NTR Devara: జూనియర్ ఎన్టీఆర్ కి అదృష్టం.. అల్లు అర్జున్ కి దురదృష్టం.. పూర్తిగా మారిన కథ

Devara Trailer: అసలైతే ఈ ఏడాది.. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా.. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా విడుదల కావాలి. కానీ కొన్ని అనివర్య కారణాలవల్ల.. ఈ సినిమా వాయిదా పడిన సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు.. ఇంచుమించు అటు ఇటుగా.. అదే సమయంలో ఎన్టీఆర్ దేవర విడుదల కి సిద్ధం అయింది. అల్లు అర్జున్ కి దొరకాల్సిన అదృష్టం.. ఇప్పుడు ఎన్టీఆర్ చేతుల్లో పడింది.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jun 21, 2024, 07:00 PM IST
NTR Devara: జూనియర్ ఎన్టీఆర్ కి అదృష్టం.. అల్లు అర్జున్ కి దురదృష్టం.. పూర్తిగా మారిన కథ

Devara Release Date: టాలీవుడ్ లో స్టార్ హీరోల హవా మరొకసారి మొదలైంది. ఒక్కొక్కరిగా స్టార్ హీరోలు అందరూ తమ సినిమాలను.. విడుదలకి సిద్ధం చేస్తున్నారు. జూన్ 27 న ప్రభాస్ కల్కి సినిమా ఎలాగో విడుదల కాబోతోంది. నిజానికి ఈ సినిమా తర్వాత ఆగస్టు 15న అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 విడుదల కావాలి. కానీ ఇంకా షూటింగ్ పూర్తి కాకపోవడంతో.. సినిమా విడుదల వాయిదా పడింది. 

సినిమా వాయిదా పడ్డ వార్త అభిమానులను తీవ్ర నిరాశతో గురిచేసింది. సినిమా చూడటానికి ఇప్పుడు మరొక నాలుగు నెలలు.. ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ ఈ సినిమా వాయిదా పడటం వల్ల చాలా సినిమా విడుదలలు తారుమారయ్యాయి.  
నిజానికి ఆగస్టు 15 క్రేజీ డేట్. ఇప్పుడు దానిని వాడుకోవడానికి రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న డబుల్ ఇస్మార్ట్ కూడా రెడీ అవుతోంది. మరోపక్క ఎన్టీఆర్ తన దేవర సినిమాని సెప్టెంబర్ 27న.. విడుదల చేసేస్తున్నారు. 

జూన్ ఆఖరిలో విడుదలవుతున్న కల్కి గ్రేస్ 10-15 రోజుల తర్వాత తగ్గుతుంది. తర్వాత మొత్తం దృష్టి ఆగస్టులో విడుదల కాబోతున్న పుష్ప 2 మీదనే ఉండేది. మధ్యలో భారతీయుడు 2.. వంటి సినిమా ఉన్నా కూడా తెలుగు ప్రేక్షకులు ఎదురుచూస్తున్నది పుష్ప కోసమే.

కానీ ఇప్పుడు పుష్ప 2 తప్పుకోవడంతో.. అందరి దృష్టి దేవర మీద పడింది. దీంతో దేవర క్రేజ్ బీభత్సంగా పెరిగిపోయింది. విడుదలయ్యే.. సమయానికి సినిమాపై క్రేజ్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక పెద్ద సినిమాల మధ్య ఉన్న గ్యాప్ వల్ల.. తప్పకుండా ఈ చిత్రానికి అదిరిపోయే ఓపెనింగ్స్ లభిస్తాయి. ఇది నమ్మకం రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా 120 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్.. నమోదు చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా సినిమా 200 కోట్లు దాకా బిజినెస్ చేసింది. 

విడుదలకి ముందు నుంచే దేవర.. మీద క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. రెండు భాగాలుగా విడుదల కాబోతున్న దేవర మొదటి భాగం.. ఈ క్రేజ్ ని వాడుకొని హిట్ అయితే రెండవ భాగం మీద కూడా అంచనాలు భారీగా పెరుగుతాయి.

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.

Read more: Viral News in Telugu: కొంపముంచిన రీల్.. 300 అడుగుల లోతైన లోయలో పడిపోయిన కారు.. షాకింగ్ వీడియో

Read more: Viral video: అట్లుంటదీ మల్ల.. నరసింహ మూవీ స్టైల్ లో పాముకు కిస్ ఇచ్చిన తాత.. వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News