Unstoppable season 2 episode 3 Promo : పాతిక ముప్పై మంది హీరోయిన్లతో చేసి ఉంటారు కదా?.. బాలయ్యపై శర్వానంద్ నాటీ కామెంట్స్

NBK Unstoppable season 2 episode 3 Promo అన్ స్టాపబుల్ రెండో సీజన్ మూడో ప్రోమో వచ్చింది. ఈ ఎపిసోడ్‌లో అడివి శేష్, శర్వానంద్‌లు సందడి చేశారు. ఇక బాలయ్యతో నాటీ ముచ్చట్లు పెట్టేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 1, 2022, 01:53 PM IST
  • దూసుకుపోతోన్న అన్‌స్టాపబుల్ రెండో సీజన్
  • మూడో ఎపిసోడ్ ప్రోమో విడుదల
  • బాలయ్యను ఇరికించిన శర్వానంద్
Unstoppable season 2 episode 3 Promo : పాతిక ముప్పై మంది హీరోయిన్లతో చేసి ఉంటారు కదా?.. బాలయ్యపై శర్వానంద్ నాటీ కామెంట్స్

Unstoppable season 2 episode 3 Promo : నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తోన్న అన్ స్టాపబుల్ షో ఎంతగా క్లిక్ అయిందో అందరికీ తెలిసిందే. మొదటి సీజన్ ఓ రేంజ్‌లో క్లిక్ అవ్వడంతో రెండో సీజన్ మీద మరింత దృష్టి పెట్టారు. అయితే ఈ రెండో సీజన్ మొదటి ఎపిసోడ్‌లో చంద్రబాబు, లోకేష్‌లు సందడి చేశారు. రెండో ఎపిసోడ్‌లో విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ వంటి మాస్ హీరోలు వచ్చారు. ఇక ఈ మూడో ఎపిసోడ్‌కు క్లాస్ హీరోలైన మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్‌లైన శర్వానంద్, అడివి శేష్‌లు గెస్టులుగా వచ్చారు.

రెండో ఎపిసోడ్లో బాలయ్య తన క్రష్ రష్మిక అని చెప్పడంతో.. ఈ ఎపిసోడ్‌లో ఆ కోరికను తీర్చేశాడు శర్వా. రష్మికకు వీడియో కాల్ చేసి మరీ బాలయ్యతో మాట్లాడించాడు. ఇక బాలయ్య ఈ కుర్ర హీరోలతో బాగానే కలిసిపోయాడు. శర్వా అయితే ఏకంగా బాలయ్య నాటీ పనులను బయటకు లాగేందుకు ప్రయత్నించాడు. మీరు వంద సినిమాలకు పైగా చేశారు కదా? అంటే పాతిక ముప్పై మంది హీరోయిన్లతో చేశారు కదా? అని బాలయ్యను ఇరికించే ప్రయత్నం చేశాడు శర్వా.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News