18 Pages Movie Review : 18 పేజెస్ రివ్యూ.. ప్రతీ పేజీ ప్రేమతో నిండింది

18 Pages Movie Review నిఖిల్ హీరోగా, అనుపమ హీరోయిన్‌గా నటించిన 18 పేజెస్ సినిమా ఇప్పుడు థియేటర్లోకి వచ్చింది. సుకుమార్ అందించిన కథ, అతని శిష్యుడి దర్శకత్వంలో సినిమా రావడంతో అంచనాలు పెరిగాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 23, 2022, 02:41 PM IST
  • నేడే థియేటర్లోకి వచ్చిన 18 పేజీలు
  • అదరగొట్టేసిన అనుపమ పరమేశ్వరణ్
  • నిఖిల్‌కు మరో హిట్ పడ్డట్టే
18 Pages Movie Review : 18 పేజెస్ రివ్యూ.. ప్రతీ పేజీ ప్రేమతో నిండింది

18 Pages Movie Review సుకుమార్ కథలు ఎలా ఉంటాయ్.. ఎంత లాజిక్‌గా ఉంటాయ్.. ఎంత డెప్త్‌గా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఈ సారి కూడా సుకుమార్ అలాంటి ఓ కథను అందించాడు. ఇక సుకుమార్ శిష్యుడు సూర్య ప్రతాప్ పల్నాటి తెరకెక్కించాడు. ఇక ఇప్పుడు కార్తికేయ 2 సినిమాతో మంచి ఫాంలో ఉన్న నిఖిల్.. ఇప్పుడు 18 Pages సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా కథ, కథనాలు ఎలా ఉన్నాయో ఓ సారి చూద్దాం.

కథ
సిద్ధు(నిఖిల్) సాఫ్ట్ వేర్ ఉద్యోగి. ప్రీతి అనే అమ్మాయిని ప్రేమించి మోసపోతాడు. అలాంటి సమయంలో నందిని (అనుపమ) రాసిన డైరీ దొరుకుతుంది. ఆ డైరీలో నందిని రాసుకున్న వాటిని చదివి సిద్ధు ప్రేమలో పడతాడు. ఆమె జీవనశైలిలో సిద్దు బతికేందుకు ప్రయతిస్తాడు. అయితే సనాతన ట్రస్ట్ కి చెందిన రంగనాథ్ అనే వ్యక్తిని కలిసి కవర్ ఇచ్చేందుకు నందిని హైద్రాబాద్‌కు వస్తుంది. ఇక హైద్రాబాద్‌లో జరిగిన విషయాలను నందిని డైరీలో రాసుకుంటుంది. ఆ డైరీనే సిద్దుకి దొరకుతుంది. ఆ డైరీలో ఉన్న విషయాలు ఏంటి? నందిని చుట్టూ ఓ గ్యాంగ్ ఎందుకు తిరుగుతుంది? అసలు ఆ కవర్‌లో ఏముంది? సిద్దు, నందిని అసలు ఎలా కలుస్తారు? నందిని కోసం సిద్దు చేసిన పనులేంటి? అనేది కథ.

నటీనటులు
సిద్దు పాత్రలో నిఖిల్ అద్భుతంగా నటించేశాడు. హీరోయిజం, మాస్ ఎలివేషన్లు అంటూ రొటీన్ పోకడలేని సీన్లలో చక్కగా నటించాడు. ఎమోషనల్‌గా సిద్దు పాత్రలో నిఖిల్ చక్కగా నటించేశాడు. ఫైట్స్‌లోనూ ఎమోషన్స్ చూపించాడు. ఇక అనుపమ అయితే కొత్తగా కనిపిస్తుంది. ఆమె పాత్రలోని అమాయకత్వం, ప్రేమను తన మొహంలోనే చూపించింది అనుపమ. ఇక సరయు అయితే భాగీ పాత్రలో ఎండ్ వరకు కనిపిస్తుంది. సరయుకు మంచి పాత్ర పడింది. అజయ్, శత్రు, పోసానీ ఇలా అందరూ తమ తమ పాత్రలకు తగ్గట్టుగా నటించేశారు.

విశ్లేషణ
ఏ సినిమా అయినా కూడా ప్రేమ కథ ఉండాల్సిందే. ప్రేమలేని, చూపించని సినిమాలు దాదాపు ఉండవు. ఎంత యాక్షన్ సినిమాలైనా, ఎంత కమర్షియల్ సినిమాలైనా ఏవైనా సరే అందులో ప్రేమ కథ ఉండాల్సిందే. ఇప్పటికే మనం ఎన్నో ప్రేమ కథల్ని చూశాం. చూస్తున్నాం. ఇంకా చూస్తాం. ప్రేమ కథ అనగానే.. హీరో, హీరోయిన్లు కలిసి పాటలు పాడుకోవడం, రొమాన్స్ చేసుకోవడం, కొన్నిసార్లు విచ్చలవిడి శృంగారం కూడా ఉండాల్సిందే. ఇలాంటి ప్రేమ కథలను సినిమాల్లో చాలానే చూసేసి ఉన్నాం.

కానీ 18 Pages సినిమాలో మాత్రం కొత్త కథను చూస్తాం. హీరో, హీరోయిన్లు చివరి సీన్ వరకు అస్సలు కలుసుకోరు. కలుసుకున్నా కూడా వారిద్దరి మధ్య మాటలు అసలే ఉండవు. అలాంటి సీన్ తీయడం, రాయడం, అసలు అలా ఊహించుకోవడం కూడా చాలా కష్టమే. కానీ కథను రాసింది సుకుమార్ కాబట్టి, తీసింది ఆయన శిష్యుడు సూర్య ప్రతాప్ కాబట్టి అది సాధమ్యైనట్టుగా కనిపిస్తుంది. అచ్చమైన, స్వచ్చమైన ప్రేమకు అర్థం చెప్పేలా 18 Pages సినిమా ఉన్నట్టుగా అనిపిస్తుంది.

క్లైమాక్స్ సీన్‌లో ట్రైన్‌లో హీరో హీరోయిన్లు ఇద్దరూ కలుసుకునే సీన్, అందులో ఇద్దరూ ఒకరినొకరు పరిచయం చేసుకునే సీన్‌ను మాటలు లేకుండా.. అద్భుతంగా రాసుకున్నాడు దర్శకుడు. ప్రేమను వ్యక్త పరిచేందుకు మాటలు అవసరం లేదు అన్నట్టుగా ఆ సీన్ ఉంటుంది.

ప్రేమించడానికి కారణాలు అవసరం లేదు.. కానీ ఒక మంచి కారణం వల్ల పుట్టిన గొప్ప ప్రేమను ఎలా కాదనగలం అనే డైలాగ్‌తో సినిమాను ముగించేస్తారు. ఇలా ఈ సినిమాలో ఎన్నో డైలాగ్స్ మనసును తాకుతాయి. ఇక ఈ సినిమాలో గోపీ సుందర్ ఇచ్చిన పాటలు వినసొంపుగా ఉంటాయి. ఆర్ఆర్ మాత్రం గుండెను హత్తుకునేలా ఉంటుంది. లాజిక్‌లు వెతికితే ఈ సినిమాలోని మ్యాజిక్ మిస్ అవుతాం. ఇలాంటి సాఫ్ట్ క్లైమాక్స్, కొత్త క్లైమాక్స్ ఇది వరకు చూసి ఉండరేమో.

రేటింగ్ : 3

బాటమ్ లైన్‌ : 18 పేజెస్.. ప్రతీ పేజీ ఫ్రెష్‌గా, కొత్తగా అనిపిస్తుంది

Also Read : ఎన్టీఆర్‌ గారితో ఆయనకున్న అనుబంధం వేరే.. కైకాల సత్యనారాయణ మరణంపై బాలకృష్ణ, చంద్రబాబు ఎమోషనల్!  

Also Read : Kaikala Satyanarayana Death: పాత్రలకు ప్రాణం పోసిన విలక్షణ నటుడు.. కైకాల సత్యనారాయణ తొలి, చివరి సినిమాలు ఇవే!  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News