Bhagavanth Kesari Teaser: తెలంగాణ యాసలో ఇరగదీసిన బాలయ్య .. 'భగవంత్ కేసరి' టీజర్ అదుర్స్..

Bhagavanth Kesari: ఇవాళ బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా భగవంత్ కేసరి టీజర్ ను విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో తెలంగాణ యాసలో బాలయ్య చెప్పిన డైలాగ్ టీజర్ కే హైలైట్ గా నిలుస్తోంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jun 10, 2023, 11:15 AM IST
Bhagavanth Kesari Teaser: తెలంగాణ యాసలో ఇరగదీసిన బాలయ్య .. 'భగవంత్ కేసరి' టీజర్ అదుర్స్..

Bhagavanth Kesari Teaser: నందమూరి బాలకృష్ణ, అనిల్‌ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘'భగవంత్‌ కేసరి'’ (Bhagavanth Kesari). యాక్షన్ ఎంటర్‌టైనర్‌ రూపొందుతున్న ఈ మూవీలో కాజల్ హీరోయిన్ గా, శ్రీలీల, బాలీవుడ్ నటుడు అర్జున్ రాంఫాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శనివారం బాలయ్య పుట్టినరోజును పురస్కరించుకుని ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. 'నేలకొండ భగవంత్ కేసరి.. ఈ పేరు శానా ఏండ్లు యాదుంటది' అంటూ తెలంగాణ యాసలో నటసింహం చెప్పిన డైలాగ్ గుస్ బంప్స్ తెప్పిస్తుంది. ఇంతకముందెన్నడూ చూడని లుక్ లో బాలయ్య కనిపిస్తున్నారు. 

ఈ మూవీకి సంగీత దర్శకుడిగా థమన్ వ్యవహారిస్తున్నారు. ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి - హరీశ్ పెద్ది నిర్మిస్తున్నారు.  కథ అంతా కూడా తండ్రీ కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో సాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని దసరాకి విడుదల చేయనున్నారు. టీజర్ విడుదల చేయడంతో బాలయ్య అభిమానులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. టీజర్ బాగుండటంతో మూవీపై అంచనాలు మరింత పెరిగాయి. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News