NTR 30 Shooting Update: ఆర్ఆర్ఆర్ సినిమా సూపర్ హిట్ గా నిలిచిన తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తాడని అందరూ అనుకున్నారు. కానీ త్రివిక్రమ్ మహేష్ బాబుతో సినిమా చేస్తూ ఉండడంతో ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. ఎన్టీఆర్ కెరియర్లో 30వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాని ప్రస్తుతానికి ఎన్టీఆర్ 30 అనే సంభోదిస్తున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్డేట్ ప్రేక్షకుల ముందుకు రావడం లేదు.
ఎప్పటికప్పుడు ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ వస్తుందని ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ గురించి ఆసక్తికర లీక్స్ అయితే టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నాయి. అదేమిటంటే ఫిబ్రవరి నెల నుంచి ఒక చిన్న షెడ్యూల్ షూటింగ్ ప్రారంభించే అవకాశం ఉందని అంటున్నారు. ఒకవేళ అది కుదరకపోతే మార్చి నుంచి ఒక పెద్ద షెడ్యూల్ షూటింగ్ ప్రారంభమవుతుందని, ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి శంషాబాద్ దగ్గరలో చోట సెట్ వర్క్ జరుగుతోందని తెలుస్తోంది.
హైదరాబాదులోని శంషాబాద్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత గోవాలో ఒక లాంగ్ షెడ్యూల్ ఉండబోతుందని ఆ తర్వాత హైదరాబాద్ లో మరొక షెడ్యూల్ కూడా ప్లాన్ చేశారని అంటున్నారు. ఒకరకంగా కొరటాల శివ మునుపెన్నడూ లేని విధంగా ఈ సినిమాను తెరకెక్కించే అవకాశం ఉందని అంటున్నారు. వాస్తవానికి రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ఎలాంటి హీరో కైనా ఒక భారీ డిజాస్టర్ ఖాయం. కానీ ఈసారి జూనియర్ ఎన్టీఆర్ ఎలా అయినా మంచి హిట్టు అందుకోవాలని అనేకసార్లు ఈ స్క్రిప్ట్ విషయంలో మార్పులు చేర్పులు చేయిస్తున్నారు.
కొరటాల శివ కూడా ఆచార్య సినిమాతో భారీ డిజాస్టర్ అందుకున్న నేపథ్యంలో ఇప్పుడు మరోసారి హిట్ కొట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాక ఈ సినిమా సొంత ప్రొడక్షన్ కావడంతో కాస్త లేట్ అయినా సరే మంచి సినిమాతో వచ్చి హిట్ కొట్టాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ మీద కళ్యాణ్ రామ్, యువ సుధా ఆర్ట్స్ బ్యానర్ మీద మిక్కిలినేని సుధాకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రకటించిన నటించే సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
Also Read: Ram Charan Multistarrer: సీతారామం డైరెక్టర్ కొత్త సినిమాలో రామ్ చరణ్.. ఆ హీరోతో కలిసి సందడి!
Also Read: Taraka Ratna CT Scan Reports:తారక రత్న సీటీ స్కాన్ రిపోర్టులో కీలక విషయాలు..బ్రెయిన్ కు ఎఫెక్ట్?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook