందేహాలు మొదలయ్యాయి. ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో అని.. మెగా అభిమానులు ఇప్పటినుంచే కంగారు పడుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా లో రామ్ చరణ్ భాగం షూటింగ్ పూర్తయిపోయింది. రామ్ చరణ్ తో పనిలేని కొన్ని సన్నివేశాల.. షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది.
మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలైపోయాయి. కానీ సినిమా ఫైనల్ కట్ రెడీ.. అయ్యాకే రిలీజ్ డేట్ ప్రకటిస్తానని శంకర్ ఆల్రెడీ చెప్పేశారు. ఉన్న పనులన్నీ పూర్తయి సినిమాని విడుదల చేయాలి.. అంటే డిసెంబర్ అవుతుంది. ఇక సుకుమార్ అల్లు అర్జున్ కాంబో లో రావాల్సిన పుష్ప 2 షూటింగ్ కి బ్రేకులు పడ్డాయి. ఒకవేళ డిసెంబర్ 6న విడుదల కావలసిన సినిమా తప్పుకుంటే, గేమ్ చేంజర్ సినిమాని.. చక్కగా డిసెంబర్ 6న విడుదల చేయొచ్చు.
ఒకవేళ మైత్రి మూవీ మేకర్స్ పట్టు పట్టి.. పుష్ప 2 సినిమాని డిసెంబర్ 6న విడుదల చేయాలి అనుకుంటే.. అప్పుడు డిసెంబర్ 20 కూడా గేమ్ చేంజర్ సినిమా విడుదలకి మంచి రోజే అవుతుంది. ఒకవేళ ఈ రెండు తేదీలు కుదరకపోతే మాత్రం ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఇంకా చాలా కాలం ఎదురుచూడాల్సి వస్తుంది.
ఎందుకంటే ఈ చిత్ర సంక్రాంతికి సినిమా విడుదల అయ్యే అవకాశమే లేదు. ఆల్రెడీ.. వెంకటేష్ అనిల్ రావిపూడి సినిమా, రవితేజ భోగవరపు భాను సినిమా, మాత్రమే కాక చిరంజీవి విశ్వంభర సినిమా కూడా సంక్రాంతి బరిలోనే దిగనున్నాయి. కాబట్టి డిసెంబర్ దాటితే.. మాత్రం రామ్ చరణ్ తన గేమ్ చేంజర్ సినిమా అని మళ్ళీ మార్చ్ లో విడుదల చేయాల్సి రావచ్చు. అయితే డిసెంబర్ మిస్ చేసుకుంటే మాత్రం.. మార్చిలో పెద్దగా సెలవులు ఉండవు కాబట్టి.. గేమ్ చేజర్ ఆవరేజ్ టాక్ తెచ్చుకున్న డిజాస్టర్ అవ్వడం ఖాయంలా కనిపిస్తోంది. మరి ఈ సినిమా విడుదల విషయంలో శంకర్ ఏం చేస్తారో వేచి చూడాలి.
మరోవైపు భారతీయుడు 2 సినిమా తర్వాత.. గేమ్ చేంజర్ సినిమా విషయంలో అభిమానులు కూడా.. కంగారు పడుతున్నారు. కాబట్టి ఈ భారతీయుడు 2 ఎఫెక్ట్ మొత్తం పోయేదాకా ఎదురు చూసి సినిమాని విడుదల చేయాలి అంటే.. ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ మార్చ్ కి సినిమా విడుదల అవ్వచ్చు.
Also Read: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..
Also Read: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook