Nara Lokesh Breaks Down: తారకరత్న మరణ వార్త విని కన్నీటిపర్యంతమైన లోకేష్.. వాళ్ల వల్ల కుడా కాలేదట!

Nara Lokesh Breaks Down : తన బావ నందమూరి తారకరత్న మరణించారనే విషయం తెలుసుకున్న వెంటనే నారా లోకేష్ కన్నీటి పర్యంతమైనట్లుగా అప్పుడు ఆయన దగ్గర ఉన్న సన్నిహితులు వెల్లడించారు, ఆ వివరాల్లోకి వెళితే

Written by - Chaganti Bhargav | Last Updated : Feb 19, 2023, 12:34 PM IST
Nara Lokesh Breaks Down: తారకరత్న మరణ వార్త విని కన్నీటిపర్యంతమైన లోకేష్.. వాళ్ల వల్ల కుడా కాలేదట!

Nara Lokesh Breaks Down after hearing Tarak Ratna Death News: నందమూరి తారకరత్న గత నెలలో నారా లోకేష్ తలపెట్టిన పాదయాత్ర ప్రారంభోత్సవం రోజు ఆ పాదయాత్రలో పాల్గొన్నారు. ఆ పాదయాత్రలో పాల్గొన్న సమయంలో ఆయనకు కార్డియాక్ అరెస్ట్ అయింది. సుమారు 45 నిమిషాల పాటు ఆయన గుండె కొట్టుకోవడం కూడా ఆగిపోయింది. తర్వాత కుప్పంలోని మెడికల్ కాలేజీ వైద్యులు ఆయనకు సిపిఆర్ చేసి గుండె మళ్ళి కొట్టుకునేలా చేశారు. తరువాత ఆయనకు మెరుగైన వైద్య చికిత్స కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ  హాస్పిటల్ కి తరలించి ఆయనకు పూర్తి చికిత్స అందించడం ప్రారంభించారు.

అలా సుమారు 23 రోజుల పాటు ఆయనకు దేశ విదేశాల వైద్యులు చికిత్స అందించిన ఆయన కోలుకోలేక పోయారు. అయితే కొంతమంది టీడీపీని వ్యతిరేకించే రాజకీయ పక్షాల వారు తారకరత్న నారా లోకేష్ పాదయాత్ర రోజే చనిపోయారని అయితే నారా లోకేష్ మీద ఐరన్ లెగ్ అనే ముద్ర పడుతుంది కాబట్టి ఇన్ని రోజులు ఆయన బతికి ఉన్నట్లు చికిత్స చేయిస్తూ వస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. అయితే తన బావ నందమూరి తారకరత్న మరణించారనే విషయం తెలుసుకున్న వెంటనే నారా లోకేష్ కన్నీటి పర్యంతమైనట్లుగా అప్పుడు ఆయన దగ్గర ఉన్న సన్నిహితులు చెబుతున్నారు.

తారకరత్నతో నారా లోకేష్ కి అనుబంధం ఎక్కువగా ఉండటం వల్ల తారకరత్న మరణం నారా లోకేష్ ని కలిసి వేసిందని వెంటనే యాత్రకు బ్రేక్ ఇచ్చి హైదరాబాద్ వెళుతున్నట్లుగా ప్రకటించారని చెబుతున్నారు నిజానికి నిన్న యాత్రకు విరామం, అందువల్ల సాయంత్రం విశ్రాంతిగా ఉన్న సమయంలో ఈ దుర్వార్త తెలియడంతో నారా లోకేష్ ఒక్కసారిగా కన్నీటి పర్యంతమయ్యారని చెబుతున్నారు. అక్కడ ఉన్న ఆయన సన్నిహితులు ఓదార్పు కూడా పనిచేయలేదని, తారకరత్నతో తనకి ఉన్న సాన్నిహిత్యాన్ని తలుచుకుని మనస్థాపానికి గురై కన్నీరు పెట్టుకున్నారని చెబుతున్నారు.

ఈ క్రమంలోనే తారకరత్నకు నివాళులర్పించేందుకు హైదరాబాదుకు బయలుదేరి వెళ్లాలని నిర్ణయించుకున్నారని ముందు ఆదివారం నాడు పాదయాత్ర రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ సోమవారం, మంగళవారం కూడా పాదయాత్ర చేయడం డౌటేనని అంటున్నారు. ఎందుకంటే తారకరత్న అంత్యక్రియలు పూర్తయిన తర్వాత బుధళవారం నుంచి నారా లోకేష్ ఈ పాదయాత్ర చేపట్టే అవకాశం ఉందని అంటున్నారు. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన తన బావమరిది ఇలా చనిపోవడంతో నారా లోకేష్ తీవ్ర విషాదంలో మునిగిపోయారని ఇది అసలు ఊహించలేదని ఆయన కన్నీటి పర్యంతమయ్యారని చెబుతున్నారు. మొత్తం మీద ఈ వార్త సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతుంది టిడిపి అభిమానులు అందరూ కూడా తారకరత్న మృతికి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.    

Also Read: Taraka Ratna Death Reason: తారకరత్న చావుకు అదే కారణం.. అసలు ఏమైందంటే?

Also Read: Taraka Ratna Siva Devotee: శివుని భక్తునిగా నటించి శివరాత్రి రోజే శివైక్యం.. శివుని ఆన లేనిదే చీమైనా కుట్టునా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

 

Trending News