Devara Tickets in BookMyShow: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా.. కొరటాల శివ దర్శకత్వంలో వస్తోన్న సినిమా దేవర. జనతా గ్యారేజ్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ కాంబినేషన్ మరోసారి ఈ చిత్రంతో ప్రేక్షకుల ముందుకి రానుంది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం కావడంతో.. ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. సాధారణంగా రాజమౌళి సినిమా తరువాత.. ఆ హీరోలు చేసే చిత్రాలు తప్పకుండా దిజాస్టర్ అవుతాయి అనే ఒక నమ్మకం తెలుగు ప్రేక్షకుల మదిలో నాటుకుపోయింది. కానీ ఆ నమ్మకాన్ని దేవర చిత్రం వమ్ముచేసేలా ఉంది.
ఈ చిత్రం టికెట్స్ విడుదల దగ్గర నుంచి సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. గత కొద్దిగంటల ముందే హైదరాబాదులోని గచ్చిబౌలిలో వుండే ఏఎంబి సినిమాస్ వారు బుక్ మై షో లో దేవర టికెట్స్ వదిలారు. ఇప్పటివరకు ఏ సినిమాకి జరగనంతగా.. ఈ సినిమా టికెట్లు హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోయాయి. కేవలం రెండంటే రెండు నిమిషాలలో ఏఎంబి సినిమాస్ లో.. అన్ని స్క్రీన్స్ లో వేసిన దేవర సినిమా టికెట్లు.. అమ్ముడు పోవడం సినీ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
దీన్ని బట్టి చూస్తే జూనియర్ ఎన్టీఆర్ పైన అలానే దేవర చిత్రం పైన ప్రేక్షకులకు ఉన్న అంచనాలు ఎటువంటివో అర్ధం అవుతున్నాయి. ఇక ఈ చిత్రంతో శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం కానుంది. ఇప్పటికే పలు హిందీ చిత్రాల్లో నటించిన జాన్వి కపూర్.. దేవర సినిమాతో తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యింది. ఈ సినిమాలో పల్లెటూరు అమ్మాయి పాత్రలో కనిపించనుంది ఈ హీరోయిన్. ఇక జూనియర్ ఎన్టీఆర్ ఈ చిత్రంలో డ్యూయల్ రోల్ చేయనున్నారు. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమాలో..దేవర అనే తండ్రి పాత్రలో అలానే దేవర కొడుకు పాత్రలో కూడా.. జూనియర్ ఎన్టీఆర్ కనిపించనున్నారు.
అంతేకాకుండా బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ చిత్రంలో నెగటివ్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందించగా.. ఇప్పటికే విడుదలైన మూడుపాటలు కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ముఖ్యంగా చట్టమల్లే చుట్టేసావే పాట.. ఇంస్టాగ్రామ్ తో పాటు అన్ని సోషల్ మీడియా మధ్యమాల్లో తెగ ట్రెండ్ అవుతోంది. ఈ క్రమంలో ఈ చిత్రం విడుదలయ్యాక బాక్స్ ఆఫీస్ వద్ద మరిన్ని రికార్డులు బద్దలు కొడుతుందో వేచి చూడాలి.
Read more: Pawan kalyan: విజయవాడ కనక దుర్గమ్మ ఆలయంలో పవన్ కళ్యాణ్ ప్రాయిశ్చిత్త కార్యక్రమం.. వీడియో ఇదే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.