Dasara Advance Bookings: దుమ్మురేపుతున్న నాని 'దసరా' అడ్వాన్స్ బుకింగ్స్..రికార్డు బ్రేక్!

Dasara USA Pre Sales: నాని హీరోగా నటిస్తున్న దసరా మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ దుమ్ము రేపుతున్నాయి, ఏకంగా ఈ సినిమా నాని గత సినిమాల కంటే ఎక్కువ వసూళ్లు రాబడుతోంది అని తెలుస్తోంది. ఆ వివరాలు

Written by - Chaganti Bhargav | Last Updated : Mar 28, 2023, 01:07 PM IST
Dasara Advance Bookings: దుమ్మురేపుతున్న నాని 'దసరా' అడ్వాన్స్ బుకింగ్స్..రికార్డు బ్రేక్!

Dasara Pre Advance Booking Records: నాని హీరోగా నటిస్తున్న దసరా సినిమా మరి కొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మీద ప్రకటించిన నాటి నుంచి అంచనాలు ఉన్నాయి. దానికి తగినట్లుగా ఈ సినిమాలో నాని ఫస్ట్ లుక్ విడుదలైనప్పటి నుంచి నాని అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులలో సైతం అంచనాలు ఏర్పడుతున్నాయి. ఇక ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ విషయంలో నాని దుమ్ము రేపుతున్నట్లుగా తెలుస్తోంది. గతంలో మునుపెన్నడూ లేని విధంగా నాని సినిమాకు అడ్వాన్స్ బుకింగ్ నమోదు అవుతున్నాయి.

ఒక్క హైదరాబాద్ సిటీలోనే మొదటి రోజు 404 షోలు పడుతున్నాయని మొదటి రోజు గ్రాస్ కలెక్షన్ ఇప్పటికే రెండు కోట్లు దాటిందని తెలుస్తోంది. అమెరికాలో కూడా ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ ప్రీ సేల్స్ దుమ్మురేపుతున్నాయి. నాని కెరీర్ లోనే హైయెస్ట్ అడ్వాన్స్ బుకింగ్ నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమెరికాలో ఇప్పటికే 2075 వేల డాలర్లు వసూలు చేయగా ఈరోజు గడిచే లోపు దాదాపు అర మిలియన్ డాలర్లు వసూలు చేసే అవకాశం కనిపిస్తోంది.

ఈ సినిమా ఒక రోజు ముందుగానే అమెరికాలో ప్రీమియర్ కానుంది. ఇక ప్రపంచవ్యాప్తంగా మార్చి 30వ తేదీన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా ఏకకాలంలో విడుదలవుతోంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే నాని గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాకి వరల్డ్ వైడ్ బిజినెస్ కూడా గట్టిగానే అయింది. నైజాం 13 కోట్ల 70 లక్షలు, సీడెడ్ ఆరు కోట్ల యాభై లక్షలు, ఉత్తరాంధ్ర మూడు కోట్ల 90 లక్షలు, ఈస్ట్ గోదావరి రెండు కోట్ల 35 లక్షలు, వెస్ట్ గోదావరి రెండు కోట్లు, గుంటూరు మూడు కోట్లు, కృష్ణ రెండు కోట్లు, నెల్లూరు కోటి 20 లక్షలు వెరసీ ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ మొత్తం 34 కోట్ల 65 లక్షలు.

 కర్ణాటక రెండు కోట్ల 85 లక్షలు, మిగతా భాషలో కలిపి కోటిన్నర, నార్త్ ఇండియాలో ఐదు కోట్లు, ఓవర్సీస్ లో ఆరు కోట్లు వెరసి మొత్తం 50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది, 51 కోట్లు వసూలు చేస్తే ఈ సినిమా హిట్ అని అంటున్నారు. ఇక శ్రీరామనవమి సందర్భంగా మార్చి 30వ తేదీ ఈ సినిమా విడుదల అవుతూ ఉండగా శుక్రవారం, శనివారం, ఆదివారం లాంగ్ వీకెండ్ రావడంతో పాటు జీతాలు పడే రోజులు కూడా కావడంతో ఖచ్చితంగా ఈ సినిమా వసూళ్ల విషయంలో మంచి అద్భుతాలు జరిగే అవకాశం ఉందని సినిమా యూనిట్ అంచనా వేస్తోంది.

Also Read: MM Keeravani Bed rest: ఆస్కార్ అందుకుని ఇండియా వచ్చిన కీరవాణికి బెడ్ రెస్ట్.. ఏమైందంటే?

Also Read: Dasara Movie First Review: రచ్చ రేపిన నాని.. పుష్ప 2.0గా దసరా.. రేటింగ్ ఎంతంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook

 

Trending News