18 Pages - Dhamaka: సీనియర్ రవితేజతో జూనియర్ రవితేజ పోటీ.. రచ్చ మామూలుగా లేదుగా!

Nikhil Siddarth 18 Pages and Raviteja Dhamaka Releasing on Same Date: ఒకేరోజు రవితేజ, నిఖిల్ సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతూ ఉండడం హాట్ టాపిక్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే

Written by - Chaganti Bhargav | Last Updated : Oct 25, 2022, 05:06 PM IST
18 Pages - Dhamaka: సీనియర్ రవితేజతో జూనియర్ రవితేజ పోటీ.. రచ్చ మామూలుగా లేదుగా!

Nikhil Siddarth 18 Pages Raviteja Dhamaka to Release on December 23rd: అదేమిటి సీనియర్ రవితేజతో జూనియర్ రవితేజ పోటీ పడటం ఏమిటి అనుకుంటున్నారా? అవును నిజమే. హీరో నిఖిల్ ని కెరీర్ మొదట్లో జూనియర్ రవితేజ అని పిలిచేవారు. నిఖిల్ యాక్టింగ్ అంతా రవితేజను పోలి ఉండటంతో రవితేజను ఆయన అనుకరిస్తున్నారు అంటూ పెద్ద ఎత్తున కామెంట్స్ వినిపించేవి. తర్వాత కాలంలో తనకంటూ నటనలో నిఖిల్ ప్రత్యేకమైన శైలి ఏర్పరచు కోవడంతో ఇప్పుడు వరుస హిట్లు కొడుతున్నారు.

అసలు విషయం ఏమిటంటే నిఖిల్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా 18 పేజెస్ అనే సినిమా రూపొందుతోంది. కుమారి 21ఎఫ్ సినిమా డైరెక్టర్ సూర్య ప్రతాప్ పల్నాటి డైరెక్షన్ లో ఈ సినిమా రూపంలో ఉంది గీత ఆర్ట్స్ బ్యానర్ 2, అలాగే సుకుమార్ కు చెందిన సుకుమార్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ల మీద ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ల కోసం ఇప్పటిదాకా వెంపర్లాడగా ఎట్టకేలకు డిసెంబర్ 23వ తేదీన విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే రవితేజ, త్రినాధ రావు నక్కిన డైరెక్షన్ లో చేసిన ధమాకా అనే సినిమాను కూడా డిసెంబర్ 23వ తేదీన విడుదల చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు ప్రకటన వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ రెండు సినిమాలు పోటాపోటీగా విడుదల కాబోతున్నాయి. మరో విషయం ఏమిటంటే రాఘవ లారెన్స్ కీలక పాత్రలో నటిస్తున్న రుద్రుడు అనే సినిమా కూడా అదే రోజున విడుదల కాబోతోంది.

ఈ రెండు సినిమాలతోనే బాక్స్ ఆఫీస్ వద్ద సందడి వాతావరణం ఎలా ఉంటుంది అనుకుంటే, ఇప్పుడు రుద్రుడు సినిమా కూడా విడుదల కాబోతూ ఉండడం ఆసక్తి రేపిస్తోంది. మరి ఈ వీటిలో ఏదైనా సినిమా వెనక్కి వెళ్తుందా? లేదా మొన్న దీపావళి సందర్భంగా విడుదలైనట్లుగానే ఈసారి కూడా మూడు సినిమాలు విడుదల చేస్తారా అనేది చూడాల్సి ఉంది. ఇక డిసెంబర్ 25వ తేదీ క్రిస్మస్ సందర్భంగా ఎన్ని సినిమాలు విడుదల చేసినా ఇబ్బంది లేదని మేకర్స్ భావిస్తున్నారు మరి చూడాలి ఏం జరగబోతోంది అనేది.

Also Read: Krithy Shetty Saree Photos: చీరకట్టులో కృతి శెట్టి క్యూట్ ఫోటోలు.. కవ్వించి చంపేస్తోందిగా!

Also Read: Jabardasth Bhavani Naidu Hot: జబర్దస్త్ లో కనిపించే ఈ అమ్మాయిని ఇంత హాట్ గా ఎప్పుడైనా చూశారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News