Nidhhi Agerwal Photos: బ్లాక్ శారీలో చందమామలా మెరిసిపోతున్న అందాల నిధి- ఫొటోలు వైరల్

Nidhhi Agerwal Photos: ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగ‌ర్వాల్ త‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన లేటెస్ట్ ఫొటోలు చాలా గ్లామ‌ర్‌గా ఉన్నాయి. బ్లాక్ శారీలో ఎంతో గ్లామ‌ర‌స్‌గా ఉన్న నిధి అగ‌ర్వాల్ ఫొటోలు ఇప్పుడు నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం ఆ పిక్స్ మీరే చూసేయండి.    

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 7, 2022, 02:17 PM IST
Nidhhi Agerwal Photos: బ్లాక్ శారీలో చందమామలా మెరిసిపోతున్న అందాల నిధి- ఫొటోలు వైరల్

Nidhhi Agerwal Photos: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం పూజా హెగ్డే, రష్మిక మందన్న వంటి గ్లామరస్ బ్యూటీలు స్టార్ హీరోలతో ఎక్కువగా అవకాశాలు అందుకుంటున్నారు. ప్రస్తుతం వీరే భారీ స్థాయిలో పారితోషికం కూడా అందుకుంటున్నట్లు తెలుస్తోంది. 

ఇక వీరికి పోటీ ఇచ్చే విధంగా నిధి అగర్వాల్ కూడా గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. కానీ ఈ బ్యూటీ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను చూడలేకపోతోంది. అయితే గ్లామర్ తో మాత్రం ఎప్పటికప్పుడు తన రేంజ్ ను పెంచుకుంటూ ఉంది. ఇటీవల చీరలో ఆమె ఇచ్చిన స్టిల్స్ చూస్తే ఎవరైనా సరే షాకవ్వాల్సిందే.

బాలీవుడ్ అరంగేట్రం

నిధి అగర్వాల్ మొదట బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోనే అవకాశాలు అందుకోవడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేసింది. ముంబయి మోడలింగ్ ప్రపంచంలో ఈ బ్యూటీకి మంచి క్రేజ్ కూడా వచ్చింది. అందుకే మొదట బాలీవుడ్ ఇండస్ట్రీ లోనే ఒక మంచి అవకాశం కూడా అందుకుంది. యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్ తో ఆమె చేసిన మున్నా మైకేల్ సినిమాలో ఛాన్స్ అందుకుంది.

బాలీవుడ్ లో మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ అందుకున్న నిధి అగర్వాల్ అవకాశాలను మాత్రం పెద్దగా అందుకోలేకపోయింది. ఆ సినిమా తర్వాత నిధి అగర్వాల్ కోసం కొన్ని మూవీ అవకాశాలు వచ్చాయి. కానీ ఈ బ్యూటీ రిజెక్ట్ చేసినట్లుగా తెలిపింది. ఇక ప్రస్తుతం నిధి అగర్వాల్ తన ఫోకస్ మొత్తం టాలీవుడ్ ఇండస్ట్రీ పైన పెట్టింది. ఇక్కడే మంచి అవకాశాలు అందుకుని తన స్థాయిని పెంచుకోవాలని చూస్తోంది.

నిధి అగర్వాల్ కథానాయికగా నటించిన 'హీరో' సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవలే జరిగింది. ఇందులో నిధి అగర్వాల్ కనిపించిన విధానం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. గతంలో చాలా సార్లు నిధి అగర్వాల్ గ్లామరస్ లుక్ తో కనిపించింది. కానీ ఈసారి చీరలోనే అమ్మడు అందాల ఆరబోతతో కనువిందు చేసింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  

Also Read: Thaman Corona Positive: టాలీవుడ్ లో కరోనా కలవరం.. తమన్ కు కొవిడ్ పాజిటివ్

Also Read: Saami Saami Video Song: పుష్ప మూవీ నుంచి మరో సర్ ప్రైజ్.. సామి సామి వీడియో సాంగ్ రిలీజ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News