Indrani Mukerjea Story OTT: రీసెంట్ గా నెట్‌ఫ్లిక్స్ ప్లాట్ ఫామ్ లో కర్రీ అండ్ సైనైడ్-ది జాలీ జోసెఫ్ కేస్ అంటూ ఓ డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ అయింది. అంచనాలను మించి ఈ చిత్రం ఓ రేంజ్ సంచలనాన్ని సృష్టించింది. ఒక ఇంటిలో ఎంతో పద్ధతిగా ఉండే ఒక కోడలు.. ఆస్తి, అధికారం తన చేతికి రావాలి అనే తపనతో ఎంతకు తెగిస్తుందో కళ్ళకు కట్టినట్టు ఈ డాక్యుమెంటరీలో చూపించారు. కేరళలో జరిగిన ఒక యదార్థ సంఘటనతో ఈ డాక్యుమెంటరీని తెరకెక్కించారు. జాలీ జోసెఫ్ అని ఒక వ్యక్తి తన కుటుంబ సభ్యులను ,బంధువులను తన జీవితానికి అడ్డు వస్తున్నారు అన్న ఒకే ఒక కారణంతో సైనైడ్ ఇచ్చి మరీ హత్య చేస్తుంది.
ఆ తరువాత ఈ హత్యను కప్పిపుచ్చడానికి తిరిగి హత్యల పరంపర కొనసాగిస్తుంది. అలా అనుకోకుండా ఆమెకు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు వస్తాయి. తర్వాత ఆమెను పోలీసులు అదుపులోకి కూడా తీసుకున్నారు. ఈ డాక్యుమెంటరీ కొన్ని వారాలపాటు నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ ట్రెండింగ్ లిస్టులో ఉంది. ఇప్పుడు ఇదే టైప్ లో విడుదలైన మరొక క్రైమ్ డాక్యుమెంటరీ నెట్‌ఫ్లిక్స్‌లో సంచలనం సృష్టిస్తోంది. అదే..ది ఇంద్రాణి ముఖర్జియా స్టోరీ-బరీడ్ ట్రూత్. క్యాప్షన్ లోనే దాచిపెట్టిన నిజం అంటూ ఓ ట్విస్ట్ ఇచ్చారు. కథలో అంతకుమించిన ట్విస్ట్ లు ఎన్నో ఉన్నాయి.
సస్పెన్స్ తో పాటు ఆకట్టుకునే కథ.. అద్భుతమైన స్క్రీన్ ప్లే ఉండడంతో ఈ చిత్రం అన్ని భాషలలో టాప్ 10 ట్రెండింగ్ లిస్టులో కొనసాగుతోంది. అనేక వివాదాల మధ్య ఈ డాక్యుమెంటరీ విడుదల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది. అయితే అన్ని అడ్డంకులను దాటుకుంటూ ఫైనల్ గా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ డాక్యుమెంటరీ రికార్డ్ స్థాయి వ్యూస్ దక్కించుకుంది. అవతార్ లాంటి హాలీవుడ్ సెన్సేషనల్ సినిమాల వ్యూస్ ని కూడా ఈ డాక్యుమెంటరీ కొద్ది రోజుల్లోనే దాటేయడం విశేషం.
పెళ్లి చేసుకున్నాక కొన్ని కారణాలవల్ల భర్త నుంచి విడిపోయి తిరిగి పెళ్లి చేసుకున్న ఇంద్రాణి.. రెండవ భర్తని కూడా విడిచిపెట్టి మూడవ పెళ్లి చేసుకుంటుంది. అయితే ఆమె మొదటి భర్త కూతురు .. మూడవ భర్త కొడుకుతో ప్రేమలో పడుతుంది. ఈ విషయంపై పలు రకాల గొడవలు తలెత్తడంతో.. ఏం చేయాలో తెలియక కూతుర్ని చంపేసింది ఇంద్రాణి. ఆ తర్వాత అసలు విషయం డ్రైవర్ ద్వారా బయటపడుతుంది. కుటుంబ సంబంధ బాంధవ్యాలు.. హత్యకు దారి తీసిన కారణాలు అప్పట్లో పెద్ద చర్చనీయాంసంగా మారాయి. ఆ కథను బేస్ చేసుకుని ఈ డాక్యుమెంటరీని తెరకెక్కించారు.
Also read: Siddham Meeting: మీరు కృష్ణుడు.. నేను అర్జునుడిని.. కురుక్షేత్రానికి సిద్ధమా?: వైఎస్ జగన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook