Nani: పవన్ కళ్యాణ్‌ దర్శకుడితో నాని క్రేజీ ప్రాజెక్ట్.. త్వరలో అఫీషియల్ ప్రకటన..

Nani:నాని వరుస సినిమాలతో దూకుడు మీదున్నాడు. అంతేకాదు.. నటుడిగా ఒక జానర్‌కు పరిమితం కాకుండా.. క్లాస్ మాస్ అనే తేడా లేకండా రఫ్పాడించేస్తున్నాడు. లాస్ట్ ఇయర్ దసరా వంటి మాస్ ఓరియంటెడ్ మూవీలో రగ్గడ్ లుక్‌తో అభిమానులను అలరించిన నాని.. ఆ తర్వాత 'హాయ్ నాని' అంటూ పూర్తి క్లాస్‌గా కనిపించారు. ఆ సంగతి పక్కన పెడితే.. నాని మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు అది పవన్ కళ్యాణ్ డైరెక్టర్‌తో నెక్ట్స్ మూవీ చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం.  

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 7, 2024, 12:13 PM IST
Nani: పవన్ కళ్యాణ్‌ దర్శకుడితో నాని క్రేజీ ప్రాజెక్ట్.. త్వరలో అఫీషియల్ ప్రకటన..

Nani with Pawan Kalyan director Sujeeth : నాని ప్రస్తుతం 'సరిపోదా శనివారం' అనే సినిమా చేస్తున్నారు. ఇప్పటికే రెండు షెడ్యూల్లు కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమా ఈ యేడాది సమ్మర్ కానుకగా విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. ఇక నాని గతేడాది దసరా మూవీతో మంచి సక్సెస్ అందుకున్నాడు. పూర్తి తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ నాని కెరీర్‌లో హైయ్యెస్ట్ వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు.

అటు దసరా సక్సెస్ తర్వాత కొత్త దర్శకుడు శౌర్యవ్ దర్శకత్వంలో చేసిన 'హాయ్ నాన్న' మూవీలో పూర్తి క్లాస్‌గా కనిపించి అభిమామానులను అలరించాడు. ఈ మూవీ ఓవరాల్‌గా బ్రేక్ ఈవెన్ సాధించింది. ఓ రకంగా బ్యాక్ టూ బ్యాక్ మాస్ అండ్ క్లాస్ మూవీలతో హిట్ అందుకొని దూకుడు మీదున్నాడు. ప్రస్తుతం సరిపోదా శనివారం అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే రెండు షెడ్యూల్లు కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమాను మరో షెడ్యూల్‌తో కంప్లీట్ కానుంది.

ఈ మూవీ తర్వాత పవన్ కళ్యాణ్‌తో 'ఓజీ' (Original Gangster) మూవీ చేస్తోన్న  సుజిత్ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేయనున్నట్టు సమాచారం.  ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అప్పటి వరకు 'ఓజీ' మూవీ హోల్డ్‌లో ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఫ్రీ అయ్యాకా.. ఈ యేడాది సెకండాఫ్‌లో ఈ సినిమా షూటింగ్‌లో పవన్ కళ్యాణ్ జాయిన్ కానున్నారు. అప్పటి వరకు సుజిత్ ఓ స్టోరీతో నానితో ఓ సినిమా చేయాలనే ప్లాన్‌లో ఉన్నాడు. ఇప్పటికే కథను రెడీ చేసి నానికి వినిపిస్తే ఓకే చెప్పాడట. ఈ మూవీ కూడా స్టైలిష్ యాక్షన్ ఎంటర్టేనర్ అని చెబుతున్నారు. త్వరలో ఈ సినిమా విషయమై అధికారిక ప్రకటన వెలుబడాల్సి వుంది. ఇక పవన్ కళ్యాణ్ బిజీగా ఉండటంతో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను పక్కన పెట్టి .. రవితేజతో 'మిస్టర్ బచ్చన్' మూవీ చేస్తున్నాడు హరీష్ శంకర్. అటు చిరు మూవీ తర్వాత పవన్ కళ్యాణ్ మూవీ సినిమాను కంప్లీట్ చేయనున్నాడు హరీష్ శంకర్. ఇపుడు సుజిత్ కూడా పవన్ కళ్యాణ్‌ సినిమా ఆలస్యం అయ్యేలా ఉండటంతో నానితో అర్జంట్‌గా ఓ సినిమా తెరకెక్కించి త్వరగా కంప్లీట్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నాడట. ఏది ఏమైనా.. నానితో సుజిత్ మూవీ ఎలా ఉండబోతుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇదీ చదవండి: Ruchaka Rajyog 2024: రుచకరాజ్యయోగం ఈరాశికి ప్రత్యేకం.. మార్చిలోగా కొత్త ఉద్యోగం, కాసులవర్షం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News