Nee Dhaarey Nee Katha:ప్యాన్ ఇండియా టెక్నిషియన్స్‌తో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వస్తోన్న'నీదారే నీ కథ' మూవీ.. ఆకట్టుకుంటున్న టీజర్..

Nee Dhaarey Nee Katha: ప్ర‌స్తుతం తెలుగులో డిఫ‌రెంట్ కాన్సెప్ట్ చిత్రాలు వ‌స్తున్నాయి. అందులో భాగంగా వ‌స్తోన్న మ‌రో వెరైటీ మూవీ 'నీ దారే నీ క‌థ‌'. తాజాగా ఈ సినిమా టీజర్ లాంఛ్ ఈవెంట్ ఘనంగా జరిగింది.

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 21, 2024, 08:08 AM IST
Nee Dhaarey Nee Katha:ప్యాన్ ఇండియా టెక్నిషియన్స్‌తో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వస్తోన్న'నీదారే నీ కథ' మూవీ.. ఆకట్టుకుంటున్న టీజర్..

Nee Dhaarey Nee Katha: జె.వి.ప్రొడక్షన్స్ బ్యానర్ పై వంశీ జొన్నలగడ్డ దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తోన్న చిత్రం 'నీ దారే నీ కథ'. తేజేష్ వీర, శైలజ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రియతమ్, అంజన, విజయ్, అనంత్, వేద్ లీడ్ రోల్లో యాక్ట్ చేసారు. తాజాగా ఈ సినిమా టీజర్ లాంఛ్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ టీజర్‌ లాంఛ్ తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోషియేషన్ ప్రెసిడెంట్ లక్ష్మీ నారాయణ, సీనియర్ జర్నలిస్ట్ ప్రభు, క్రిటిక్స్ అసోషియేషన్ ప్రెసిడెంట్ సురేష్ చేతుల మీదుగా గ్రాండ్‌గా జరిగింది. మొత్తం కొత్త టీం మెంబర్స్‌తో  ఈ ఈ వేడుకను ఎంతో ఇన్నోవేటివ్ గా చేశారు. మ్యూజిక్ బ్యాక్ డ్రాప్ తో మొత్తం కొత్త వాళ్ళతో ఈ సినిమా యూత్‌ను ఆకట్టుకునే విధంగా ఉండబోతోంది.

ఈ సందర్భంగా నిర్మాత తేజేష్ మాట్లాడుతూ : సినీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ముగ్గురు కొత్తవాళ్లం అందరూ కొత్త టీమ్‌తోనే ఈ సినిమాను నిర్మిస్తున్నాము. మొదటి సినిమా అయినా.. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా కొత్తగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాము. మా నుంచి వచ్చే తర్వాత సినిమాలు కూడా అంతే కొత్తగా ఉంటాయనే నమ్మకం వ్యక్తం చేశౄరు.. మాకు బ్యాక్ బోన్ సపోర్ట్ ఏమీ లేదు. మీ మీడియానే మాకు పెద్ద సపోర్ట్. మాకు మొదటి సినిమా అయినా ఇంత సపోర్ట్ చేస్తున్నా ప్రింట్ మరియు టెలివిజన్ మీడియాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.  అదేవిధంగా మమ్మల్ని సపోర్ట్ చేసి ఈ టీజర్ లాంచ్ ఈవెంట్ కు వచ్చిన తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణకి మరియు క్రిటిక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సురేష్‌కి మరియు సీనియర్ జర్నలిస్ట్ ప్రభు కి ప్రత్యేక కృతజ్ఞతలు.

నిర్మాత శైలజ జొన్నలగడ్డ గారు మాట్లాడుతూ : సినిమా మీద ఉన్న  ప్యాషన్ తో ఈ చిత్రాన్ని సరికొత్తగా నిర్మించాము. మంచి టెక్నికల్ వాల్యూస్ తో మ్యూజిక్ బ్యాక్ డ్రాప్ తో యువతను ఆకట్టుకునే విధంగా ఈ సినిమా ఉండబోతుంది. ప్రేక్షకులకు తప్పుకుండా ఆకట్టుకుంటుంది. బుడాపెస్ట్ లో చేసిన మ్యూజిక్ ఆర్కెస్ట్రా థీమ్ సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది. అదేవిధంగా సినిమాటోగ్రఫీ హాలీవుడ్ నుంచి అలెగ్జాండర్ మ్యూజిక్ ఆర్కెస్ట్రా బుడాపెస్ట్ ఆర్కెస్ట్రా గతంలో మిషన్ ఇంపాజిబుల్, పరసైట్, స్క్విడ్ గేమ్ వంటి చిత్రాలకు ఆర్కెస్ట్రా అందించిన టీం అదేవిధంగా బాలీవుడ్ కి సంబంధించిన మ్యూజిషియన్స్ తో ఎంతో గ్రాండ్ గా చేసామన్నారు. మీడియా మరియు ప్రేక్షకులు మాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసి సినిమాను మన సక్సెస్ చేయాలని కోరుకుంటున్నామన్నారు.

నిర్మాత మరియు దర్శకుడు వంశీ జొన్నలగడ్డ గారు మాట్లాడుతూ : నేను న్యూయార్క్‌లో దర్శకత్వం గురించి చదువుకొన్నాను. అమెరికా నుంచి వచ్చిన స్క్రిప్ట్ ని మన తెలుగు నేటివిటీకి తగినట్టుగా ఇక్కడి వాళ్లకు నచ్చే విధంగా మార్పులు చేసి పిక్చరైజ్ చేసాము.  ఎంతోమంది సింక్ సౌండ్ రిస్క్ అంటున్న సింక్ సౌండ్ తోనే ఎగ్జిక్యూట్ చేసి హాలీవుడ్ స్టాండర్డ్స్ తో ఈ సినిమాను నిర్మించడం జరిగింది. ఈ సినిమాతో కథనే ఎంజాయ్ చేయకుండా కథతో పాటు మ్యూజిక్ ని కూడా ఎక్స్పీరియన్స్ చేసే విధంగా ఈ సినిమాలో సంగీతం డిజైన్ చేయించాం. మ్యూజిక్ ఒక మంచి ఫీల్ అందిస్తుందన్నారు.

నటీనటులు :
ప్రియతమ్ మంతిని, విజయ విక్రాంత్, అనంత పద్మశాల, అంజన బాలాజీ, వేద్. ఈ సినిమాకు సంగీతం ఆల్బర్టో గురియోలి అందించారు. హర్షిత తో కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసారు. రచన .. మురళికాంత్, వంశీ జొన్నలగడ్డ, విపిన్ సామ్యూల్ ఎడిటర్‌గా వ్యవహరించారు. ఈ సినిమాను త్వరలో విడుదల తేది ప్రకటిస్తామని చెప్పారు.

Also Read: KT Rama Rao: కేటీఆర్‌కు మరో ప్రతిష్ఠాత్మక ఆహ్వానం.. కవిత అరెస్ట్‌తో వెళ్తారా లేదా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News