NTR - Sreeleela: తారక్, శ్రీలీల ఫ్యాన్స్ రచ్చ..ఒక్క మాస్ సాంగ్ పడితే ఉంటది భయ్యా!!

దుబాయ్ వేదికగా శుక్రవారం జరిగిన సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ 2023 లో ఉత్తమ నటుడిగా జూనియర్ ఎన్టీఆర్, ఉత్తమ నటిగా శ్రీలీల ఎంపికయిన విషయం తెలిసిందే! అయితే ఈ ఉత్తమ జోడి హీరో-హీరోయిన్లుగా నటిస్తే.. ఇపుడు ఇదే ట్రెండ్ అవుతుంది!  

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 16, 2023, 06:49 PM IST
NTR - Sreeleela: తారక్, శ్రీలీల ఫ్యాన్స్ రచ్చ..ఒక్క మాస్ సాంగ్ పడితే ఉంటది భయ్యా!!

NTR - Sreeleela: దుబాయ్ వేదికగా సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ 2023 ఫంక్షన్ శుక్రవారం రాత్రి అట్టహాసంగా జరిగింది. సైమా అవార్డ్స్ 2023లో ఉత్తమ నటుడిగా జూనియర్ ఎన్టీఆర్, ఉత్తమ నటిగా శ్రీలీల ఎంపికయ్యారు. ఇదే విషయమై ఇప్పుడు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. అవార్డ్స్ తీసుకుంటూ వీరిద్దరూ స్టేజ్ పై మాట్లాడిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఉత్తమ నటుడు, ఉత్తమ నటి కాంబినేషన్ లో (జూనియర్ ఎన్టీఆర్, శ్రీలీల) మూవీ వస్తే సూపర్ హిట్ పక్కా అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' సినిమాలోని కొమురం భీమ్ పాత్రకు గానూ ఉత్తమ నటుడిగా ఎన్టీఆర్ అవార్డును అందుకన్నారు. ఈ సందర్భంగా యంగ్ టైగర్ స్పీచ్ నెట్టింట వైరల్ గా మారింది. తాను కష్టాల్లో ఉన్నప్పుడు.. కింద పడినప్పుడు తనని పట్టుకులేపింది తన అభిమానులే అని ఆయన అన్నారు. తనకు సోదర సమానులైన అభిమానులకు పాదాభివందనం చేస్తున్నా అని తారక్ చెప్పుకొచ్చారు. దీంతో సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ పేరు ట్రెండ్ అవుతోంది. #ManofMasses #NTR #Devara అనే హ్యాష్ ట్యాగ్స్ ట్విట్టర్ ట్ర్రెండింగ్ లో నిలిచాయి. 

మరోవైపు ఉత్తమ నటిగా స్టార్ హీరోయిన్ శ్రీలీల అందుకున్నారు. మాస్ మహారాజ్ రవితేజ హీరోగా తెరకెక్కిన 'ధమాకా' చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటించారు. ఇందులో ఆమె చేసిన అద్భుతమైన నటనకు గానూ ఆమెను ఈ అవార్డు వరించింది. ధమాకా మూవీలో తన డ్యాన్స్ తో కుర్రకారును ఓ ఊపు ఊపేసింది. అయితే ప్రస్తుతం సైమా అవార్డ్స్ ఫంక్షన్ లో పింక్ డ్రస్సులో మెరిసిన ఈ బ్యూటీ క్యూటెస్ట్ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

Also Read: Nipah Virus: నిఫా వైరస్ కరోనా కంటే ప్రమాదకరమా, ఐసీఎంఆర్ ఏమంటోంది.

టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో డ్యాన్స్ విషయానికొస్తే శ్రీలీల తర్వాతే ఎవ్వరైనా అని ఆమె ఫ్యాన్స్ అంటున్నారు. ఒకవేళ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో శ్రీలీల స్టెప్పులేస్తే టాప్ లేచిపోవడం ఖాయమని పోస్టులు పెడుతున్నారు. మాస్ బీట్ డ్యాన్స్ తో ఈ ఇద్దరూ నటీనటులు వెండితెరపై కనిపిస్తే.. చూడ్డానికి రెండు కళ్లు చాలవని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. టాలీవుడ్ లో ప్రస్తుతం బిజీగా ఉన్న శ్రీలీల.. మహేష్ బాబు, పవన్ కల్యాణ్ వంటి స్టార్ హీరోల సరసన నటిస్తోంది.

Also Read: Honda CB200X 2023: మరో హోండా బైక్ రిలీజ్.. రూ.1.47 లక్షలతో సూపర్ స్పోర్ట్స్ మోడల్ బైక్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News