NBK 109: బాలయ్య అభిమానులను మరోసారి నిరాశ పరిచిన బాబీ..

NBK 109 - Balakrishna: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సక్సెస్ లతో దూకుడు మీదున్నాడు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి హాట్రిక్ హిట్స్ తర్వాత బాబీ దర్శకత్వంలో 109 సినిమా చేస్తున్నాడు. ఈ రోజు బాలయ్య పుట్టినరోజు సందర్బంగా ఈ సినిమా నుంచి గ్లింప్స్ ను విడుదల చేసారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Jun 10, 2024, 12:14 PM IST
NBK 109: బాలయ్య అభిమానులను మరోసారి నిరాశ పరిచిన బాబీ..

NBK 109 - Balakrishna: బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేసిన 'అఖండ' నుంచి నందమూరి నట సింహం కెరీర్ పరుగులు పెడుతోంది. అంతేకాదు దాదాపు 30 యేళ్ల తర్వాత హాట్రిక్ హిట్స్ అందుకున్నారు. అంతేకాదు రీసెంట్ గా 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వరుసగా మూడుసార్లు హిందూపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి హాట్రిక్ నమోదు చేసారు. ఒకేసారి బాలయ్య కెరీర్ లో సినిమా పరంగా.. రాజకీయ పరంగా హాట్రిక్ హిట్స్ అందుకొని ఫుల్ జోష్ లో ఉన్నాడు. ప్రస్తుతం బాలయ్య హీరోగా బాబీ దర్శకత్వంలో NBK 109 సినిమా చేస్తున్నాడు. ఈ రోజు బాలయ్య పుట్టినరోజు సందర్బంగా ఓ గ్లింప్స్ విడుదల చేసారు. ఇది చూస్తుంటే రొటీన్ యాక్షన్ డ్రామాగా ఉంది. బాలయ్య గత సినిమాల మాదిరే కనిపిస్తోంది. కొత్తగా ఏమి లేదు. కొత్తగా ఉన్నది ఏదైనా ఉందంటే.. బాలయ్య కొత్త లుక్ లో కేక పుట్టిస్తున్నాడు.

ఈ రోజు విడుదల చేసే గ్లింప్స్ తో పాటు టైటిల్ అనౌన్స్ చేస్తారని అభిమానులు ఆశ పడ్డారు. కానీ వారి ఆశలపై చిత్ర యూనిట్ నీళ్లు చల్లింది. మరోవైపు ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించలేదు. ఓ రకంగా ఈ గ్లింప్స్ ను బాలయ్య బర్త్ డే సందర్బంగా ఏదో విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో చేసారనేదే కనిపిస్తోంది. ఇందులో కొత్త పాయింట్ తో పాటు ఏది లేదు. అటు టైటిల్ అనౌన్స్ చేసినా.. ఫ్యాన్స్ హ్యాపీగా ఉండేవారు. అది లేదు. మరోవైపు విడుదల తేదిపై క్లారిటీ ఇవ్వలేదు. ఏ రకంగా చూసినా.. బాలయ్య అభిమానులను బాబీ కొల్లీ నిరాశ పరిచాడనే చెప్పాలి.
బాబీ విషయానికొస్తే.. గతేడాది చిరుకు వాల్తేరు వీరయ్య వంటి హిట్ అందించాడు.  ఇపుడు బాల‌య్య‌ను ఇప్పటి వరకు ఎవరు చూపించని విధంగా సరికొత్తగా చూపించబోతున్నట్టు ఈ గ్లింప్స్ చూస్తే తెలుస్తోంది. ఈ చిత్రంలో బాల‌య్య మ‌రోసారి డాన్ తరహా పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. బాబీతో చేస్తోన్న సినిమాపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఈ సినిమాలో బాలకృష్ణ మరోసారి డ్యూయల్ రోల్లో కనిపించబోతున్నట్టు సమాచారం.

రీసెంట్‌గా బాలకృష్ణ రెండు పాత్రల్లో నటించిన  'అఖండ', వీరసింహారెడ్డి, అంతకు ముందు.. లెజెండ్, సింహా చిత్రాల్లో  బాలయ్య రెండు విభిన్నపాత్రల్లో నటించారు. ఆయా సినిమాలు  బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని నమోదు చేశాయి. ఇపుడు అదే కోవలో బాబీ.. ఈ సినిమాలో బాలకృష్ణ రెండు పాత్రల్లో అలరించనున్నట్టు సమాచారం.  

ఈ సినిమాలో బాలయ్యను ఢీ కొట్టే విలన్ పాత్రలో బాలీవుడ్ యాక్ష‌న్ హీరో బాబీ దేవోల్ యాక్ట్ చేస్తున్నారు.  ఈ మూవీతో తెలుగులో ఫస్ట్ మూవీ. అటు హరి హరవీరమల్లు సినిమాలో కూడా నటిస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్యను ఢీ కొట్టే సీన్స్ హైలెట్స్‌గా ఉండనున్నట్టు సమాచారం.  డిక్టేట‌ర్, అఖండ‌, వీర‌సింహారెడ్డి, భ‌గ‌వంత్ కేసరి సినిమాల త‌ర్వాత  థ‌మ‌న్ ఈ చిత్రానికి  సంగీతం  అందిస్తున్నారు. జైల‌ర్ ఫేమ్ విజ‌య్ కార్తీక్ సినిమ‌టోగ్ర‌ఫీ అందిస్తున్నారు. నిరంజ‌న్ రెడ్డి ఎడిటింగ్. అవినాష్ కొల్లా ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.  సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు.   శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది.

Read more; Viral video: ఒరేయ్.. ఎవర్రా మీరంతా.. వర్షం బురద నీళ్లను వదలరా.. వైరల్ గా మారిన వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News