Accident : బాలకృష్ణ సినిమా యూనిట్ కు యాక్సిడెంట్… నలుగురు ఆర్టిస్టులకు తీవ్ర గాయాలు?

Junior Artists Accident: నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 108వ సినిమా షూటింగ్ ప్రారంభమైంది, అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా రూపొందుతోన్న ఈ సినిమా యూనిట్ ప్రమాదానికి గురైంది. ఆ వివరాలు   

Written by - Chaganti Bhargav | Last Updated : Dec 17, 2022, 05:18 PM IST
Accident : బాలకృష్ణ సినిమా యూనిట్ కు యాక్సిడెంట్… నలుగురు ఆర్టిస్టులకు తీవ్ర గాయాలు?

Nandamuri Balakrishna - Anil Ravipudi Movie Junior Artists Accident: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతానికి వరుస సినిమాలు చేస్తూ వెళుతున్న సంగతి తెలిసిందే. చివరిగా అఖండ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ప్రస్తుతం తన కెరీర్లో 107వ సినిమా చేస్తున్నాడు. వీర సింహ రెడ్డి అనే పేరుతో రూపొందిన ఈ సినిమా జనవరి 12వ తేదీన సంక్రాంతి సందర్భంగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తయింది, చిన్న చిన్న ప్యాచ్ ఆఫ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ప్రస్తుతానికి శరవేగంగా ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు అయితే జరుగుతున్నాయి.

అయితే ఆయన హీరోగా నటిస్తున్న 108వ సినిమా కూడా షూటింగ్ ప్రారంభమైంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా 108వ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్గా నటిస్తుందని ప్రచారం జరుగుతోంది ఆమె. బాలకృష్ణ కుమార్తె పాత్రలో నటించబోతుందని అంటున్నారు. ఈ విషయం క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఇప్పుడు అసలు విషయం ఏమిటంటే బాలకృష్ణ, అనిల్ రావిపూడి సినిమాలో జూనియర్ ఆర్టిస్టులుగా నటిస్తున్న కొందరి వాహనం ప్రమాదానికి గురి అయినట్లు తెలుస్తోంది.

ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనేందుకు జూనియర్ ఆర్టిస్టులు వెళుతున్న వ్యాన్ ఒకటి ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. హైదరాబాదులోని బాచుపల్లి వెళుతూ ఉండగా ప్రగతి నగర్ చెరువు దగ్గర ఈ వాహనం బోల్తా పడినట్లు తెలుస్తోంది. ఇక ఈ ప్రమాదంలో నలుగురు జూనియర్ ఆర్టిస్టులకు తీవ్ర గాయాలైనట్లు చెబుతున్నారు. ఈ రోజు తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకుని జూనియర్ ఆర్టిస్టులను హాస్పిటల్ కి తరలించారు.

ఇక అనిల్ రావిపూడి బాలకృష్ణ సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో బాలకృష్ణ మునుపెన్నడూ కనిపించని ఒక పాత్రలో కనిపించబోతున్నారు అనే ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ అధికారికంగా ప్రారంభమైంది కానీ బాలకృష్ణ మాత్రం షూటింగ్లో పాల్గొంటున్నారా లేదా అనే విషయం మీద మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్ మీద ఈ సినిమాను హరీష్ పెద్ది, సాహు గారపాటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 

Also Read: Avatar 2 Vs kgf chapter 2 : కేజీయఫ్‌ను దాటని అవతార్ 2.. కలెక్షన్లలో కనిపించిన మ్యాజిక్

Also Read: Kushboo Sundar : ఖుష్బూ సుందర్ ఇంట తీవ్ర విషాదం.. ఎమోషనల్ అవుతూ పోస్ట్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

 
 

Trending News