Actor karthik Engagement: త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్న 'నారప్ప' నటుడు.. ఎంగేజ్​మెంట్​ ఫిక్స్ వైరల్..

Actor karthik Engagement:  'నారప్ప' ఫేమ్‌ కార్తీక్ రత్నం త్వరలో ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. ప్రస్తుతం ఈ నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్  అవుతున్నాయి.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 6, 2022, 01:56 PM IST
  • న‌టుడు కార్తీక్ ర‌త్నం ఎంగేజ్​మెంట్​
  • హాజ‌ర‌యిన న‌వీన్ చంద్ర, ఫిక్స్ వైరల్
Actor karthik Engagement:  త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్న 'నారప్ప' నటుడు.. ఎంగేజ్​మెంట్​ ఫిక్స్ వైరల్..

Actor karthik Engagement: 'కేరాఫ్‌ కంచరపాలెం', 'నారప్ప', 'అర్ధ శతాబ్దం' సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు కార్తీక్‌ రత్నం (Karthik Ratnam). త్వరలో ఈ హీరో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తాజాగా ఇతడి నిశ్చితార్థం హైదరాబాద్ కు చెందిన ఓ యువతితో శనివారం జరిగింది. కుటుంబసభ్యులు, స్నేహితులు సమక్షంలో ఈ వేడుక నిర్వహించారు. ఈ ఎంగేజ్‌మెంట్‌కు నటుడు నవీన్ చంద్ర (actor Naveen Chandra) హాజరయి..వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. వీరిద్దరూ కలిసి 'అర్థశతాబ్దం' మూవీలో కలిసి నటించారు. ప్రస్తుతం ఇతడి నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. 

కార్తీక్ థియేటర్‌ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ ప్రారంభించాడు. అనంతరం 'కేరాఫ్‌ కంచరపాలెం' సినిమాతో తెరగ్రేటం చేశాడు. . ఈ సినిమా విజయం సాధించినప్పటికీ కార్తీక్‌కు అంతగా గుర్తింపు రాలేదు. అనంతరం అతడు సోలో హీరోగా చేసిన 'అర్ధ శతాబ్దం' కూడా ఆశించిన స్థాయిలో గుర్తింపు తీసుకురాలేకపోయింది. ఇటీవల విడుదలైన 'నారప్ప'(Narappa Movie) లో వెంకటేశ్‌ పెద్దకుమారుడిగా మునికన్న  పాత్రలో నటించి మెప్పించాడు కార్తీక్‌ . అంతేకాకుండా నితిన్ 'చెక్', ఇటీవల రిలీజ్ అయిన ‘రౌడీ బాయ్స్’ సినిమాలోనూ నటించాడు. అందివచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ దూసుకుపోతున్నారు కార్తీక్. 

Also Read: Trivikram Remuneration: త్రివిక్రమ్ షాకింగ్ రెమ్యూనరేషన్.. 'సూపర్ స్టార్' మహేష్ బాబుకు పోటీగా!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News