18 Pages Movie: షూటింగ్ మొదలుపెట్టిన క్రేజీ జోడీ

18 pages movie shooting Begins  | పెళ్లి తర్వాత టాలీవుడ్ నటుడు నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న సినిమా ‘18 పేజీస్‌’.  ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్‌ హైదరాబాద్‌లో మంగళవారం ప్రారంభమైంది.

Last Updated : Oct 21, 2020, 11:56 AM IST
  • విభిన్న కథాంశాలతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు నిఖిల్‌
  • ‘అర్జున్‌ సురవరం’ తర్వాత నిఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ‘18 పేజీస్‌’
  • నిఖిల్‌కు జోడీగా కనిపించనున్న కేరళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్
18 Pages Movie: షూటింగ్ మొదలుపెట్టిన క్రేజీ జోడీ

విభిన్న కథాంశాలతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు నిఖిల్‌ సిద్ధార్థ్. పెళ్లి తర్వాత నిఖిల్ నటిస్తున్న సినిమా ‘18 పేజీస్‌’. ఈ మూవీ షూటింగ్‌ హైదరాబాద్‌లో మంగళవారం ప్రారంభమైంది. ‘అర్జున్‌ సురవరం’ తర్వాత నిఖిల్ తాజా చిత్రం ‘18 పేజీస్‌’లో క్రేజీ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ జత కట్టారు. దీంతో టాలీవుడ్‌లో మరో కొత్త జోడీని తెరమీద చూడబోతున్నామని ప్రేక్షకులు భావిస్తున్నారు. టైటిల్ సైతం విభిన్నంగా ఉండటంతో అంచనాలు పెరుగుతున్నాయి.

 

నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ నటించనున్నారని ఇటీవల ప్రచారం జరిగింది. తాజాగా సినిమా షూటింగ్ మొదలు కావడంతో ఆ ప్రచారం నిజమని తేలింది. డైరెక్టర్‌ సుకుమార్‌ కథ, స్క్రీన్‌ప్లే అందించిన ‘18 పేజీస్‌’ సినిమాను దర్శకుడు పల్నాటి సూర్యప్రతాప్‌ తెరకెక్కిస్తున్నాడు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ సమర్పణలో ‘బన్నీ’వాసు ఈ మూవీ నిర్మిస్తున్నారు. గోపీసుందర్ స్వరాలు సమకూర్చనున్నారు.

 

ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుపుతున్నట్లు సినిమా యూనిట్ తెలిపింది. హీరో నిఖిల్, కేరళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ మధ్య జరిగే సన్నివేశాలు సినిమాకు ప్లస్ పాయింట్ అవుతాయని, ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని ‘18 పేజీస్‌’ దర్శకుడు పల్నాటి సూర్యపత్రాప్ పేర్కొన్నారు. కాగా, ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలు పూర్తయ్యాక నటుడు నిఖిల్ మెగాఫోన్ సైతం పట్టనున్న విషయం తెలిసిందే.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News