Bahubali before the beginning: వెబ్ సిరీస్ రూపంలో బాహుబలి: బిఫోర్ ది బిగినింగ్

Nayanthara in Bahubali before the beginning web series: నయనతార డిజిటల్ ఎంట్రీకి రెడీ అవుతోంది. సౌతిండియాలో వెండితెరపై లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న నయనతార డిజిటల్ ఎంట్రీ అంటే మామూలుగా ఉండదు కదా మరి. అందుకే ఆమె తన డిజిటల్ ఎంట్రీ కోసం బాహుబలి ప్రీక్వెల్‌‌‌‌‌‌‌‌ బాహుబలి: బిఫోర్ ది బిగినింగ్‌ని ఛాయిస్‌గా ఎంచుకుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 17, 2021, 03:50 PM IST
Bahubali before the beginning: వెబ్ సిరీస్ రూపంలో బాహుబలి: బిఫోర్ ది బిగినింగ్

Nayanthara in Bahubali before the beginning web series: నయనతార డిజిటల్ ఎంట్రీకి రెడీ అవుతోంది. సౌతిండియాలో వెండితెరపై లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న నయనతార డిజిటల్ ఎంట్రీ అంటే మామూలుగా ఉండదు కదా మరి. అందుకే ఆమె తన డిజిటల్ ఎంట్రీ కోసం బాహుబలి ప్రీక్వెల్‌‌‌‌‌‌‌‌ని ఛాయిస్‌గా ఎంచుకుంది. అవును.. ఎస్ఎస్ రాజమౌళి, ప్రసాద్ దేవినేనితో కలిసి బాహుబలి: బిఫోర్ ది బిగినింగ్ పేరుతో నెట్​ఫ్లిక్స్ ఓ వెబ్ సిరీస్‌‌‌‌‌‌‌‌ని నిర్మిస్తోంది​. బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కన్‌క్లూజన్ చిత్రాలకు ఏ మాత్రం తీసిపోకుండా భారీ బడ్జెట్‌‌‌‌‌‌‌‌తో తెరకెక్కించనున్న ఈ వెబ్ సిరీస్ రెగ్యులర్ షూట్​ సెప్టెంబర్ నుండి మొదలు కానుంది. 

బాహుబలి బిఫోర్ ది బిగినింగ్ వెబ్ సిరీస్ మూడు సీజన్స్‌‌‌‌‌‌‌‌లో స్ట్రీమింగ్ చేసేందుకు నెట్‌ఫ్లిక్స్ ప్లాన్ చేయగా.. అందులో మొదటి సీజన్‌‌‌‌‌‌‌‌ షూటింగు‌‌‌‌‌ని దాదాపు పూర్తి చేసినప్పటికీ ఔట్‌‌‌‌‌‌‌‌పుట్‌‌‌‌‌‌‌‌ సరిగ్గా రాలేదనే ఉద్దేశంతో మళ్లీ మొదటి నుంచి తెరకెక్కించబోతున్నారని తెలుస్తోంది. బాహుబలి చిత్రానికి ఆయువుపట్టుగా నిలిచిన శివగామి పాత్రకి వమికా గబ్బిని (Actress Wamika Gabbi) తీసుకున్నారు. ఇక నయనతార (Actress Nayanthara) పాత్ర ఏంటనే విషయంలోనే ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. 

Also read : Sonu Sood's flat in Hyderabad: హైదరాబాద్‌లో ఫ్లాట్ కొన్న సోనూ సూద్

తెలుగు, తమిళ, కన్నడ, మళయాళం భాషలతో పాటు హిందీ, ఇంగ్లిష్‌‌‌‌‌‌‌‌ భాషల్లోనూ బాహుబలి బిఫోర్ ది బిగినింగ్ వెబ్ సిరీస్ (Bahubali before the beginning web series) ప్రసారం కానుంది. రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కించిన బాహుబలి లాంటి భారీ బ్లాక్ బస్టర్ చిత్రానికి ప్రీక్వెల్ కావడంతో ఈ వెబ్ సిరీస్‌పై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి.

Also read : Evaru Meelo Koteeswarulu: ఎవరు మీలో కోటీశ్వరులు షోలో Jr Ntr, Ram Charan ?

Trending News