Nikhil TDP Twist: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి తెలుగు సినీ నటుడు నిఖిల్ సిద్ధార్థ్ అడుగుపెట్టాడనే వార్త కలకలం రేపింది. తెలుగుదేశం పార్టీలో చేరాడనే వార్త తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సమక్షంలో నిఖిల్ పార్టీలో చేరారనే వార్త గుప్పుమంది. ఈ ప్రచారం జరిగిన కొన్ని నిమిషాల్లోనే వెంటనే నిఖిల్ స్పందించాడు. 'నేను పార్టీలో చేరలేదు' అనే స్పష్టత ఇచ్చాడు.
Also Read: Nikhil Siddhartha TDP: హీరో నిఖిల్ సిద్ధార్థ్ సంచలనం.. అనూహ్యంగా టీడీపీలో చేరిక
నిఖిల్ మామయ్య ఎంఎం కొండయ్య యాదవ్‌కు టీడీపీ చీరాల అసెంబ్లీ టికెట్ లభించింది. ఈ సందర్భంగా కుటుంబసభ్యుడిగా నిఖిల్ టీడీపీకి కృతజ్ఞతలు తెలిపిందేకు లోకేశ్‌ను కలిశాడు. దీనికి సంబంధిచిన విషయాన్ని నిఖిల్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. ఈ సందర్భంగా లోకేశ్‌తో దిగిన ఫొటోలను కూడా పంచుకున్నాడు. వీటిని చూసిన వారంతా నిఖిల్ టీడీపీలో చేరాడని భావించారు. ప్రధాన మీడియా సైతం నిఖిల్ టీడీపీలో చేరాడనే వార్తలు ప్రచురించాయి. ఈ ప్రచారం జరగడంతో వెంటనే నిఖిల్ స్పష్టత ఇచ్చాడు. తన టీమ్ ద్వారా నిఖిల్ కీలక ప్రకటన చేశారు.
Also Read: KTR Fire: కేకే, కడియం వంటి వాళ్లు మళ్లీ వచ్చి కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి రానివ్వం: కేటీఆర్
'టీడీపీలో నిఖిల్ చేరలేదు. టీడీపీ చీరాల టికెట్ తన మామయ్య ఎంఎం కొండయ్య యాదవ్‌కు కృతజ్ఞతలు తెలిపేందుకు మాత్రమే నారా లోకేశ్‌ను కలిశారు. పేదలకు సేవ చేసే భాగ్యం కల్పించిన లోకేశ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అంతే. నిఖిల్ ఏ పార్టీలో చేరలేదు' అని అతడి బృందం ప్రకటించింది.
ఈ ప్రకటనకు ముందు నిఖిల్ చేసిన ట్వీట్ ఇలా ఉంది.
'టీడీపీ చీరాల టికెట్ పొందిన మా మామయ్య ఎంఎం కొండయ్య యాదవ్‌కు శుభాకాంక్షలు. ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించిన నారా లోకేశ్‌కు కృతజ్ఞతలు. మీ అందరి ఆశీర్వాదం, మద్దతు కావాలి' అని నిఖిల్ సిద్ధార్త్ ట్వీట్ చేశాడు.
నిఖిల్ సినిమాలతో బిజీ
ప్రస్తుతం నిఖిల్ సిద్ధార్థ్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. గతేడాది 'స్పై'తో ప్రేక్షకుల ముందకు రాగా నిరాశపర్చింది. ప్రస్తుతం భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో సంయుక్త మీనన్ జోడీగా నిఖిల్ 'స్వయంభు' సినిమా చేస్తుండగా.. చందు మొండేటి దర్శకత్వంలో 'కార్తీకేయ 3' కూడా చేస్తున్నాడు. వ్యక్తిగత జీవితంలో కొన్ని రోజుల కిందట నిఖిల్ తండ్రైన విషయం కూడా తెలిసిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook