Saindhav Movie: సైంధవ్ లో మరో స్పెషల్ ఎట్రాక్షన్.. స్టార్ బాలీవుడ్ నటుడు కూడా!

Nawazuddin Siddiqui In Saindhav: వెంకటేష్ హీరోగా హిట్ సినిమాల దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైంధవ్ సినిమాలో బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ నటిస్తున్నాడు. ఆ వివరాలు

Written by - Chaganti Bhargav | Last Updated : Jan 26, 2023, 11:09 AM IST
Saindhav Movie: సైంధవ్ లో మరో స్పెషల్ ఎట్రాక్షన్.. స్టార్ బాలీవుడ్ నటుడు కూడా!

Nawazuddin Siddiqui In Saindhav: వెంకటేష్ హీరోగా హిట్ సినిమాల దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలో ఒక సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. శ్యామ్ సింగరాయ్ నిర్మాత వెంకట్ బోయినపల్లి నిర్మాణంలో భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకి సైంధవ అనే టైటిల్ కూడా ఇప్పటికే ఫిక్స్ చేశారు. ఈ విషయాన్ని నిన్ననే అధికారికంగా ప్రకటిస్తూ ఒక గ్లిమ్స్ కూడా విడుదల చేశారు.

విక్టరీ వెంకటేష్ ని మనం మునుపెన్నడూ చూడని కొత్త లుక్ లో ఈ ఫస్ట్ లుక్ లో చూపించాడు డైరెక్టర్ శైలేష్ కొలను. ఇక ఈ వీడియోకి ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన అయితే లభిస్తుంది. అయితే మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాకి సంబంధించిన ఓపెనింగ్ కూడా ఈరోజు ఘనంగా జరుగుతోంది. అలాగే  ఈ సినిమాలో ఒక బాలీవుడ్ నటుడిని కూడా తీసుకున్నారు. బాలీవుడ్లో విలక్షణ నటుడిగా పేరు ఉన్న నవాజుద్దీన్ సిద్ధిఖి ఈ సినిమాలో ఒక కీలకపాత్రలో నటిస్తున్నట్లు ఫస్ట్ లుక్ విడుదల చేయడం జరిగింది.

రిపబ్లిక్ డే సందర్భంగా మూవీని లాంచ్ చేస్తూనే నవాజుద్దీన్ సిద్ధికి ఈ సినిమాలో భాగమైనట్లు గా ప్రకటించారు. అయితే ఈ సినిమాలో నవాజుద్దీన్ సిద్ధిఖి పాత్ర కేవలం చిన్నగా ఉండదని సినిమా మొత్తం మీద ఆయనది కీలక పాత్రగా ఉండబోతుందని తెలుస్తోంది. ఇప్పటికే తమిళంలో పెట్ట అనే మూవీతో తమిళ సినీ రంగ ప్రవేశం చేసిన నవాజుద్దీన్ సిద్ధిఖి ఇప్పుడు ఈ సైంధవ సినిమా ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది.

కచ్చితంగా నవాజుద్దీన్ సిద్ధికి పాత్ర అద్భుతంగా డిజైన్ చేసినట్లుగానే చెప్పాలి. ఎందుకంటే ఆయన మామూలు సినిమాలను అంత ఈజీగా ఒప్పుకోరు, ఆయన ఒప్పుకున్న సినిమాల్లో పాత్రలు మాత్రం అద్భుతంగా కుదురుతూ ఉంటాయి. మరి చూడాలి ఈ సినిమాలో ఆయన పాత్ర ఎలా ఉండబోతుంది అనేది. 
Also Read: Malikappuram Movie Review: మాలికాపురం మూవీ ఎలా ఉందంటే?  

Also Read: Balakrishna Controversy:మాకేం వివాదం అనిపించలేదు.. ఇక లాగకండి.. ఎస్వీ రంగారావు మనవళ్లు వీడియో రిలీజ్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

 
 

Trending News