Premalu: ఇప్పటికే పలు మలయాళం సినిమాలు కేరళ లో మాత్రమే కాక తెలుగు రాష్ట్రాల్లో కూడా తమ హవా చూపిస్తున్నాయి. ఈ ఏడాది ఇంకా ఆరు నెలలు కూడా గడవలేదు కానీ ఇప్పటికే కొన్ని మలయాళం సినిమాలు తెలుగులో కూడా డబ్ అయ్యి మంచి విజయాన్ని అందుకున్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ప్రేమలు సినిమా. మలయాళం లో బ్లాక్ బస్టర్ అయిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ సినిమా భారీ అంచనాల మధ్య తెలుగులో కూడా విడుదల అయ్యి మంచి కలెక్షన్లు అందుకుంది. మరోవైపు ఫాహద్ ఫాసిల్ హీరోగా నటించిన ఆవేశం సినిమా కూడా తెలుగు రాష్ట్రాల్లో బాగానే హడావిడి చేసింది.
కానీ గత కొద్ది రోజులుగా కొందరు టాలీవుడ్ ప్రేక్షకులు మాత్రం.. 100 కోట్లకు పైగా కలెక్షన్లు నమోదు చేసుకున్న ఈ రెండు సినిమాలలో ఆ రెంజ్ కంటెంట్ లేదు అని చెబుతూనే వస్తున్నారు. ఇవి బాగా ఓవర్ రేటెడ్ సినిమాలు అని, వాటికి ఈ రేంజ్ హైప్ అయితే అక్కర్లేదు అని కామెంట్లు పెడుతూనే వచ్చారు.
ఇక ఈ రెండు సినిమాలు ఈ మధ్యనే ఓటీటీలలో కూడా విడుదల అవ్వడంతో సినిమాల గురించి టాక్ బాగా ఎక్కువైంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలని ఓటీటీలో చూసిన ప్రేక్షకులు.. నిజంగానే అసలు ఈ రెండు సినిమాలలో ఏముంది అంటూ తెగ ఫీల్ అవుతున్నారు.
ముఖ్యంగా ప్రేమలు సినిమాలో సిల్లీ కామెడీ చాలా సినిమాలలో చూసేసాం అని, ఇక ఆవేశం లో ఫాఫా చేసిన కామెడీ డాన్ పాత్ర కూడా పలు తెలుగు సినిమాల్లో చూసినవే అనేది వాదన. ఇక ఈ రెండు సినిమాలలో కథ, స్క్రీన్ ప్లే స్ట్రాంగ్ గా లేవు అని, స్టొరీ టెల్లింగ్ కూడా యావరేజ్ అని వఅంటున్నారు. ఇక ఈ రెండు సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషించిన వారు బాగానే నటించినా మిగతా వారు అంతగా మెప్పించనేలేదు అని టాక్ కూడా వినిపిస్తోంది. ఏదేమైనా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ స్థాయిలో కలెక్షన్లు అందుకుని బయట మాత్రం మిక్స్డ్ టాక్ రావడంతో.. ఈ రెండు చిత్రాలు కూడా థియేటర్స్ లో బ్లాక్ బస్టర్స్ గా.. ఓటీటీలో డిజాస్టర్స్ గా మిగిలాయి.
Also read: Black Tea with Lemon: లెమన్ బ్లాక్ టీ ఆరోగ్యానికి మంచిది కాదా, కిడ్నీల్ని పాడు చేస్తుందా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook